Red Hat Enterprise Linux 5.3

విడుదల నోడ్స్‍

అన్ని ఆకృతులకు విడుదల నోడ్స్‍.

Ryan Lerch

Red Hat ఇంజనీరింగ్ కాంటెంట్ సేవలు

Legal Notice

Copyright 2008 Red Hat, Inc.. This material may only be distributed subject to the terms and conditions set forth in the Open Publication License, V1.0 or later (the latest version of the OPL is presently available at http://www.opencontent.org/openpub/).

Red Hat and the Red Hat "Shadow Man" logo are registered trademarks of Red Hat, Inc. in the United States and other countries.

All other trademarks referenced herein are the property of their respective owners.

The GPG fingerprint of the [email protected] key is:

CA 20 86 86 2B D6 9D FC 65 F6 EC C4 21 91 80 CD DB 42 A6 0E



Abstract

ఈ పత్రము Red Hat Enterprise Linux 5.3 కొరకు విడుదల నోడ్స్‍‌ను వివరిస్తుంది.


1. సంస్థాపనా-సంభందిత నోడ్స్‍
1.1. అన్ని ఆకృతులు
1.2. PowerPC ఆకృతులు
1.3. s390x ఆకృతులు
1.4. ia64 ఆకృతి
2. భవిష్యత్ నవీకరణలు
3. డ్రైవర్ నవీకరణలు
3.1. అన్ని ఆకృతులు
4. కెర్నలు-సంభందిత నివేదిక
4.1. అన్ని ఆకృతులు
4.2. x86 ఆకృతులు
4.3. PowerPC ఆకృతులు
4.4. x86_64 ఆకృతులు
4.5. s390x ఆకృతులు
4.6. ia64 ఆకృతి
5. వర్చ్యులైజేషన్
5.1. భవిష్యత్ నవీకరణలు
5.2. పరిష్కరించిన విషయాలు
5.3. తెలిసిన విషయాలు
6. సాంకేతిక పరిదృశ్యాలు
7. పరిష్కరించిన విషయాలు
7.1. అన్ని ఆకృతులు
7.2. x86_64 ఆకృతులు
7.3. s390x ఆకృతులు
7.4. PowerPC ఆకృతులు
8. తెలిసిన విషయాలు
8.1. అన్ని ఆకృతులు
8.2. x86 ఆకృతులు
8.3. x86_64 ఆకృతులు
8.4. PowerPC ఆకృతులు
8.5. s390x ఆకృతులు
8.6. ia64 ఆకృతి
A. పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర

ఈ విభాగంలోని సమాచారం ప్రత్యేకించి Anaconda సంస్థాపనకు మరియూ Red Hat Enterprise Linux 5.3యొక్క సంస్థాపనకు.

కొత్తవాటిని మరియు మారిన సంకలనాలను Red Hat Network సంస్థాపించగలదు మరియు ఉన్నటువంటి Red Hat Enterprise Linux 5 సిస్టమ్‌ను నవీకరించగలదు. ప్రత్యామ్నాయంగా, Anaconda ఉన్న Red Hat Enterprise Linux 5 సిస్టమ్‌ను నవీకరించగలదు లేదా తాజా Red Hat Enterprise Linux 5.3 సంస్థాపనను జరుపగలదు.

గమనిక: Red Hat Enterprise Linux 5.3 యొక్క బీటా విడుదలనుండి ఈ GA విడుదలకు నవీకరించుటకు మద్దతీయబడదు.

ఇంకా, Red Hat Enterprise Linux యొక్క ముందలి వర్షన్స్‍‌నుండి Red Hat Enterprise Linux 5.3కు నవీకరించు ఐచ్చికాన్ని Anaconda ఇచ్చినప్పటికి, Red Hat ప్రస్తుతం దీనికి మద్దతివ్వుటలేదు. చాలా సాధారణంగా, Red Hat Enterprise Linux యొక్క ఏ మేజర్‌వర్షన్స్‍ మద్య ఇన్-ప్లేస్ నవీకరణలను Red Hat మద్దతివ్వదు. ( మేజర్‌వర్షన్ అనునది వర్షన్ యొక్క మొత్తంసంఖ్యను మారుటను సూచిస్తుంది. ఉదాహరణకు, Red Hat Enterprise Linux 4 మరియు Red Hat Enterprise Linux 5 అను రెండు Red Hat Enterprise Linux యొక్క మేజర్‌వర్షన్స్‍.)

మేజర్ విడుదలల ఇన్-ప్లేస్ నవీకరణలు అన్ని సిస్టమ్ అమరికలను, సేవలను లేదా వినియోగదారి ఆకృతీకరణలను భద్రపరచలేదు. కనుక, ఒక మేజర్‌వర్షన్‌ నుండి మరియొకదానికి నవీకరిస్తున్నప్పుడు తాజా సంస్థాపనను Red Hat గట్టిగా సిఫార్స్‍ చేస్తోంది.

1.1. అన్ని ఆకృతులు

  • Anacondaయొక్క Text Mode సంస్థాపన,సంస్థాపన పూర్తిచేయుటకు యిప్పుడు వర్చ్యువల్ నెట్వర్కు కంప్యూటింగ్ (VNC)కు మారే ఐచ్చికాన్ని అందిస్తోంది.

  • ఎన్క్రిప్టెడ్ సాఫ్టువేరు RAID మెంబర్ డిస్కులు (software RAID విభజనలు) యిప్పుడు మద్దతిచ్చుటలేదు. ఏమైనప్పటికి, ఎన్క్రిప్టెడ్ సాఫ్టువేరు RAID యెరేలను సృష్టించుట (ఉ.దా. /dev/md0) మద్దతివ్వబడుతోంది.

  • RHEL5 కొరకు NFS అప్రమేయం "లాక్అయింది". అందుకని, nfs భాగస్వామ్యాలను anaconda యొక్క %post విభాగమునుండి మౌంట్‌చేయుటకు, భాగస్వామ్యాలను మౌంటు చేయుటకు nfsను వుపయోగించుటకు ముందుగా mount -o nolock,udp ఆదేశంను లాకింగ్ డెమోన్ ప్రారంభించుటకు వుపయోగించుము.

  • CD-ROM లేదా DVD-ROM నుండి iBFT-ఆకృతీకరణ నెట్వర్క్‍ పరికరంతో సంస్థాపిస్తున్నప్పుడు, నెట్వర్కింగ్ ఆకృతీకరించనంతవరకు Anaconda ఎటువంటి iBFT-ఆకృతీకరణ నిల్వసామగ్రిని చేర్చదు. సంస్థాపనకొరకు నెట్వర్కింగ్‌ను చేతనపరచుటకు, సంస్థాపన బూట్ ప్రాంప్ట్‍‌వద్ద linux updates=http://[any] ఆదేశాన్ని ఉపయోగించండి. [any] అనునది ఏ URLతోనైనా పునఃస్థాపించవచ్చునని గమనించండి.

    మీ సిస్టమ్‌కు స్టాటిక్ IP ఆకృతీకరణ అవసరమైతే, linuxupdates=http://[any] ip=[IP address] netmask=[netmask] dns=[dns] ఆదేశంను ఉపయోగించండి.

  • Red Hat Enterprise Linux 5.3ను పూర్తి వర్చ్యలైజ్‌డ్ అతిధేయి పై సంస్థాపించునపుడు,kernel-xenకెర్నల్ ను వాడవద్దు.ఈ కెర్నల్ ను పూర్తి వర్చ్యులైజ్‌డ్ అతిధేయి లో ఉపయోగించడం వలన మీసిస్టమ్ స్థంభించవచ్చు.

    పూర్తి వర్చ్యులైజ్‌డ్ అతిధేయిపై Red Hat Enterprise Linux 5.3 సంస్థాపించుచున్నప్పుడు మీరు సంస్థాపనాసంఖ్యను ఉపయోగిస్తున్నట్లైతే, ఖచ్చితంగా సంస్థాపననందు వర్చ్యులైజేషన్ సంకలన సమూహంను ఎన్నుకోకుండావుండండి. వర్చ్యులైజేషన్ సంకలన సమూహం ఐచ్చికం kernel-xen కెర్నల్‌ను సంస్థాపిస్తుంది.

    పరాన్నవాస్థవీకరణ అథిదేయులు ఈ విషయం ద్వారా ప్రభావితం కాదు. పరాన్నవాస్థవీకరణ అథిదేయులు ఎల్లప్పుడు kernel-xen కెర్నల్ ను వాడతారు.

  • Red Hat Enterprise Linux 5 ను 5.2 కు నవీకరిస్తున్నప్పుడు మీరు వర్చ్యులైజ్‌డ్ కెర్నల్ ఉపయోగిస్తుంటే, మీరు నవీకరణముగింపు తర్వాత తప్పక రీబూట్‌చేయాలి. అప్పుడు మీరు నవీకరించిన వర్చ్యులైజ్‌డ్ కెర్నల్‌ ఉపయోగించి సిస్టమ్ బూట్‌చేయాలి.

    Red Hat Enterprise Linux 5 మరియు 5.2 యొక్క హైపర్విజర్స్‍ ABI-సారూప్యమైనవి కావు. నవీకరణ తర్వాత సిస్టమ్‌ను మీరు నవీకరించిన వర్చ్యులైజ్‌డ్ కెర్నల్ ఉపయోగించి బూట్‌చేయకపోతే, నవీకరింపబడిన వర్చ్యులైజేషన్ RPMలు నడుస్తున్న కెర్నల్‌తో సరిపోలవు.

  • Red Hat Enterprise Linux 4.6 నుండి Red Hat Enterprise Linux 5.1 లేదా తరువాతిదానికి నవీకరిస్తున్నప్పుడు, gcc4 నవీకరణ వైఫల్యానికి కారణం కావచ్చు. అందుకని, మీరు మానవీయంగా gcc4 సంకలనంను నవీకరణముందు తీసివేయవలెను.

  • firstboot భాషా ప్లగ్ఇన్ తీసివేయబడింది, అది కొత్త భాషను ఎంపికచేసినప్పుడు సరిగా మరియు పూర్తిగా సిస్టమ్‌ను పునఃఆకృతీకరణ చేయని కారణంగా.

  • సంస్థాపనా సమయమందు ఛాలెంజ్ హాండ్‌షేక్ ఆథెంటికేషన్ ప్రొటోకాల్ (CHAP) మద్దతీయుట లేదు. అందువలన, CHAP ను సంస్థాపన తరువాత మాత్రమే చేతనంచేయాలి.

    మీ సిస్టమ్ iBFT పరికరం ద్వారా బుట్అయితే, CHAP ను iBFT BIOS/పర్మ్‍‌వేర్ అమర్పు తెరనందు ఆకృతీకరించుము. మీ CHAP అమరికలు తరువాతి బూట్‌నందు ఉపయోగించబడతాయి.

    మీ సిస్టమ్ PXE iSCSI ద్వారా బూట్అవుతుంటే, CHAP ను iscsiadm ద్వారా ఆకృతీకరించుము. ఆకృతీకరణ తర్వాత, మీ CHAP అమరికలు తరువాతి బూట్‌నందు ఉపయోగింపబడునట్లు చేయుటకు mkinitrd ఉపయోగించండి.

  • సంస్థాపననందు గెస్ట్సుకు అనుమతివున్నప్పుడు, గెస్ట్సు కొరకు RHN సాధనములు ఐచ్చికం అందుబాటులో వుండదు. ఇది యెదురైనప్పుడు, సిస్టమ్‌కు అదనపు అర్హత అవసరమౌతుంది, dom0 చేత వుపయోగించబడిన దానికి భిన్నముగా.

    గెస్టుల కొరకు అదనపు అర్హతలయొక్క ఖర్చును నిరోధించుటకు, సిస్టమ్ Red Hat నెట్వర్కుకు నమోదు అగుటకు ముందుగానే rhn-virtualization-common ప్యాకేజీని మానవీయంగా సంస్థాపించుము.

  • Red Hat Enterprise Linux 5.3ను సిస్టమునందు బహుళ నెట్వర్కు ఇంటర్‌ఫేస్‌లతో సంస్థాపించుట మరియు IPv6 చిరునామాలను మానవీయంగా తెలుపుట పాక్షిక దోషపూరిత నెట్వర్కింక్ అమర్పుకు కారణంకావచ్చు. ఇది యెదురైనప్పుడు, మీ IPv6 అమర్పులు సంస్థాపించిన సిస్టమునందు కనిపించవు.

    దీని కొరకు, /etc/sysconfig/network నందు NETWORKING_IPV6ను yesకు అమర్చుము. అప్పుడు మీ నెట్వర్కు అనుసంధానమును service network restart అదేశమును వుపయోగించి పునఃప్రారంభించుము.

  • మీ సిస్టమ్ yum-rhn-plugin-0.5.2-5.el5_1.2 (లేదా అంతకన్నా ముందలి వర్షన్) సంస్థాపించివుంటే, మీరు Red Hat Enterprise Linux 5.3కు yum update ద్వారా నవీకరించబడలేరు. దీనికొరకు మిరు yum update నడుపుటకు ముందుగా మీ yum-rhn-pluginను సరికొత్త వర్షన్‌కు (yum update yum-rhn-plugin వుపయోగించి) నవీకరించుము.

  • గతంలో, anaconda 8 కన్నా యెక్కువ SmartArray నియంత్రికలను యాక్సిస్ చేయగలిగేది కాదు. ఈ నవీకరణనందు, ఈ సమస్య పరిష్కరించబడింది.

  • OEM ద్వారా పంపిణీ చేయబడిన, డ్రైవర్ డిస్కు, వొంటరి ప్రతిబింబ ఫైలు (*.img), బహుళ డ్రైవర్ ప్యాకేజీలను మరియు కెర్నల్ మాడ్యూళ్ళను కలిగివుంటుంది. ఈ డ్రైవర్సు సంస్థాపనా సమయమందు వుపయోగించబడతాయి లేకపోతే హార్డువేరు Red Hat Enterprise Linux 5చేత గుర్తించబడదు. ఒకసారి డ్రైవర్ ప్యాకేజీలు మరియు కెర్నల్ మాడ్యూళ్ళు సిస్టమ్సునందు సంస్థాపించిన తర్వాత, అవి ప్రాధమిక RAM డిస్కు(initrd) నందు వుంచబడతాయి అలా సిస్టమ్ బుట్‌లనందు అవి లోడ్‌కాగలవు.

    ఈ విడుదలతో, సంస్థాపన స్వయంచాలకంగా డ్రైవర్ డిస్కును గుర్తించగలదు (దాని ఫైల్‌సిస్టమ్ లేబుల్ పైన ఆధారపడి), ఆడిస్కు యొక్క సారమును సంస్థాపననందు వుపయోగిస్తుంది. ఈ ప్రవర్తన సంస్థాపనా ఆదేశం వరుస ఐచ్చికం dlabel=on ద్వారా నియంత్రించ బడుతుంది, ఏదైతే స్వయంచాలక శోధనను చేతనంచేస్తుందో. ఈ విడుదలకు dlabel=on అప్రమేయ అమరిక.

    OEMDRV లేబుల్‌తో వున్న అన్ని బ్లాక్ పరికరములు పరిక్షీంచబడినవి మరియు డ్రైవర్సు ఈ పరికరములనుండి అవి గుర్తించబడిన క్రమములో లోడుకాబడినవి.

  • vfat ఫైల్ సిస్టమ్సు కలిగివున్న ఎన్క్రిప్టెడ్ బ్లాక్ పరికరములు విభజన ఇంటర్‌ఫేస్‌నందు టైప్ foreignలా కనిపిస్తాయి; అందుకని, ఈ పరికరములు స్వయంచాలకంగా సిస్టమ్ బుట్‌నందు మౌంటుకావు. అటువంటి పరికరములు స్వయంచాలకంగా మౌంటగునట్లు చూసుకొనుటకు, వాటికొరకు సరైన ప్రవేశమును /etc/fstabకు జతచేయుము. అలా యెలా చేయాలో వివరముల కొరకు, man fstab చూడుము.

1.2. PowerPC ఆకృతులు

  • Red Hat Enterprise Linux 5.2 సంస్థాపనకు కావలసిన కనిష్ఠ RAM 1GB; సమర్ధించునది 2GB RAM. కంప్యూటరు 1GB కంటే తక్కువ RAMని కలిగి ఉంటే, సంస్థాపన విధానం ఆగిపోవచ్చు.

    ఇంకా, 1GB RAM గల పవర్PC-ఆధారిత మిషన్స్‍ కొన్ని RAM-ఇంటెన్సివ్ పనివత్తుడల క్రింద ముఖ్యమైన పనితనపు ఇబ్బందులను కలిగివున్నాయి. Red Hat Enterprise Linux 5.2 సిస్టమ్ RAM-ఇంటెన్సివ్ కార్యాలను జరుపుటకు, 4GB RAM సిఫార్స్‍ చేయబడింది. 512MB RAM తో Red Hat Enterprise Linux 4.5 లేదా ముందలిది నడుపుతున్న పవర్PC మిషన్స్‍‌నందు అందుబాటులోవున్న పుటలసంఖ్యతో సమానమైన పుటలను సిస్టమ్ భౌతికంగా కలిగివుండునట్లు ఇదిచేస్తుంది.

1.3. s390x ఆకృతులు

  • OSA Express3 cardsకొరకు anaconda యిప్పుడు రెండు పోర్టులను మద్దతిస్తోంది. సంస్థాపన ప్రాధమిక స్థాయిలో సంస్థాపకి పోర్టు సంఖ్యకొరకు అడుగుతుంది. పోర్టు కొరకు యివ్వబడిన విలువ సంస్థాపించిన నెట్వర్కు ఇంటర్‌ఫేస్ startup scriptను కూడా ప్రభావితం చేస్తుంది. పోర్టు 1 యెంపిక కాబడినప్పుడు, ifcfg-eth* ఫైలుయొక్క OPTIONS పారామితికి portno=1 విలువ జతచేయబడుతుంది.

    Note

    z/VM క్రింద సంస్థాపించుచున్నప్పుడు, మోడ్ కొరకు అడుగకుండా వుండుటకు మీరు CMS ఆకృతీకరణ ఫైలుకు PORTNO=0 (port 0 వుపయోగించుటకు) లేదా PORTNO=1 (port 1 వుపయోగించుటకు)ను జతచేయవచ్చు.

  • DASD బ్లాక్ పరికరములపై లైనక్సు మరియు లైనక్సు-కాని ఫైల్‌సిస్టమ్స్‍ సంస్థాపన సంస్థాపకి స్ధంబనకు కారణంకావచ్చు. ఇది జరిగితే, మీరు వుపయోగించాలని అనుకొనుచున్న DASD పరికరములపైని అన్ని విభజనలను తప్పనిసరిగా తీసివేసి సంస్థాపకిని పునఃప్రారంభించుము.

1.4. ia64 ఆకృతి

  • మీ సిస్టమ్ 512MB RAM ని మాత్రమే కలిగివుండి, Red Hat Enterprise Linux 5.3 ను సంస్థాపించుటకు యత్నిస్తుంటే విఫలంకావచ్చు. దీనిని నిరోధించుటకు, ప్రాధమిక సంస్థాపనను జరుపండి మరియు అన్ని ఇతర సంకలనాలను సంస్థాపన ముగిసినతర్వాత సంస్థాపించండి.

  • yumను 32-bit Compatibility Layer నుండి ప్యాకేజీలను సంస్థాపించుటకు ఉపయోగిస్తే డిస్కు విఫలం కావచ్చు.ఇది Red Hat ప్యాకేజీ ప్రవేశ కీ RPM డాటాబేస్‌లోకి దిగుమతి కాక పోవుట వలన జరుగుతుంది.ఇది మీరు Red Hat Network నుండి నవీకరణలు పొందకపోవడంవలన జరుగుతుంది. కీ ను మానవీయంగా దిగుమతి చేయుటకు క్రింది ఆదేశాలను మూలం వద్ద నడపండి:

    rpm --import /etc/pki/rpm-gpg/RPM-GPG-KEY-redhat-release

    ఒకసారి Red Hat GPG కీ దిగుమతైతే,మీరుyumను 32-bit Compatibility Layer డిస్కునుండి ప్యాకేజీలను సంస్థాపించుటకు వాడవచ్చు.

    డిస్కు నుండి సంస్థాపించునపుడు rpm బదులుగా yum ను వాడడం మంచిది ఎంచేతంటే సంస్థాపనప్పుడు బేస్ OS డిపెన్డెన్సీస్ గుర్తించబడతాయి.

2. భవిష్యత్ నవీకరణలు

బ్లాక్ పరికరము ఎన్క్రిప్షన్

బ్లాక్ పరికరము ఎన్క్రిప్షన్‌కు Red Hat Enterprise Linux 5.3 లైనక్స్‍ యూనిఫైడ్ కీ సెటప్ (LUKS) విశదీకరణను వుపయోగించి మద్దతిస్తోంది. ఒక పరికరమును ఎన్క్రిప్టు చేయటుద్వారా అధికారంలేని యాక్సిస్‌నుండి బ్లాక్ పరికరముపై డాటాను రిక్షించవచ్చు, ఆ పరికరము భౌతికంగా సిస్టమ్‌నుండి తొలగించినాకూడా. ఎన్క్రిప్టెడ్ పరికరముయొక్క విషయసంగ్రహాలను యాక్సిస్ చేయుటకు, వినియోగదారి సంకేతపదముగాని లేదా ధృవీకరణగా కీనుగాని యివ్వాలి.

డిస్కు ఎన్క్రిప్షన్ అమర్చుటపై సమాచారముకొరకు, Red Hat Enterprise Linux సంస్థాపనా మార్గదర్శిని అధ్యాయం 28ను : http://redhat.com/docs/ వద్దచూడండి.

mac80211 802.11a/b/g WiFi protocol stack (mac80211)

mac80211 స్టాక్ (devicescape/d80211గా యింతకుముందు తెలిసిన స్టాక్) యిప్పుడు Red Hat Enterprise Linux 5.3 మద్దతిచ్చు సౌలభ్యము. ఏదేని WiFi నెట్వర్కుకు కొన్ని వెర్‌లెస్ పరికరములను అనుసంధానించుIntel WiFi Link 4965 హార్డువేరు కొరకు యిది iwlwifi 4965GN వైర్‌లెస్ డ్రైవర్‌ను చేతనపరుస్తుంది.

mac80211 మూలకం(కాంపోనెంట్) Red Hat Enterprise Linux 5.3నందు మద్దతిస్తున్నప్పటికి, కెర్నల్‌కొరకు చిహ్నములు(సింబల్స్‍) సింబల్ వైట్‌లిస్ట్‍‌ నందు చేర్చబడలేదు.

గ్లోబల్ ఫైల్ సిస్టమ్ 2 (GFS2)

GFS2 GFS యొక్క పెరుగుతున్న అభివృద్ది.ఆన్ డిస్కు ఫైల్ సిస్టమ్ పద్దతి మార్చుటకు అవసరమైన చాలా పురోభివృద్దిని ఈ నవీనీకరణ అందించింది.GFS ఫైల్ సిస్టమ్ ఇప్పుడు GFS2 గా gfs2_convert ఉపయోగించి మార్చవలె,ఏదైతే GFS ఫైల్ సిస్టమ్ మెటాడాటా ను నవీకరిస్తుందో.

Red Hat Enterprise Linux 5.2నందు, GFS2 పరిణామ క్రమము (ఎవాల్యూషన్ ప్రోసెస్)కొరకు కెర్నల్ మాడ్యూల్‌గా అందిచబడింది. Red Hat Enterprise Linux 5.3నందు, యిప్పుడు GFS2 కెర్నల్ ప్యాకేజీనందు భాగము. Red Hat Enterprise Linux 5.2 GFS2 కెర్నల్ మాడ్యూళ్ళు సంస్థాపించబడితే GFS2ను వుపయోగించుటకు అవి Red Hat Enterprise Linux 5.3నందు తొలగించవలెను.

డ్రైవర్ డిస్కు మద్దతునందు మెరుగుదలలు

OEM ద్వారా పంపిణీచేయబడిన, డ్రైవర్ డిస్కు, వొక వొంటరి ప్రతిబింబపు ఫైలు (*.img), బహుళ డ్రైవర్ RPMలను మరియు కెర్నల్ మాడ్యూల్సును కలిగివుంటుంది. ఈ డ్రైవర్సు సంస్థాపననందు హార్డువేరుకు మద్దతిచ్చుటకు వుపయోగించబడతాయి లేకపోతే హార్డువేరు గుర్తించబడదు. RPMలు సిస్టమ్‌నందు సంస్థాపించబడతాయి మరియు initrdనందు వుంచబడతాయి అందువలన మిషన్ పునఃప్రారంభమైనప్పుడు అవి మద్దతివ్వబడతాయి.

Red Hat Enterprise Linux 5.3తో, సంస్థాపన స్వయంచాలకంగా డ్రైవర్ డిస్కును దాని ఫైల్ సిస్టమ్ లేబుల్‌పైన ఆధారప‍డి గుర్తిస్తుంది, మరియు ఆడిస్కు సారమును సంస్థాపననందు వుపయోగిస్తుంది. ఈ ప్రవర్తన సంస్థాపనయొక్క ఆదేశవరుల ఐచ్చికం dlabel=on ద్వారా నియంత్రించబడుతుంది, ఏదైతే స్వయంచాలక శోధనను చేతనంచేస్తుందో. ఫైల్ సిస్టమ్ లేబుల్ OEMDRVతోవున్న అన్ని బ్లాక్ పరికరములు పరీక్షించబడినవి మరియు డ్రైవర్స్‍ ఈ పరికరములు ప్రవేశపెట్టినవిధంగా వాటినుండి డ్రైవర్స్‍ లోడ్ చేయబడినాయి.

iSCSI బూట్ పర్మ్‍‌వేర్ పట్టిక

Red Hat Enterprise Linux 5.3 యిప్పుడు iSCSI పరికరములనుండి బూటింగ్‌ను అనుమతించే iSCSI Boot Firmware Table (iBFT)ను పూర్తిగా మద్దతిస్తోంది. ఈ మద్దతుకొరకు iSCSI డిస్కులు (నో‍డ్స్‍) స్వయంచాలకంగా ప్రారంభమగునట్లు వుంచకూడదు; రన్‌లెవల్ 3 లేదా 5కు ప్రవేశించునప్పుడు సంస్థాపిత సిస్టమ్ స్వయంచాలకంగా అనుసంధానము మరియు లాగిన్ అవదు.

రన్‌లెవల్ ప్రవేశముకు ముందుగా కూడా initrd అనుసంధానించబడి మరియు అవసరమైన iSCSI డిస్కులకు లాగిన్ అగునట్లు ఈ మార్పు చేయలేకపోతే, iSCSI సాదారణముగా root ఫైల్‌సిస్టమ్‌కు వుపయోగించబడుతుంది.

ఏమైనప్పటికి iSCSI డిస్కులు root కాని డైరెక్టరీలపై మౌంట్ కావలసివుంది, ఉదాహరణకు /home లేదా /srv, అప్పుడు ఈ మార్పు మీకు ప్రభావితం అవుతుంది, root ఫైల్‌సిస్టమ్‌కు వుపయోగించబడని iSCSI డిస్కులకు సంస్థాపిత సిస్టమ్ స్వయంచాలకంగా అనుసంధానించబడలేదు మరియు లాగిన్ కాలేదు కనుక.

root కాని డైరెక్టరీలనందు మౌంటైన iSCSI డిస్కులను వుపయోగించుట యిప్పటికి సాధ్యమే, అయితే ఈక్రింది వాటిలో యేదో వొకదాని వుపయోగం అవసరము:

  1. root కాని డైరెక్టరీలపై మౌంటైన iSCSI డిస్కుల వుపయోగంలేకుండా సిస్టమ్ సంస్థాపించుము తర్వాత సంభందిత డిస్కులను మరియు మౌంట్ పాయింట్లను మానవీయంగా ఆకృతీకరించుము.

  2. సంస్థాపిత సిస్టమ్‌ను రన్‌లెవల్ 1కు బూట్ చేయుము, root పైల్‌సిస్టమ్‌కు వుపయోగించని iSCSI డిస్కులను ఈక్రింది ఆదేశమును వుపయోగించి డిస్కుకువొకసారి స్వయంచాలక ప్రారంభమునకు గుర్తుంచుము:

    iscsiadm -m node -T target-name -p ip:port -o update -n node.startup -v automatic

rhythmbox

rhythmbox ఆడియో ప్లేయర్ వర్షన్ 0.11.6కు నవీకరించబడింది. ఈ నవీకరణ ప్రొప్రైటరీ GStreamer ప్లగ్‌యిన్స్‍‌ను వుపయోగించుటకు ఐచ్చికాన్ని యిస్తుంది.

lftp Rebase

lftp యిప్పుడు వర్షన్ 3.7.1కు పునఃప్రతిపాదించబడింది(రీబేస్‌డ్). ఇది చాలా అప్‌స్ట్రీమ్ సౌలభ్యపు నవీకరణలకు మరియు బగ్ పరిష్కారములకు ఆపాదించబడుతుంది:

  • mirror --script ద్వారా వుద్బవించబడిన lftp కోటెడ్ స్క్రిప్ట్స్‍ మార్గమునందలి భద్రతా లోపము

  • lftpను ఐచ్చికం -cతో వుపయోగించుట యికపై lftp స్థంబనకు కారణమవదు.

  • sftp వుపయోగిస్తున్న బదిలీకరణలో lftp యికపై ఫై‌ళ్ళను పాడుచేయదు.

ఈ విడుదలలో ఆపాదించిన lftp నవీకరణలపై యెక్కువ సమాచారము కొరకు, http://lftp.yar.ru/news.htmlను చూడండి.

TTY ఇన్‌పుట్ ఆడిటింగ్

TTY ఇన్‌పుట్ ఆడిటింగ్ యిప్పుడు మద్దతీయబడింది. ఒక ప్రోసెస్ TTY ఇన్‌పుట్ ఆడిటింగ్‌గు గుర్తుంచబడివుంటే, అది TTYలనుండి సేకరించు డాటా ఆడిట్‌చేయబడుతుంది; ఇది ఆడిట్ రికార్డ్స్‍‌నందు TTY రకముతో చూయించబడుతుంది.

TTY ఇన్పుప్ ఆడిటింగ్ కొరకు ఒక కార్యక్రమము(మరియు దాని శిశు కార్యక్రమము)ను గుర్తుంచుటకు మీరు pam_tty_audit మాడ్యూల్‌ను వుపయోగించవచ్చు. దీనిని యెలాచేయాలి అనేదానికి సమాచారముకొరకు, man pam_tty_audit(8) చూడండి.

TTY ఆడిట్ రికార్డ్స్‍ ఆడిట్ కార్యక్రమము ద్వారా చదువబడిన ఖచ్చితమైన కీస్ట్రోక్స్‍‌ను కలిగి వుంటుంది. డాటా డీకోడింగ్ సులభతరం చేయుటకు, USER_TTY రికార్డును వుపయోగించి bash ఖచ్చితమైన ఆదేశవరుసను ఆ‍డిట్ చేస్తుంది.

"TTY" ఆడిట్ రికార్డ్స్‍ ఆడిట్ కార్యక్రమము ద్వారా TTYనుండి చదివిన డాటా అంతటిని కలిగివుంటాయి. ఇది TIOCSTI ioctl సిస్టమ్ కాల్ ద్వారా ఇన్‌పుట్ స్ట్రీమ్‌కు చేర్చిన డాటాను కలిగివుంటుంది.

SystemTap Re-base

సిస్టమ్ టాప్ వర్షన్ 0.7.2కు పునః-ప్రతిపాదించబడింది(రీ-బేస్‌డ్). ఈ సిస్టమ్ టాప్ నవీకరణ చాలా తేలికపాటి మెరుగుదలలను కలిగివుంది, కొన్ని పెద్ద సౌలభ్యాలతో కూడి. ఈ సౌలభ్యాలు వీటిని కలిగివున్నాయి:

  • సిస్టమ్ టాప్ యిప్పుడు x86,x86-64 మరియు PowerPC ఆకృతులనందు సింబాలిక్ ప్రోబింగ్‌ను మద్దతిస్తుంది. ఇది ప్రోబ్స్‍‌ను వినియోగదారి-స్థానపు అనువర్తనములనందు మరియు భాగస్వామ్య లైబ్రరీలనందు వుంచుటకు సిస్టమ్ టాప్ స్క్రిప్టు చేతనం చేస్తుంది. ఫలితంగా, సిస్టమ్ టాప్ యిప్పుడు కొన్ని వినియోగదారి-స్థానపు అనువర్తనములపై కెర్నల్ ప్రోబింగ్‌వలే అదేస్థాయి డిబగ్గర్ ప్రోబింగ్‌ను అందిస్తుంది.

    ఉదాహరణకు, coreutils-debuginfo సంస్థాపించబడితే, మీరు ls ఆదేశంయొక్క కాల్‌గ్రాఫ్‌ను /usr/share/doc/systemtap-version/examples/general/callgraph.stpవుపయోగించి ముద్రించవచ్చు, యిలా:

    stap para-callgraph.stp 'process("ls").function("*")' -c 'ls -l'

    In order to reduce the likelihood of an undetected version mismatch between the binary and its debuginfo RPMs, Red Hat advises that you set the SYSTEMTAP_DEBUGINFO_PATH environment variable to the value +:.debug:/usr/lib/debug:build.

    సింబాలిక్ ప్రోబ్స్‍‌కొరకు సిస్టమ్ టాప్‌యొక్క మద్దతును ఈవిడుదలయొక్క కెర్నల్‌నందు వుంచిన గుర్తులవరకు పోడిగించవచ్చు. ఈ గుర్తులను వాడుటకు, (modprobe kernel-trace) వుపయోగించి kernel-trace కెర్నల్ మాడ్యూల్‌ను /etc/rc.localనందు లోడ్‌చేయుము.

  • సిస్టమ్‌టాప్ దూరస్థ నిర్వర్తనా(రిమోట్ కంపైలేషన్) సేవలకుకూడా మద్దతిస్తుంది. స్థానిక సిస్టమ్ టాప్ కక్షిదారులు(క్లైంట్స్‍)కొరకు debuginfo/compiler సేవికలా పనిచేయుటకు నెట్వర్కునందు వొక కంప్యూటర్‌ను చేతనపరుస్తుంది. కక్షిదారులు సేవికను స్వయంచాలకంగా-గుర్తిస్తాయి mDNS (avahi) వుపయోగించి, మరియు పనిచేయుటకు systemtap-client మరియు systemtap-runtime ప్యాకేజీలు మాత్రమే అవసరం.

    ప్రస్తుతం, ఈ సౌలభ్యం ఎన్క్రిప్షన్‌వంటి భద్రతా యాంత్రికత(మెకానిజం)ను వుపయోగించుటలేదు. అందువలన, దూరస్థ నిర్వర్తనము(రిమోట్ కంపైలేషన్) సేవలను నమ్మదగిన నెట్వర్కులలో మాత్రమే వుపయోగించమని సూచించడమైనది. అధిక సమాచారము కొరకు, man stap-server చూడం‍డి.

  • కెర్నల్ నవీకరణ ఈవిడుదలకొరకు సిస్టమ్‌టాప్ స్క్రిప్ట్స్‍ యొక్క మూసివేతను మెరుగుపరచే కెర్నల్ API పోడిగింపును కలిగివుంది. స్వతంత్ర ప్రోబ్ తొలగింపు ఆపరేషన్స్‍ మద్య అవసరములేని సింక్రనైజేషన్‌ను ఈ కెర్నల్ API పొడిగింపు తొలగిస్తుంది. ఫలితంగా, వందలకొలది కెర్నల్ ప్పోబ్స్‍ కలిగిన సిస్టమ్‌టాప్ స్క్రిప్ట్స్‍ త్వరగా కార్యనిర్వర్తనం చేయబడతాయి.

    ఎక్కువ కెర్నల్ ఘటనలను చిక్కించుకొనుట(కాప్చర్)కు వైల్డ్‍‌కార్డ్స్‍ కలిగిన ప్రోబ్స్‍‌తో స్క్రిప్ట్స్‍ వుపయోగించే నిర్వాహకులకు యిది ప్రత్యేకించి వుపయోగంగావుటుంది, probe syscall.* {} వంటిది.

ఈ విడుదలనందు చేర్చిన సిస్టమ్‌టాప్ నవీకరణల పూర్తిజాబితా కొరకు, ఈ క్రింది URLను దర్శించండి:

http://sources.redhat.com/git/gitweb.cgi?p=systemtap.git;a=blob_plain;f=NEWS;hb=rhel53

క్లస్టర్ నిర్వాహిక నవీకరణ

క్లస్టర్ మేనేజర్ సౌలభ్యము (cman) వర్షన్ 2.0.97కు నవీకరించబడింది. ఇది చాలా బగ్ పరిష్కారాలను మరియు విస్తరింపులను ఆపాదిస్తుంది:

  • cman యిప్పుడు ఈక్రింది ఫర్మ్‍‌వేర్ వర్షన్స్‍‌ను వుపయోగిస్తుంది: APC AOS v3.5.7 మరియు APC rpdu v3.5.6. సాధారణ నెట్వర్కు నిర్వహణా నిభందన (సింపుల్ నెట్వర్కు మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్ SNMP)ను సరిగా వినియోగించుటనుండి APC 7901ను నిరోధించే బగ్‌ను యిది పరిష్కరించింది.

  • fence_drac, fence_ilo, fence_egenera, మరియు fence_bladecenter ప్రతినిధులు(ఏజంట్స్‍) యిప్పుడు sshమద్దతిస్తున్నాయి.

  • fence_xvmd కీ ఫైళ్ళు యిప్పుడు పునఃప్రారంభము లేకుండానే తిరిగిలోడు కాగలవు.

  • ఒంటరి fence పద్దతి యిప్పుడు 8 fence పరికరములకు మద్దతునీయగలదు.

sudo Re-base

sudo అప్‌స్ట్రీమ్ వర్షన్ 1.6.9కు పునః-ప్రతిపాదించబడింది. sudo యొక్క ఈ వర్షన్ యిప్పుడు LDAPకు మద్దతిస్తోంది, మరియు sudo హక్కులకొరకు ప్రాధమిక శోధన(tree-level మాత్రమే)కు బదులుగా sub-tree శోధనను అనుమతిస్తుంది. ఇది నిర్వాహకులను sudo హక్కులను tree నందు వర్గీకరించుటకు అనుమతిస్తుంది, వినియోగదారి అధికారములను నిర్వహించుట సులభతరం చేస్తుంది.

RPM Re-Base

RedHat Package Manager (RPM) యిప్పుడు Fedora 9 అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు పునః-ప్రతిపాదించబడింది. rpm యిప్పుడు ద్వితీయ ఆకృతి-తీరు (ఆర్కిటెక్చర్-స్పెసిఫిక్) మేక్రో ఫైళ్ళను మల్టీ-ఆర్క్‍ సిస్టమ్స్‍‌నందు జతచేస్తుంది. అదనముగా, Red Hat Enterprise Linux 5నందు చేర్చుటకు యిప్పుడు rpm అన్ని దృవీకరణపత్ర విధానాన్ని చేరుకుంది.

ఈ నవీకరణ rpmకు చాలా అప్‌స్ట్రీమ్ విస్తరింపులను మరియు బగ్ పరిష్కారములను ఆపాదిస్తుంది:

  • మల్టీ-ఆర్క్‍ సిస్టమ్సునందు rpm యికపై అవసరములేని .rpmnew మరియు .rpmsave ఫైళ్ళను సృష్టించదు.

  • rpmనందలి rpmgiNext() ఫంక్షన్ సరైన దోష నివేదికను నిరోదిస్తుంది. ఈ నవీకరణ దోష నివేదికలకొరకు సరైన సిమాన్టిక్స్‍‌ను ఆపాదిస్తుంది, ఆ rpmను పొందుట అన్ని సంభవాలలో సరైన నిష్క్రమణకోడ్‌ను యిస్తుంది.

ఓపెన్ ఫాబ్రిక్ ఎంటర్‌ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ (OFED) / opensm

opensm అప్‌స్ట్రీమ్ వర్షన్ 3.2కు నవీకరించబడింది, opensm library APIకు చిన్నతరహా మార్పుదలతో కలుపుకొని.

  • opensm.conf ఫైలు యొక్క ఫార్మాట్ మార్చబడింది. మీరు మీ opensm.confకు కావలిసిన సవరింపులు చేస్తే, rpm కొత్త opensm.conf ఫైలును స్వయంచాలకంగా /etc/ofed/opensm.conf.rpmnewలా సంస్థాపిస్తుంది. మీరు మీ సవరింపులను ఈ ఫైలుకు మార్చవలసివుంటుంది మరియు వున్న opensm.confను ఫలితంతో పునఃస్థాపించ వలసివుంటుంది.

  • ఇంకనూ పరిణామం చేందుతున్న సాంకేతికతకు గరిష్ట స్థాయి చేతనత్వాన్ని అందించుటకొరకు అప్‌స్ట్రీమ్ ఓపెన్ ఫాబ్రిక్స్‍ ఎంటర్‌ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ (OFED) కోడ్ బేస్‌ను Red Hat దగ్గరిగా ట్రాక్ చేస్తోంది. కాబట్టి, అప్‌స్ట్రీమ్ ప్రోజెక్టు చేసే చిన్న విడుదలల మద్య Red Hat API/ABI సారూప్యతలను మాత్రమే నిల్వవుంచగలదు. Red Hat Enterprise Linux యొక్క అభివృద్దినందలి సాదారణ అధ్యయనం నుండి యిదివొక ఆక్షేపణ.

    దీని కారణంగా, OFED స్టాక్ (క్రింద జాబితాచేసిన) పైన నిర్మించిన అనువర్తనములు, Red Hat Enterprise Linuxయొక్క వొక వర్షన్‌నుండి కొత్తవర్షన్‌కు మారుచున్నప్పుడు,పునఃనిర్వర్తనను అవసరపడవచ్చు లేదా మూల-స్థాయి (సోర్సు-లెవల్) కోడ్ మార్పులు కూడా అవసరపడవచ్చు.

    ఇది సాదారణముగా యితర అనువర్తనములకు అవసరమువుండదు, Red Hat Enterprise Linux సాఫ్టువేరు స్టాకుపైన నిర్మించనవాటికి. ప్రభావితమగు మూలకాలు(కాంపోనెంట్సు):

    • dapl

    • compat-dapl

    • ibsim

    • ibutils

    • infiniband-diags

    • libcxgb3

    • libehca

    • libibcm

    • libibcommon

    • libibmad

    • libibumad

    • libibverbs

    • libipathverbs

    • libmlx4

    • libmthca

    • libnes

    • librmdacm

    • libsdp

    • mpi-selector

    • mpitests

    • mstflint

    • mvapich

    • mvapich2

    • ofed-docs

    • openib

    • openib-mstflint

    • openib-perftest

    • openib-tvflash

    • openmpi

    • opensm

    • perftest

    • qlvnictools

    • qperf

    • rds-tools (future)

    • srptools

    • tvflash

Net-SNMP Re-Base

Net-SNMP అప్‌స్ట్రీమ్ వర్షన్‌ 5.3.2.2కు పునః-ప్రతిపాదించబడింది. ఈ నవీకరణ స్ట్రీమ్ కంట్రోల్ టాన్స్‍‌మిషన్ ప్రొటోకాల్ (SCTP)ను జతచేస్తుంది (RFC 3873 ప్రకారం, http://www.ietf.org/rfc/rfc3873.txt) మరియు రెండుకొత్త ఆకృతీకరణ ఐచ్చికాలను పరిచయంచేస్తోంది(/etc/snmpd.conf నందు ఉపయోగించుటకు):

  • dontLogTCPWrappersConnects -- అనుసంధానము ప్రయత్నాల లాగింగ్‌ను కుదిస్తుంది.

  • బయటకువెళ్ళు SNMP ట్రాప్స్‍‌నందు ప్రతినిధియొక్క IP చిరునామా అమర్చుటకు నిర్వహణాదికారులను v1trapaddress -- చేతనంచేస్తుంది.

ఈ నవీకరణ అనునది అప్‌స్ట్రీమ్‌నుండి ఇవ్వబడిన చాలా మెరగుదలలకు ఆపాదిస్తుంది.

  • 255 నెట్వర్కు ఇంటర్‌ఫేసులకన్నా యెక్కువ వున్న సిస్టమ్సునందు కూడా యిప్పుడు snmpd డెమోన్ సరిగానే పనిచేస్తోంది. అదనముగా, యిప్పుడు snmpdను 65535 కన్నా యెక్కువపోర్టుకు ఆకృతీకరించినప్పుడు అది దోష నివేదికను యిస్తోంది.

  • snmpd డెమోన్ /procనుండి చదువుచున్నప్పుడు ఫైల్ డిస్క్రిప్టార్సు లీక్‌కు కారణమగు race నియమం యిప్పుడు పరిష్కరించబడింది.

  • snmpd డెమోన్ యిప్పుడు hrProcessorLoad ఆబ్జక్టు IDలను (OID) సరిగా నివేదిస్తోంది, multi-CPU హార్డువేరునందు కూడా. గమనిక, ఏమైనప్పుటికి, OID విలువను లెక్కించుటకు డెమోన్ ప్రారంభంనుండి దాదాపు వొక నిముషం తీసుకొంటోంది.

  • net-snmp-devel ప్యాకేజీ అనునది యిప్పుడు lm_sensors-devel ప్యాకేజీపై ఆదారపడుతుంది.

FIPS దృవీకరణపత్రము కొరకు OpenSSL Re-Base

openssl ప్యాకేజీలు OpenSSL లైబ్రరీని కొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌ఖు నవీకరించాయి, ఏదైతే ప్రస్తుతం ఫెడరల్ ఇన్ఫర్‌మేషన్ ప్రోసెసింగ్ స్టాన్డర్డ్స్‍ నిర్ధారణ కార్యక్రమము (FIPS-140-2) క్రింద నడుస్తోందో. Red Hat Enterprise Linux 5నందలి openssl ప్యాకేజీలయొక్క గతవిడుదలలతో ABI సారూప్యతను మరియు OpenSSL లైబ్రరీ భవిష్య సరిసమానతను కలిగివుండుటకు FIPS రీతి అప్రమేయంగా అచేతనం చేయబడివుంటుంది.

ఈ నవీకరణ ఈ క్రింది అప్‌స్ట్రీమ్ పరిష్కారాలనుకూడా ఆపాదిస్తుంది:

  • అప్రమేయంగా, zlib కుదింపు SSL మరియు TLS అనుసంధానములకు వుపయోగించబడుతుంది. సెంట్రల్ ప్రోసెసర్ అసిస్టు ఫర్ క్రిప్టోగ్రఫిక్ ఫంక్షన్(CPACF)తో IBM System z నిర్మాణములపై, కుదింపు CPU భారముయొక్క ముఖ్యభాగం అవుతుంది, మరియు మొత్త పనితనము కుదింపుయొక్క వేగముచేత నిర్ణయించబడుతుంది (ఎన్క్రిప్షన్ చేత కాదు). కుదింపు అచేతనము చేయబడినప్పుడు, మొత్తం పనితనము చాలా యెక్కువగావుంటుంది. ఈ నవీకరించిన ప్యాకేజీలలో, SSL మరియు TLS అనుసంధానముల zlib కుదింపును OPENSSL_NO_DEFAULT_ZLIB ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌తో అచేతనము చేయవచ్చు. నిదానమైన నెట్వర్కుపై TLS అనుసంధానముల కొరకు, కుదింపు అనై వుండునట్లు వుంచుట మంచిది, అలా డాటా బదిలీకరణ మొత్తం తక్కువగా వుంటుంది.

  • openssl ఆదేశమును s_client మరియు s_server ఐచ్చికాలతో వుపయోగిస్తున్నప్పుడు, అప్రమేయ CA దృవీకరణపత్రాల ఫైలు (/etc/pki/tls/certs/ca-bundle.crt), చదువబడలేదు. ఇది దృవీకరణపత్రాల నిర్ధారణా వైఫల్యమునకు కారణమౌతుంది. దృవీకరణపత్రాలు నిర్దారణలో వుత్తీర్ణమగుటకు, -CAfile /etc/pki/tls/certs/ca-bundle.crt ఐచ్చికం వుపయోగించవలసి వుంటుంది.ఈ నవీకరించిన ప్యాకేజీలలో, అప్రమేయ CA దృవీకరణపత్రాల ఫైలు చదవబడింది, మరియు -CAfile ఐచ్చికంతో తెలుపవలసిన అవసరములేదు.

yum Re-Base

yum అప్‌స్ట్రీమ్ వర్షన్ 3.2.18కు పునః-ప్రతిపాదించబడింది. ఈ నవీకరణ yum పనిచేసే వేగమును పెంచుతుంది, ప్రతి చిన్నతరహా విడుదలతో చేర్చబడుతున్న ప్యాకేజీల సంఖ్యవలన వచ్చిని సమస్యను తీసివేస్తుంది. అదనముగా, ఈ విడుదల reinstall(పునఃసంస్థాపన) ఆదేశమును యిస్తోంది, చాలా ఆదేశాల ఇంటర్‌ఫేస్‌లను మెరుగుపరుస్తోంది, మరియు చాలా బగ్ పరిష్కారాలను ఆపాదిస్తోంది:

  • వెబ్ చిరునామా (http)నందు ఆకృతీకరణ ఫైలును తెలుపుటకు -c ఐచ్చికాన్ని వుపయోగిస్తే ఏ yum ఆదేశమైనా విఫలమౌతుంది. ఈ బగ్ యిప్పుడు పరిష్కరించబడింది.

  • yum నందలి checkSignal() ఫంక్షన్ తప్పైన నిష్క్రమణ ఫంక్షన్‌గా పిలువబడుతుంది; అందువలన, yum నిష్క్రమణ tracebackగా వుంటుంది. ఈ విడుదలతో, yum సరిగా నిష్క్రమిస్తుంది.

flash-plugin Re-Base

flash-plugin ప్యాకేజీ వర్షన్ 10.0.12.36కు పునః-ప్రతిపాదించబడింది. ఈ నవీకరణ గత flash-plugin ASYNC నవీకరణనందు చేర్చిన భద్రతా పరిష్కారములకు ఆపాదించబడుతుంది. ఇంకా, ఈ నవీకరణ ప్లగ్-ఇన్Adobe Flash Player 10ను కలిగివుంది, ఇది క్రింది బగ్ పరిష్కారములను మరియు విస్తరింపులను చేర్చుతుంది:

  • సౌండ్ అవుట్‌పుట్ నందలి race నియమం సమస్యను పరిష్కరించుట ద్వారా Linux ప్లాట్‌ఫాం పైన స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.

  • వినియోగదారి ఫిల్టర్సు మరియు ప్రభావాలకు కొత్త మద్దతు, స్వాభావిక 3D బదిలీకరణ మరియు యానిమేషన్, అధునాతన ఆడియో ప్రోసెసింగ్, కొత్త, అనువైన టెక్స్టు యింజన్, మరియు GPU హార్డువేర్ ఏక్సెలరేషన్.

ఈ నవీకరణ గురించి అధిక సమాచారము కొరకు, Adobe Flash Player 10 విడుదల నోడ్సును ఈ క్రింది లింకువద్ద చూడుము:

http://www.adobe.com/support/documentation/en/flashplayer/10/Flash_Player_10_Release_Notes.pdf

gdb Rebase

gdb యిప్పుడు వర్షన్ 6.8కు పునఃప్రతిపాదించబడింది. ఇది చాలా అప్‌స్ట్రీమ్ ఫీచర్ నవీకరణలకు మరియు బగ్ పరిష్కారములకు ఆపాదిస్తుంది: C++ టెంప్లేట్సునందలి బ్రేక్‌పాయింట్సు మద్దతుకొరకు, కన్‌స్ట్రక్టర్సు మరియు యిన్‌లైన్ ఫంక్షంన్సు కొరకు.

ఈ నవీకరణలో ఆపాదించబడిన gdb నవీకరణలపై అదిక సమాచారము కొరకు, http://sourceware.org/cgi-bin/cvsweb.cgi/src/gdb/NEWS?rev=1.259.2.1&cvsroot=srcచూడండి.

AMD కుంటుంబపు 10h ప్రోసెసర్సుపై సూచన ఆధారిత సాంప్లింగ్

AMD కుంటుంబపు 10h ప్రోసెసర్సు కొరకు కొత్త హార్డువేరు ప్రోఫైలింగ్ మద్దతు Red Hat Enterprise Linux 5.3కొరకు జతచేయబడింది. ఈ కొత్త AMD CPUలు ఇన్‌స్ట్రక్షన్ బేస్‌డ్ సాంప్లింగ్ (IBS)ను మద్దతిస్తాయి. ఈ సమాచారమును సేకరించుటకు IBS మద్దతుకు oProfile డ్రైవర్ మార్పులు కావలిసివుంది మరియు ఈ కొత్త సౌలభ్యాలతో కూడిన కొత్త మోడల్ స్పెసిఫిక్ రిజిస్టర్సు (MSRs)ను సిద్దీకరించుటకు.

ఈ నవీకరణ కొత్త IBS_FETCH మరియు IBS_OP ప్రోఫైలింగ్‌ వుదాహరణలను పర్ CPU బఫర్సుకు మరియు oProfile డ్రైవర్ యొక్క ఘటనా బఫర్సుకు జతచేస్తుంది.IBS సాంప్లింగ్‌ను నియంత్రించుటకు కొత్త నియంత్రణ ప్రవేశాలుకూడా /dev/oprofileకు జతచేయబడినాయి. ఈ మార్పులు డ్రైవర్‌యొక్క గత PMC మాత్రమే వర్షన్‌తో సారూప్యతను కలిగివున్నయి, మరియు ఈ కొత్త డాటా‌ను వుపయోగించుటకు ఒక ప్రత్యేక పాచ్ oProfile 0.9.3కు అందుబాటులోవుంటుంది.

IBS పైన అదిక సమాచారముకొరకు ఈ పేపర్‌ను చూడండి: ఇన్‌స్ట్రక్షన్-బేస్‌డ్ సాంప్లింగ్: AMD కుంటంబపు 10h ప్రోసెసర్సు కొరకు కొత్త పనితనపు విశ్లేషణ సాంకేతికత, నవంబర్ 19, 2007

Squid Re-base

Squid స్థిరమైన(స్టేబుల్) సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌(STABLE21)కు నవీకరించబడింది.ఈ నవీకరణ చాలా బగ్‌లను పరిష్కరిస్తుంది:

  • squid init స్క్రిప్టు యెల్లప్పుడూ తప్పుగా నిష్క్రమణ కోడ్ 0ను యిస్తోంది. ఈ బగ్ యిప్పుడు పరిష్కరించబడింది, లైనక్స్‍ ప్రాధమిక ఆధారముతో squid compliant చేస్తోంది.

  • refresh_stale_hit డైరెక్టివ్‌ను వుపయోగించుటవలన దోష సందేశముClock going backwards squid లాగ్‌ఫైలునందు కనిపించుటకు కారణమౌతుంది.

  • squid సంస్థాపన కార్యక్రమము /usr/local/squid డెరెక్టరీయొక్క ఖచ్చితమైన వోనర్‌షిప్‌ను అమర్చలేదు. ఈవిడుదలతో, squid వినియోగదారి యిప్పుడు /usr/local/squidయొక్క అప్రమేయ యజమాని.

  • ఎప్పుడు squid అనునది ఫంక్షన్ hash_lookup()ను వుపయోగించుటకు ప్రయత్నించిన, అది signal 6తో బహిష్కరిస్తుంది.

  • squid_unix_group ఉపయోగించుట squid క్రాష్‌కు కారణంకావచ్చు.

Apache నందు ఈవెంట్ మల్టీ-ప్రొసెసింగ్ మోడల్

httpd, Apache HTTP సేవిక పేకేజీ, యిప్పుడు ప్రయోగాత్మక ఈవెంట్ మల్టీ-ప్రొసెసింగ్ మోడల్ (MPM)ను చేర్చుతుంది. keepalive అనుసంధానములను సంభాలించుటకు అంకితమైన తంతులను వుపయోగిస్తూ ఈ MPM పనితనమును మెరుగుపరుస్తుంది.

ఆడిట్ నవీకరణ

కెర్నల్‌నందలి ఆడిట్ వుపవ్యవస్థ చేత వుద్బవించిన ఆడిట్ రికార్డులును నిల్వవుంచుటకు మరియు శోధించుటకు ఆడిట్ ప్యాకేజీ యూజర్-స్పేస్ సౌలభ్యాలు కలిగివుంటుంది. ఆడిట్ ప్యాకేజీ కొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్ 1.7.7కు నవీకరించబడింది, యిది గత ఆడిట్ ప్యాకేజీలకు విస్తరింపులను మరియు బగ్ పరిష్కారములను అందిస్తుంది.

నవీకరించిన ఆడిట్ ప్యాకేజీలు క్రింది విస్తరింపులను జతచేస్తాయి:

  • ఆడిట్ సిస్టమ్ యిప్పుడు రిమోట్ లాగింగ్‌ను జరుపగలదు.

  • auditctl సౌలభ్యము యిప్పుడు ఆడిట్ నియమాలనందు బహుళ కీలను మద్దతిస్తుంది.

  • init స్క్రిప్ట్సు ద్వారా ఆడిట్ డెమోన్ ప్రారంభము అయినప్పుడు లోడయ్యే auditctl నియమాలను కలిగివుండే మాదిరి(సాంపిల్) STIG నియమాల ఫైలు (stig.rules) యిప్పుడు వొక వుదాహరణవలె ఈ నవీకరించిన ప్యాకేజీలనందు అందివ్వబడుతోంది.

  • syscall నామము మరియు సంఖ్యా సమాచారమును క్రాస్-రిఫరెన్సు చేయు ప్రయోజనము కొరకు, కొత్త సౌలభ్యము, ausyscall జతచేయబడింది.

  • ఆడిట్ ఈవెంట్సునందు అది చూసిన కీల గురించి aureport యిప్పుడు వొక నివేదికను అందిస్తుంది.

  • ausearch మరియు aureport ప్రోగ్రామ్సు కొరకు ఈవెంట్ లాగ్ పార్శింగ్ మెరుగుపరచబడింది.

libgomp re-base

libgomp వర్షన్ 4.3.2-7.el5కు పునఃప్రతిపాదించబడింది. పునః-ప్రతిపాదన OpenMP పనితనంను మెరుగుపరుస్తుంది మరియు OpenMP వర్షన్‌ 3.0కు gcc43 నిర్వర్తని(కంపైలర్)తో వుపయోగిస్తున్నప్పుడు మద్దతును జతచేస్తుంది.

iSCSI లక్ష్యపు సామర్థ్యము

iSCSI లక్ష్యపు సామర్థ్యము, లైనక్సు లక్ష్యపుయొక్క (tgt) ఫ్రేమ్‌వర్కునందు భాగముగా అందివ్వబడుతుంది, సాంకేతిక పారిదృశ్యంనుండి పూర్తిమద్దతుకు Red Hat Enterprise Linux 5.3నందు కదుపబడింది. లైనక్సు లక్ష్యపు ఫ్రేమ్‌వర్కు సిస్టమ్‌ను బ్లాక్-లెవల్ SCSI నిల్వనుండి SCSI సిద్దీకరణను కలిగిన యితర సిస్టమ్సుకు అందించుటకు అనుమతిస్తుంది. ఈ సామర్ధ్యం ప్రప్రధమంగా Linux iSCSI లక్ష్యమువలె సంస్థాపించబడుతుంది, ఏదేని iSCSI సిద్దీకరణికి నిల్వను నెట్వర్కునందు అందించుటకు.

iSCSI లక్ష్యమును అమర్చుటకు, scsi-target-utils RPMను సంస్థాపించుము మరియు దీనినందలి సూచనలను చూడుము: /usr/share/doc/scsi-target-utils-[version]/README మరియు /usr/share/doc/scsi-target-utils-[version]/README.iscsi

3. డ్రైవర్ నవీకరణలు

3.1. అన్ని ఆకృతులు

సాధారణ డ్రైవర్/ప్లాట్‌ఫాం నవీకరణలు
  • Intel High Definition Audio డ్రైవర్ ALSA నందు నవీకరించబడినది.

  • AMD ATI ఇంటిగ్రెటెడ్ చిప్‌సెట్స్‍‌నందు హై-డెఫినిషన్ మల్టీమీడియా ఇంటర్‌ఫేస్ (HDMI) ఆడియో మద్దతు నవీకరించబడింది.

  • ఈ క్రింది Wacom గ్రాఫిక్స్‍ టాబ్లెట్స్‍ ఇప్పుడుlinuxwacom డ్రైవర్ల ద్వారా మద్దతు ఇవ్వబడతాయి:

    • Cintiq 20WSX

    • Intuos3 4x6

  • lpfc డ్రైవర్ Emulex Fibre Channel Host Bus ఎ‍డాప్టర్స్‍‌కొరకు వర్షన్ 8.2.0.33.2pకు నవీకరించబడింది. ఇది చాలా అప్‌స్ట్రీమ్ మార్పులకు ఆపాదించబడుతుంది:

    • NETLINK_SCSITRANSPORT యిప్పుడు వుపయోగించబడుతోంది

    • సిద్దముకాని నోడ్ యాక్సిస్‌చేయుట పరిష్కరించబడింది.

    • NPIV చేతనంగా వున్నప్పుడు echotest వైఫల్యానికి కారణమైన బగ్ పరిష్కరించబడింది.

    • fcauthd 1.19 యిప్పుడు fibre చానెల్ ఆథెంటికేషన్‌కు అవసరము.

  • dm-multipath యిప్పుడు IBM DS4000కొరకు ఇన్‌బాక్స్‍ మద్దతును కలిగివుంది.

  • ixgbe డ్రైవర్ యిప్పుడు 82598AT డ్యూయల్-పోర్ట్‍ ఎడాప్టర్‌ను మరియు82598 CX4 ఎడాప్టర్‌ను మద్దతిస్తుంది.

  • Digi Neo PCI Express 4 HiProfile I/O ఎడాప్టర్లకు మద్దతు చేకూర్చుట కొరకు jsm డ్రైవర్ నవీకరించబడింది.

  • hp-ilo: డ్రైవర్ జతచేయబడింది, HP Integrated Lights Out (iLO) సాంకేతికతకు మద్దతిస్తుంది.

  • radeon_tp డ్రైవర్ ఈ విడుదలనందు పూర్తిగా మద్దతిస్తోంది. ఈ డ్రైవర్ ATI R500/R600 చిప్‌సెట్స్‍‌ను చేతనంచేస్తుంది.

    ఈ డ్రైవర్ క్రింది సామార్ధ్యాలను కూడా కల్పిస్తుంది:

    • R500/R600 చిప్‌సెట్స్‍‌పై రీతిఅమరిక

    • R500 చిప్‌సెట్స్‍‌పై 2D త్వరుణం

    • R600 చిప్‌సెట్స్‍‌పై ఛాయా ఫ్రేంబఫర్ త్వరుణం

  • powernow-k8 డ్రైవర్ ఈ విడుదలనందు లోడ్‌చేయదగిన మాడ్యూల్‌వలె చేర్చబడింది.(Red Hat Driver Update Model మరియు Dell DKMS) వంటి డ్రైవర్ ఫ్రేమ్‌వర్క్సు powernow-k8 డ్రైవర్ నవీకరణలు వినియోగదారులకు RPM ప్యాకేజీలవలె అందిచగలవు అవి కెర్నల్ నవీకరించవలసిన అవసరమువుండదు.

  • లెగసీ ముద్రణాయంత్రాలకు మద్దతునిచ్చుటకు Red Hat ఈ విడుదలనందు, pnm2ppaను తిరిగి-జతచేస్తోంది. ఏమైనప్పటికి, ఈ మద్దతు భవిష్యత్తు విడుదలలనందు నిలిపివేయబడుతుందని, గమనించండి.

  • USB స్మార్ట్‍‌కార్డ్‍ కీబోర్డ్స్‍ కొరకు మద్దతునిచ్చుటకు ccid డ్రైవర్ పునః-ప్రతిపాదన చేయబడింది.

  • uvcvideo డ్రైవర్సు USB వీడియో పరికరములకొరకు కెర్నల్‌కు Red Hat Enterprise Linux 5.3 నందు జతచేయబడినవి.

నెట్వర్కింగ్
  • Broadcom NetXtreme II నెట్వర్కు కార్డ్స్‍ కొరకు bnx2 డ్రైవర్ వర్షన్ 1.7.9కు నవీకరించబడింది.సిస్టమ్‌ బూట్‌నందు యిబ్బంది కలుగజేయు బగ్‌ను పరిష్కరించుటకు bnx2 వుపయోగించే, నియంత్రికలపైని ఈథర్నెట్ రింగ్ బఫర్ ఐచ్చికాలను ఈ నవీకరణ పరిష్కరిస్తుంది.

  • e1000e డ్రైవర్ Intel PRO/1000 ethernet పరికరములకొరకు అప్‌స్ట్రీమ్ వర్షన్ 0.3.3.3-k2కు నవీకరించబడింది. ఈ నవీకరణతో, మద్దతిచ్చు పరికరములయొక్క EEPROM మరియు NVM యిప్పుడు వ్రాయటానికి-వీలుకానివి.

  • igb: డ్రైవర్ Intel Gigabit Ethernet ఎడాప్టర్స్‍ కొరకు వర్షన్ 1.2.45-k2కు నవీకరించబడింది, 82576 ఆధారిత పరికరములకు మద్దతును జతచేయుటకు.

  • ixgbe డ్రైవర్ Intel(R) 10 Gigabit PCI ఎక్స్‍‌ప్రెస్నెట్వర్కు పరికరముల కొరకు వర్షన్ 1.3.18-k4కు నవీకరించబడింది.

  • niu డ్రైవర్ Red Hat Enterprise Linux 5.3కు జతచేయబడింది, Sun CP3220 సిస్టమ్స్‍‌పైన 10Gbps ఈథర్నెట్ పరికరాలకు మద్దతును జతచేస్తోంది.

  • లైనక్సు కెర్నల్ 2.6.25నుండి ipw2100 మరియు ipw2200 డ్రైవర్సు Intel PRO వైర్‌లెస్ పరికరములకొరకు Red Hat Enterprise Linux 5.3కు చేకూర్చడమైనది(బ్యాక్‌పోర్టెడ్).

  • లైనెక్సు కెర్నల్ 2.6.25నుండి Broadcom వైర్‌లెస్ పరికరములకొరకు bcm43xx డ్రైవర్ Red Hat Enterprise Linux 5.3కు చేకూర్చడమైనది(బ్యాక్‌పోర్టెడ్).

  • లైనక్సు కెర్నల్ 2.6.25నుండి ieee80211 మద్దతు మూలకం(కాంపోనెంటు) వైర్‌లెస్ పరికరములకొరకు Red Hat Enterprise Linux 5.3కు చేకూర్చడమైనది(బ్యాక్‌పోర్టెడ్).

  • లైనెక్సు 2.6.25కు ముందలి దానినుండి non-mac80211 వర్షన్‌కు సరిపోల్చుటకు ZyDas వైర్‌లెస్ పరికరములకొరకు zd1211rw డ్రైవర్ నవీకరించబడింది.

  • iwlwifi డ్రైవర్లు iwl4965 వైర్‌లెస్ పరికరాలకు 802.11n మద్దతును జతచేస్తూ, 2.6.26 వర్షన్‌కు నవీకరించబడినాయి. 2.6.26-తర్వాతి వర్షన్‌లకు చేర్చిన చాలా బగ్ పరిష్కారాలు బ్యాక్‌పోర్టెడ్ డ్రైవర్‌నందుకూడా చేకూర్చబడినాయి.

  • Myricom Myri-10G ఈథర్నెట్ కొరకు myri10ge డ్రైవర్ పరికరాలు వర్షన్ 1.3.2-1.269కు నవీకరించబడినాయి.

  • netxen డ్రైవర్ అనునది NetXen నెట్వర్కు కార్డ్సు కొరకు 3.4.18 వర్షన్‌కు నవీకరించబడింది.

  • Broadcom Everest నెట్వర్క పరికరముల కొరకు bnx2x డ్రైవర్ వర్షన్ 1.45.23కు నవీకరించబడింది, 57711 హార్డువేరు కొరకు మద్దతును జతచేస్తోంది.

  • సరియగు లింక్-అప్ గుర్తింపును నిరోధిస్తున్న బగ్‌ను పరిష్కరించుటకు forcedeth-msi డ్రైవర్ నవీకరించబడింది.

  • లైనక్సు కెర్నల్ 2.6.26నుండి ath5k డ్రైవర్ అనుదానిని Atheros వైర్‌లెస్ పరికరములకొరకు Red Hat Enterprise Linux 5.3కు చేకూర్చడమైనది(బ్యాక్‌పోర్టెడ్).

  • లైనక్సు కెర్నల్ 2.6.26నుండి rt2x00 డ్రైవర్సు Ralink వైర్‌లెస్ పరికరముల కొరకు Red Hat Enterprise Linux 5.3కు చేరకూర్చడమైనది(బ్యాక్‌పోర్టెడ్).

  • లైనక్సు కెర్నల్ 2.6.26నుండి rtl8180 మరియు rtl8187 డ్రైవర్సు Realtek వైర్‌లెస్ పరికరములకొరకు Red Hat Enterprise Linux 5.3కు చేకూర్చడమైనది(బ్యాక్‌పోర్టెడ్).

  • cxgb3: డ్రైవర్ (తత్సంబందిత ఫర్మ్‍‌వేర్‌తో కలిసి) యిప్పుడు ఈ విడుదలతో చేర్చబడుతుంది. ఈ డ్రైవర్ Chelsio RDMA 10Gb PCI-E Ethernet adapterకు మద్దతిస్తుంది.

నిల్వ
  • 3w-xxxx: అనునది 3ware SATA RAID నియంత్రికలకొరకు వర్షన్ 1.26.03కు నవీకరించబడింది. ఇది చాలా అప్‌స్ట్రీమ్ మార్పులకు ఆపాదించబడుతుంది:

    • 2GBకన్నా యెక్కువ RAM కలిగిన సిస్టమ్‌నందు 3ware 7000 లేదా 8000 వరుసక్రమపు కార్డ్‍ వుపయోగిస్తున్నప్పుడు డాటా కరప్షన్‌కు కారణమౌతున్న బగ్ పరిష్కరించబడింది.

    • 4GBకన్నా యెక్కువ RAM కలిగిన సిస్టమ్‌నందు 3ware 8006 వరుసక్రమపు కార్డు వుపయోగిస్తున్నప్పుడు 64-bit ఆకృతులనందు Anaconda స్థంబించదు(హాంగ్ కాదు).

    • __tw_shutdown() సిద్దము చేయబడగానే irq సంభాలిక యిప్పుడు విడుదల(ఫ్రీడ్) కాబడుతోంది. మూసివేతనందు ఆటంకం(ఇంటరప్ట్‍) యెదురైతే సాధ్యమయ్యే నల్ పాయింటర్ డి-రిఫరెన్స్‍‌ను యిది నిరోధిస్తుంది.

    • క్యాచింగ్ మోడ్ పేజీకొరకు RCD బిట్ యిప్పుడు ఆన్ అయింది.

    • ioctl పునఃఅమర్పులు మరియు scsi పునఃఅమర్పులు యిప్పుడు వరుసక్రమం చేయబడినాయి కనుక అవి యికపై సంఘర్షించవు.

  • 3w-9xxx: డ్రైవర్ 3ware SATA RAID నియంత్రికల కొరకు వర్షన్ 2.26.08కు నవీకరించబడింది. ఇది చాలా అప్‌స్ట్రీమ్ మార్పులకొరకు ఆపాదించబడుతుంది:

    • 4GBకన్నా యెక్కువ RAM కలిగిన సిస్టమ్సునందు pci_unmap_single() కాల్ యిప్పుడు సరిగా కార్యాచరణం జరుగుతోంది.

    • స్లో వ్రైట్ పనితనమునకు కారణమగు బగ్ పరిష్కరించబడింది.

    • ఒకవేళ 64-bit విఫలమైతే DMA మాస్క్‍ అమర్పు యిప్పుడు 32-bitకు తిరిగివుంచబడుతుంది.

    • 3ware 9690SA SAS నియంత్రిక పరికరముకు మద్దతు జతచేయబడింది.

  • megaraid_sas: డ్రైవర్ 4.01-rh1 వర్షన్‌కు నవీకరించబడింది. ఈ నవీకరణద్వారా చాలా బగ్ పరిష్కారములు ఆపాదించబడతాయి, వీటితో కలుపుకొని:

    • MFI_POLL_TIMEOUT_SECS ఇప్పుడు 60 సెకనులు.

    • ఫ్రేమ్ లెక్కింపు గణనం వలన వరుసగా చిప్ పునఃఅమర్పులకు మరియు కమాండ్ సమయముగింపులు(టైమ్అవుట్స్‍)కు కారణమగు బగ్ పరిష్కరించబడింది.

    • LSI Generation 2 Controllersకు మద్దతు జతచేయబడింది (0078, 0079).

    • ఫర్మ్‍‌వేర్ మూసివేతను మెరుగుపరచుటకు మూసివేత పునరావృతం(రోటీన్)నందు DCMDను మూసివేయుటకు ఆదేశము జతచేయబడింది.

    • హార్డువేరు లైనక్సు డ్రైవరునందు అనుకోని అంతరాయములకు కారణమగు బగ్ పరిష్కరించబడింది.

  • SCSI పరికర సంభాలిక వ్యవస్థ (scsi_dh) నవీకరించబడింది, ఈ క్రింది మెరుగుదలలను అందిస్తుంది:

    • ఒక సముదాయ ALUA (asymmetric logical unit access) సంభాలిక అభివృద్ది చేయబడింది.

    • LSI RDAC SCSI ఆధారిత నిల్వ పరికరాలకు మద్దతు జతచేయబడింది.

  • QLogic Fibre Channel Host Bus ఎడాప్టర్సు కొరకు qla2xxx డ్రైవర్ నవీకరించబడింది, ISP84XX రకము కార్డ్స్‍ కొరకు మద్దతును జతచేస్తోంది.

  • వర్చ్యులైజ్‌డ్ టేప్ పరికరాలకు మద్దతునందిస్తూ, పురోగమన వర్చ్యువల్ SCSI (vSCSI) పరికరాల కొరకు ibmvscsi డ్రైవర్లు నవీకరించబడినాయి.

  • lpfc: డ్రైవర్ వర్షన్ 8.2.0.30కు నవీకరించబడింది.ఈ నవీకరణ చాలా బగ్ పరిష్కారాలకు మరియు విస్తరింపులకు ఆపాదించబడుతుంది, వీటితో కలుపుకొని:

    • PowerPC ఆకృతులనందు PCI ఎడాప్టర్స్‍ కొరకు అభివృద్దిపరచిన Enhanced Error Handling (EEH)ను

    • మద్దతిచ్చే NPIV వర్చ్యువల్ పోర్టుల సంఖ్యను వృద్దిపరచినది

    • I/O క్యూ డెప్తును నియంత్రించుటకు మెరుగుపరచిన డ్రైవర్ లాజిక్

    • Fibre Channel over Ethernet (FCoE) ఎడాప్టర్లకు జతపరిచిన మద్దతు

    • కొత్త హార్డువేర్ కొరకు SANనుండి బూట్ అవుట యిప్పుడు మద్దతీయబడుతోంది

  • cciss డ్రైవర్ HP Smart Array నియంత్రికలకొరకు వర్షన్ 3.6.20-RH2కు నవీకరించబడినవి.

4.1. అన్ని ఆకృతులు

  • relayfs గతంలో బఫర్ పరిమాణం పరిమితి 64MBగా కలిగివుంది. ఈ నవీకరణనందు, ఆన్-మెమొరీ బఫర్సుకొరకు relayfsకు కేటాయించిన మెమొరీ యొక్క పరిమితి 4095MBకు పెంచబడింది. ఇది relayfs వుపయోగించే SystemTap మరియు యితర ట్రేసింగ్ సాధనములు యెక్కువ ఈవెంట్లను ట్రేస్‌చేసే సామర్ధ్యమును యిస్తాయి.

  • Dell Remote Access Controller 4 (DRAC4) కొరకు డ్రైవర్ లేదు. కాబట్టి, DRAC4 చేత అందించబడిన ఏ వర్చ్యువల్ పరికరాలైనా కెర్నలుచేత గుర్తించబడలేదు.ఈ నవీకరణనందు, సరైన డ్రైవర్‌ను అందించే కెర్నలు మాడ్యూల్ pata_sil680 జతచేయబడింది, యిది సమస్యను పరిష్కరిస్తుంది.

  • relay ఇంటర్‌ఫేస్ కొరకు సందేశపు బఫర్సు relay_open() పిలువ బడినప్పుడు ఆన్‌లైన్ CPUల కొరకు మాత్రమే కేటాయించబడతాయి. కాబట్టి, వొక ఆఫ్-లైన్ CPU relay_open() పిలువబడిన తర్వాత ఆన్ అయితే, కెర్నల్ యిబ్బంది యెదురవుతుంది. ఈ నవీకరణనందు, ఏదేని కొత్త CPU జతకాబడితే కొత్త సందేశ బఫర్ గతికంగా కేటాయించబడుతుంది.

  • DSR/DTR హార్డువేర్ ఫ్లో నియంత్రణ కొరకు మద్దతును జతచేయుటకు 8250 ఆధారిత వరుస పోర్ట్సు డ్రైవర్‌ను నవీకరించబడమైనది.

  • Dell Wireless Wide Area Network (WWAN) కార్డ్సు కొరకు మద్దతు కెర్నల్‌కు జతచేయబడింది. ఇప్పుడు మద్దతిస్తున్నటువంటి పరికరములు:

    • Dell Wireless 5700 Mobile Broadband CDMA/EVDO Mini-Card

    • Dell Wireless 5500 Mobile Broadband HSDPA Mini-Card

    • Dell Wireless 5505 Mobile Broadband HSDPA Mini-Card

    • Dell Wireless 5700 Mobile Broadband CDMA/EVDO ExpressCard

    • Dell Wireless 5510 Mobile Broadband HSDPA ExpressCard

    • Dell Wireless 5700 Mobile Broadband CDMA/EVDO Mini-Card

    • Dell Wireless 5700 Mobile Broadband CDMA/EVDO Mini-Card

    • Dell Wireless 5720

    • Dell Wireless HSDPA 5520

    • Dell Wireless HSDPA 5520

    • Dell Wireless 5520 Voda I Mobile Broadband (3G HSDPA) Mini-Card

  • thinkpad_acpi కెర్నల్ మాడ్యూల్ కొత్త Thinkpad మాడ్యూళ్ళ కొరకు విస్తరిత మద్దతును అందించుటకు నవీకరించబడింది.

  • సాఫ్టు లుకప్ డిటెక్టార్ యిప్పుడు హెచ్చరిక సందేశములకు బదులుగా కెర్నల్ పానిక్ యిచ్చుటకు ఆకృతీకరించబడింది. సాఫ్టు లుకప్ జరుపునప్పుడు ఫోరెన్సిక్ ప్రయోజనాల కొరకు క్రాష్ డంప్‌ను సృష్టించుటకు మరియు విశ్లేషించుటకు యిది వినియోగదారులకు దీనిని సాధ్యపరుస్తుంది.

    పానిక్‌ను వుద్భవింపచేయుటకు సాఫ్టు లుకప్ డెటెక్టార్‌ను ఆకృతీకరించుటకు, కెర్నల్ పారామితి soft_lockupను 1కు అమర్చుము. ఈ పారామితి అప్రమేయంగా 0కు అమర్చివుంటుంది.

  • తరువాతి-సంతతి Intel Microarchitecture (Nehalem)పైన ఆధారపడిన ప్రోసెసర్సును oprofile సరిగా గుర్తించలేక పోయింది. కాబట్టి, పనితనం పర్యవేక్షణ విభాగం వుపయోగించ బడలేదు మరియు ప్రోసెసర్ టైమర్ యింటరప్టుకు వెళ్ళిపోయింది. సమస్యను పరిష్కరించుటకు కెర్నలు నవీకరించబడింది.

  • తరువాతి-సంతతి Intel Microarchitecture (Nehalem) పైన, C3, CPU పవర్ స్థితి కొరకు కెర్నల్‌కు మద్దతు జతచేయబడింది. C3 (స్లీప్ స్థితిగా కూడా తెలిసిన)కు ప్రవేశించుటవలన వూరకనే వున్నప్పుడు CPU యొక్క విద్యుత్ త్రాణ (పవర్ ఎఫిషియెన్సీ)ను మెరుగుపరస్తుంది.

  • గతంలో, కర్నల్‌కు అమర్చిన MAX_ARG_PAGES పరిమితి చాలా తక్కువ, మరియు ఈక్రింది దోషమును ఈయవచ్చును:

    execve: Argument list too long
    ఈ నవీకరణనందు, ఈ పరిమితి స్టాక్ పరిమాణముకు 25%కు పెంచబడింది, యిది సమస్యను పరిష్కరిస్తుంది.

  • లైనక్సు కెర్నల్ వర్షన్ 2.6.27నుండి Red Hat Enterprise Linux 5.3కు autofs4 నవీకరణలు సమకూర్చడమైనది.

  • వినియోగదారి స్థానపు అనువర్తనము యొక్క ఫోర్కుడ్ నకలుకు పైప్‌చేయుటకు ప్రాధమిక ఫైళ్ళను తెలిపే సమార్ధ్యం Red Hat Enterprise Linux 5.3 యిప్పుడు కలిగివుంది, నేరుగా ఫైలుకు కాకుండా. ఇది /proc/sys/kernel/core_pattern నందు | path/to/applicationను వుంచుటద్వారా చేతనమౌతుంది. కోర్ అనునది డంప్‌ చేయబడినప్పుడు, తెలుపబడిన అనువర్తనము యొక్క నకలు నిర్వర్తించబడుతుంది, మరియు stdin పైన కోర్ దీనికి పైప్ చేయబడుతుంది. ఇది కోర్ వృద్దియగుటకు, విశ్లేషించబడుటకు మరియు కోర్ డంప్ సమయమందు క్రియాశీలంగా సంభాలించబడుటకు అనుమతిస్తుంది.

  • ప్రతి స్వతంత్ర CPU చేత వుపయోగించబడిన అడ్వాన్సుడు ప్రోగ్రామబుల్ ఇంటరప్టు కంట్రోలర్ (APIC) యొక్క IDను /proc/cpuinfo ఫైలు యిప్పుడు నివేదిస్తుంది.

  • కొత్త సిస్టమ్సుకు అవసరమైనట్లుగా పెద్ద మెమొరీ ఆకృతీకరణలకు మద్దతిచ్చుటకు మిషన్ చెక్ ఎక్సెప్షన్ (MCE) కెర్నల్ వుపవ్యవస్థను విస్తరించింది.

  • ఫైలు వ్యవస్థలను Samba ద్వారా మౌంటుచేస్తున్నప్పుడు మౌంటు ఆదేశము యిప్పుడు Kerberos ధృవీకరణను మద్దతిస్తోంది. SPNEGO (సింపుల్ అండ్ ప్రొటెక్టెడ్ GSSAPI నెగోషియేషన్ మెకానిజం) భద్రతా bolb (బైనరీ లార్జ్‍ ఆబ్జక్టు)ను తిప్పియిచ్చే వినియోగదారిస్థానపు అనువర్తనము (cifs.upcall)ను కెర్నల్ కాల్‌చేయుటకు sec=krb5 లేదా sec=krb5i స్విచ్ అనుమతిస్తుంది. సేవికతో దృవీకరణపొందుటకు కెర్నల్ bolbను వుపయోగిస్తుంది మరియు అభ్యర్ధించిన ఫైలుసిస్టమ్‌ను మౌంటు చేస్తుంది.

  • IOAPIC NMI వాచ్‌డాగ్ పద్దతిని వుపయోగించే సిస్టమ్ పైన కెర్నల్ పారామితి kernel.unknown_nmi_panicను ఆకృతీకరిస్తే, కెర్నల్ పానిక్ సంభవించవచ్చు. ఇది యెందుచేతనంటే NMI వాచ్‌డాగ్ NMIలయొక్క మూలమును భద్రముగా అచేతనముచేయలేదు.

    ఈ విడుదలతో, వినియోగదారులు భద్రముగా NMI మూలమును అచేతనముచేయుటకు అనుమతించుటకు NMI వాచ్‌డాగ్ కోడ్ పునఃపరిశీలించబడింది. IOAPIC NMI వాచ్‌డాగ్ పద్దతిని వుపయోగించే సిస్టమ్సునందు మీరు కెర్నల్ పారామితి kernel.unknown_nmi_panicను యిప్పుడు మీరు భద్రముగా ఆకృతీకరించవచ్చు.

4.2. x86 ఆకృతులు

  • నడుస్తున్న CPUల సంఖ్యపైన powernowk8 డ్రైవర్ సరిపోవునటువంటి పరిశీలనలను జరుపుటలేదు. కాబట్టి, డ్రైవర్ ప్రారంభమైనప్పుడు, కెర్నల్ oops దోష సందేశము నివేదించబడి వుండవచ్చు. ఈ నవీకరణనందు, powernowk8 డ్రైవర్ మద్దతిచ్చునటువంచి CPU (supported_cpus)లు ఆన్‌లైన్ CPU (num_online_cpus)లకు సమానమేమో నిర్ధారిస్తుంది, ఇది సమస్యను పరిష్కరిస్తుంది.

4.3. PowerPC ఆకృతులు

  • CPUFreq, CPU త్వరుణాన్ని మరియు వోల్టేజీను కొలిసే కెర్నల్ వుపవ్యవస్థ, మెరుగైన మద్దతుతో Cell ప్రోసెసర్సుకొరకు నవీకరించబడింది. ఈ నవీకరణ CPUFreq గవర్నర్ తెలిసిన సినెర్జెటిక్ ప్రోసెసింగ్ యూనిట్ (SPU)ను ఈ నవీకరణ అభివృద్ది చేస్తుంది అది Cell ప్రోసెసర్సు పవర్ నిర్వహణను విస్తరింపచేస్తుంది.

  • Red Hat Enterprise Linux 5.3 నందలి Cell Broadband Engine Architecture పై ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ (EDAC) యిప్పుడు మద్దతిస్తోంది. EDACను చేతనంచేయుటకు, modprobe cell_edacను వుపయోగించుము.

    ఈ మాడ్యూల్ మీ నడుస్తున్న కెర్నల్‌కు జతచేయబడిందేమో పరిశీలించుటకు, క్రిందిదానివలె /var/log/dmesg అవుట్‌పుట్‌ను పరిశీలించుము:

    EDAC MC: Ver: 2.0.1 Oct  4 2008
    EDAC MC0: Giving out device to cell_edac MIC: DEV cbe-mic
    EDAC MC1: Giving out device to cell_edac MIC: DEV cbe-mic

    సరిదిద్దదగిన మెమొరీ దోషములు యెదురైతే, ఈ క్రింది సందేశము కన్సోలుకు తిప్పి పంపబడుతుంది:

    EDAC MC0: CE page 0xeff, offset 0x5700, grain 0, syndrome 0x51, row 0, channel
    0, label "":
  • బహుళ తంతుల మద్యన పంచుకొబడుతున్న వేరియబుల్‌ను వుపయోగిస్తూ హార్డువేరు వాచ్‌పాయింట్సును డీబగ్ చేయుట GNU డీబగ్గర్ (GDB) ఏర్రాటికల్‌గా ట్రిగ్గర్ ఈవెంట్లను తప్పిపోవుటకు కారణమౌతోంది. కెర్నల్ యిప్పుడు (GDB)ను స్థిరముగా వాచ్‌పాయింట్లను స్వీకరించుటకు అనుమతించునట్లు నవీకరించబడింది, యిది డీబగ్గింగ్ భాగపు నమ్మకాన్ని మెరుగుపరస్తుంది.

4.4. x86_64 ఆకృతులు

  • kprobe-booster యిప్పుడు ia64 మరియు x86_64 నిర్మాణములనందు మద్దతిస్తోంది, కెర్నల్ ఈవెంట్సును మరింతవేగముగా ప్రోబ్‌చేయుటకు వినియోగదారులను అనుమతిస్తూ. 64-bit ఆకృతిపైన నడుస్తున్న సేవికలపైన ఈ సౌలభ్యము ప్రోభింగ్ సాధనముల(e.g. SystemTap మరియు Kprobes) వలన కలిగిన భారమును తగ్గిస్తుంది.

  • _PTC (Processor Throttling Control), _TSS (Throttling Supported States) మరియు _TPC (Throttling Present Capabilities) ఆబ్జక్ట్సు కొరకు మద్దతు కెర్నలుకు జతచేయబడింది. ఈ మద్దతు, అదునాతన అకృతీకరణనందు భాగము మరియు పవర్ ఇంటర్‌ఫేస్ స్పెసిఫికేషన్ (ACPI)ను కలిగివుంది యిది ప్రోసెసర్ త్రొటెలింగ్ యొక్క మెరుగైన నిర్వహణను అందిస్తుంది.

4.5. s390x ఆకృతులు

  • సింగిల్ కోట్సు లోపల డబుల్ కోట్సుతో కప్పివున్న, zipl.conf పారామితులు (parameters='vmhalt="LOGOFF"' సరిగా పార్శు చేయబడిలేదు. కాబట్టి, కెర్నల్-kdump ప్యాకేజీ సంస్థాపన విఫలనం కావచ్చు, ఈ దోషమును ఈయవచ్చు:

    grubby fatal error: unable to find a suitable template
    సమస్యను పరిష్కరించుటకు, పారామితులు డబుల్ కోట్సు లోపల సింగిల్ కోట్సుతో కప్పివుంచాలి (parameters="vmhalt='LOGOFF'")

    Note

    డబుల్ కోట్స్‍ లోపలి సింగిల్ కోట్స్‍ యొక్క సిన్టాక్స్‍ ఆకృతి Red Hat Enterprise Linux 5 నందు అప్రమేయము.

4.6. ia64 ఆకృతి

  • డ్యూయల్-కోర్ Intel Itanium 2 processor మిషన్ చెక్ ఆర్కిటెక్చర్ (MCA) రికార్డులను పాత Intel Itanium processorsకు విభిన్నంగా నింపుతుంది. కొన్ని పరిస్థితులలో యిప్పుడు క్యాచీ చెక్ మరియు బస్ చెక్ లక్ష్యపు ఐడెంటిఫైర్స్‍ విభిన్నంగా వుంటాయి. సరైన లక్ష్యపు ఐడెంటిఫైర్‌ను గుర్తించుటకు కెర్నల్ నవీకరించబడింది.

  • kprobe-booster యిప్పుడు ia64 మరియు x86_64 నిర్మాణములనందు మద్దతిస్తోంది, కెర్నల్ ఈవెంట్సును మరింతవేగముగా ప్రోబ్‌చేయుటకు వినియోగదారులను అనుమతిస్తూ. 64-bit ఆకృతిపైన నడుస్తున్న సేవికలపైన ఈ సౌలభ్యము ప్రోభింగ్ సాధనముల(e.g. SystemTap మరియు Kprobes) వలన కలిగిన భారమును తగ్గిస్తుంది.

  • ఈ నవీకరణనందు, pselect() మరియు ppoll() సిస్టమ్ కాల్సుకొరకు మద్దతు కెర్నల్‌కు జతచేయబడింది.

5. వర్చ్యులైజేషన్

ఈ విభాగం వర్చ్యులైజేషన్ సాధనముల యొక్క Red Hat Enterprise Linux సూట్‌కు చేసిన నవీకరణల గురించిన సమాచారాన్ని కలిగివుంటుంది.

5.1. భవిష్యత్ నవీకరణలు

  • blktap (blocktap) యూజర్‌స్పేస్ టూల్‌కిట్ నవీకరించబడింది, blktap బ్యాక్‌డ్ వర్చ్యులైజ్‌డ్ గెస్ట్సు యొక్క బదిలీకరణ గణాంకాలను పర్యవేక్షించుటకు కార్యరూపకతను అందిస్తుంది.

  • Intel ఎక్స్‍‌టెండెడ్ పేజీ టేబుల్ (EPT)కు మద్దతు చేకూర్చబడింది, ఇది EPTను మద్దతిచ్చు హార్డువేరుపైన పూర్తిగా వర్చ్యులైజ్ చేసిన గెస్టులయొక్క పనితనంను మెరుగుపరుస్తుంది.

  • గెస్టుల కొరకు e1000 నెట్వర్కు పరికరం ఎమ్యులేషన్ ఈనవీకరణనందు జతచేయబడింది, ia64 నిర్మాణంనందు Windows 2003 గెస్టులను మద్దతిస్తుంది. e1000 ఎమ్యులేషన్‌ను వుపయోగించుటకు, xm ఆదేశము తప్పక వుపయోగించాలి.

  • virtio డ్రైవర్సు, KVMనందు I/O వర్చ్యులైజేషన్ కొరకు ప్లాట్‌ఫాం,Red Hat Enterprise Linux 5.3కు Linux Kernel 2.6.27నుండి సమకూర్చడమైనది. అధిక స్థాయిలో I/O పనితనాన్ని సాధించుటకు ఈ డ్రైవర్లు KVM గెస్టులను చేతనపరుస్తాయి. వివిధ వినియోగదారిస్థానపు మూలకాలు: anaconda, kudzu, lvm, selinux మరియు mkinitrd అనునవి virtio పరికరాలను మద్దతిచ్చుటకు నవీకరించబడినవి.

  • స్వాభావిక లైనక్సు కెర్నల్ vmcoreinfoను స్వయంచాలకంగా మద్దతునిస్తుంది, అయితే, dom0 డొమైన్సునందు kdumpను అమర్చుటకు, kernel-xen-debuginfo ప్యాకేజీ అవసరము. ఈ విడుదలతో, కెర్నల్ మరియు హైపర్విజర్ సవరించబడినవి మరియు vmcoreinfo చదువుటను మరియు kdump స్వాభావికంగా వ్రాయుటను మద్దతిస్తుంది. dom0 డొమైన్సు పైన డీ-బగ్గింగ్‌ను లేదా యితర పరిశోధనలను చేయుటకు kdump అవసరమైన వినియోగదారులు యిప్పుడు debuginfo లేదా debuginfo-common ప్యాకేజీలు సంస్థాపించకుండానే అలా చేయవచ్చు.

  • పూర్తిగా వర్చ్యులైజ్ చేసిన Red Hat Enterprise Linux 5 గెస్టులు ఎమ్యులేటెడ్ డిస్కు మరియు నెట్వర్కు పరికరాలను వుపయోగిస్తున్నప్పుడు సబ్ఆప్టిమల్ పనితనాన్ని యెదుర్కొన్నాయి. ఈ నవీకరణలో, పూర్తిగా వర్చ్యులైజ్ చేసిన గెస్టులనందు పారావర్చ్యులైజ్డు డిస్కులు మరియు నెట్వర్కుల వుపయోగాన్ని సులభతరం చేయుటకు kmod-xenpv ప్యాకేజీ చేర్చబడింది.

    ఈ డ్రైవర్లను పూర్తిగా వర్చ్యులైజ్ చేసిన గెస్టులనందు వుపయోగించుటవలన వాటియొక్క పనితనాన్ని మరియు కార్యనిర్వర్తనను మరింతగా పెంచుతుంది. netfront మరియు block front డ్రైవర్ల కొరకు చేసిన బగ్ పరిష్కారాలు తక్షణమే గుర్తించబడతాయి మరియు కెర్నల్ ప్యాకేజీతో ఏకకాలం చేయబడతాయి.

  • గెస్టులు యిప్పుడు 2MB బ్యాకింగ్ పేజీ మెమొరీ పట్టికలను కలిగివుండే సామర్ద్యమును కలిగివున్నారు, ఏదైతే సిస్టమ్ పనితనాన్ని మెరుగుపరుస్తుందో.

5.2. పరిష్కరించిన విషయాలు

5.2.1. అన్ని ఆకృతులు

  • పారావర్చ్యులైజ్డు గెస్టును మూసివేయుట వలన dom0 కొంతసమయంపాటు స్పందించకుండా వుండుటకు కారణంకావచ్చు. ఎక్కువ మొత్తంలో మెమొరీ (12GB మరియు అంతకన్నాయెక్కువ) వున్న గెస్టులనందు ఆలస్యం చాలా సెకనులపాటు వుండవచ్చు. ఈ నవీకరణనందు, పెద్ద పారావర్చ్యులైజ్డు గెస్టు ముందుగా- ఖాళీ చేయుటకు దాని మూసివేతను వర్చ్యులైజ్డు కెర్నలు అనుమతిస్తుంది, యిది ఈ సమస్యను పరిష్కరిస్తుంది.

  • crash vmcore ఫైలు నుండి హైపర్విజర్ యొక్క రిలోకేషన్ చిరునామాను చదువలేదు. కాబట్టి, క్రాష్‌తో వర్చ్యులైజ్డు కెర్నల్ vmcore ఫైలు తెరువట విఫలమౌతుంది, ఈ దోషాన్ని యిస్తుంది:

    crash: cannot resolve "idle_pg_table_4"
    ఈ నవీకరణనందు, హైపర్విజర్ చిరునామాను సరిగా భద్రపరుస్తుంది, యిది సమస్యను పరిష్కరిస్తుంది.

  • గతంలో, పారావర్చ్యులైజ్డు గెస్టులు గరిష్టంగా 16 డిస్కు పరికరములను మాత్రమే కలిగివుండేవి. ఈ నవీకరణనందు, ఈ పరిమితి గరిష్టంగా 256 డిస్కు పరికరములకు పెంచబడింది.

  • kdump కెర్నల్ కొరకు నిల్వవుంచిన మెమొరీ సరైనది కాదు, వుపయోగించని క్రాష్ డంప్సుకు కారణమౌతుంది. ఈ నవీకరణనందు, మెమొరీ నిల్యవుంచుట సమంజసమే, సరైన క్రాష్ డంప్సు వుద్బవించుటకు అనుమతిస్తుంది.

  • డిస్కును ప్రత్యేకమైన నామముతో (ie. /dev/xvdaa, /dev/xvdab, /dev/xvdbc మొదలగు) పారావర్చ్యులైజ్డు గెస్టుకు అనుభందించుటవలన గెస్టు లోపల /dev పరికరము పాడవటానికి కారణమౌతుంది. ఈ నవీకరణ ఈ సమస్యను పరిష్కరించింది కనుక డిస్కులను ఈ నామములతో పారావర్చ్యులైజ్డు గెస్టుకు అనుభందించుట సరైన /dev పరికరాన్ని గెస్టులోపల సృష్టిస్తుంది.

  • గతంలో, లూప్‌బ్యాక్ పరికరముల సంఖ్య 4కు పరిమితమైనవి. కాబట్టి, యిది 4కన్నా యెక్కువ నెట్వర్కు యింటర్‌ఫేస్‌లతో వున్న సిస్టమ్సుపైన బ్రిడ్జస్ సృష్టించగలిగే సామర్ధ్యాన్ని పరిమితంచేస్తుంది. ఈ నవీకరణలో, netloop డ్రైవర్ అవసరమైన అదనపు లూప్‌బ్యాక్ పరికరములను సృష్టిస్తుంది.

  • వర్చ్యువల్ నెట్వర్కు పరికరాలను సృష్టిస్తున్నప్పుడు మరియు నాశనంచేస్తున్నప్పుడు race నియమం అవసరమౌతుంది. కొన్ని పరిస్థితులలో -- ప్రత్యేకించి కొన్ని సందర్భాలలో -- యిది వర్చ్యువల్ పరికరము స్పందించకుండా చేయుటకు కారణమౌతుంది. ఈ నవీకరణనందు, race నియమం యెదురుకాకుండా నిరోధించుటకు వర్చ్యువల్ పరికరము యొక్క స్థితి పరిశీలించబడుతుంది.

  • అనువర్తనము నడుపుతూనేవుంటే virt-managerనందు మెమొరీ లీకు సంభవించవచ్చు. తదనుగుణంగా, అనువర్తనము వరుసగా ఎక్కువ వనరులను ఖర్చుచేయవచ్చు, అది మెమొరీ వెలితికి కారణంకావచ్చు. ఈ నవీకరణనందు, లీకు సరిదిద్దబడింది, యిది ఈ సమస్యను పరిష్కరిస్తుంది.

  • Red Hat Enterprise Linux హైపర్విజర్సు రిలోకేటబుల్ అయినందువల్ల మరియు రీలొకేట్‌చేసిన భౌతిక ఆధార చిరునామా vmcore ఫైలుయొక్క ELF హెడర్‌నందు పాస్ కాదు కనుక kernel-xen నడిచే సిస్టమ్సునుండి x86_64 vmcoresను crash సౌలభ్యము విశ్లేషించలేదు. క్రాష్ సౌలభ్యము కొరకు కొత్త --xen_phys_start కమాండ్ లైను ఐచ్చికము వినియోగదారి క్రాష్‌ను రిలోకేటెడ్ బేస్ భౌతిక చిరునామాకు పాస్ చేయుటకు అనుమతిస్తుంది.

  • అన్ని మౌస్ ఘటనలు Paravirtual Frame Buffer (PVFB) చేత పట్టుబడలేదు మరియు నిర్వర్తించబడలేదు. కాబట్టి, Virtual Machine Consoleతో పారావర్చ్యువలైజ్డు గెస్టుతో సంప్రదించునప్పుడు స్క్రాల్ వీలు సరిగా పనిచేయదు. ఈ నవీకరణలో, స్క్రాల్ వీల్ మౌస్ ఘటనలు సరిగా సంభాలించ బడతాయి, యిది సమస్యను పరిష్కరిస్తుంది.

  • ఎక్కువ మొత్తములో మెమొరీ (256GB లేదా ఎక్కువ) కలిగిన సిస్టమ్సు పైన, dom0 అమర్చుట హైపర్విజర్ మెమొరీ హీప్‌ను మించిపోతుంది. ఇది సరిదిద్దుటకు, xenheap మరియు dom0_size కమాండా లైను ఆర్గుమెంట్లు సిస్టమ్‌కొరకు చెల్లునటువంటి విలువలతో అమర్చాలి. ఈ నవీకరణ నందు, హైపర్విజర్ ఈ విలువలను స్వయంచాలకంగా అమర్చుటకు నవీకరించబడింది, యిది ఈ సమస్యను పరిష్కరిస్తుంది.

  • ఎక్కువ సంఖ్యలో CPUలతో వున్న మిషన్‌పైన వర్చ్యులైజేషన్ వుపయోగించుటవలన గెస్టు సంస్థాపిస్తున్నప్పుడు హైపర్విజర్ క్రాష్‌కు కారణంకావచ్చు. ఈ నవీకరణనందు, ఈ సమస్య పరిష్కరించబడింది.

  • గెస్టును ఎక్కువ మెమొరీ వుపయోగించి సృష్టిస్తున్నప్పుడు సాఫ్టులుకప్ అవసరపడవచ్చు. కాబట్టి, దోషము యొక్క కాల్ ట్రేస్ dom0 మరియు గెస్టు రెంటిపైనా ప్రదర్శితమౌతుంది. ఈ నవీకరణలో, ఈ సమస్యపరిష్కరించబడింది.

  • CPUID ఫ్యామిలి విలువ 6ను యిచ్చే Intel ప్రోసెసర్సు పైన, ఒక పనితనపు గణని రిజిస్టర్ మాత్రమే kernel-xenనందు చేతనం చేయబడివుంది. కాబట్టి, 0 మాదిరులు అందివ్వబడినవి. ఈ నవీకరణనందు, ఈ సమస్య పరిష్కరించబడింది.

5.2.2. x86 ఆకృతులు

  • కొత్త CPUలతో వున్న సిస్టమ్సునందు, CPU APIC ID అనునది CPU ID తో విభేదిస్తుంది. కాబట్టి, వర్చ్యులైజ్డు కెర్నలు CPU తరచుదనం స్కేలింగ్‌ను సిద్దము చేయలేదు. ఈ నవీకరణనందు, వర్చ్యులైజ్డు కెర్నల్ CPU APIC ID ను హైపర్విజర్‌నుండి యిప్పుడు వెలికితీస్తోంది, CPU తరచుదనం స్కేలింగ్‌ సరిగా సిద్దీకరించుటకు అనుమతిస్తుంది.

  • x86 పారావర్చ్యులైజ్డు గెస్టును నడుపుచున్నప్పుడు, వొక ప్రోసెస్ సరికాని మెమొరీని యాక్సిస్‌చేస్తే, SEGV సంకేతమును పొందుటకు బదులుగా అది లూప్‌లో నడిచేది. హైపర్విజర్ క్రింద జరుగు execshield పరిశీలనా మార్గంలో లోపమునకు యిది కారణమయింది. ఈ నవీకరణలో, ఈ సమస్య పరిష్కరించబడింది.

5.2.3. ia64 ఆకృతి

  • గతములో గెస్ట్‍ సంస్థాపనా వైఫల్యానికి కారణమైన xend బగ్ యిప్పుడు పరిష్కరించబడింది.

  • evtchn ఈవెంట్ చానల్ పరికరము లాక్స్‍ మరియు మెమొరీ అడ్డంకులు లోపించినవి. ఇది xenstore స్పందించకుండా వుండుటకు కారణమౌతుంది. ఈ నవీకరణలో, ఈ సమస్యపరిష్కరించబడింది.

  • నాన్-యూనిఫాం మెమొరీ యాక్సిస్ (NUMA) సమాచారము xm info ఆదేశము ద్వారా ప్రదర్శించబడుట లేదు. కాబట్టి, node_to_cpu విలువ ప్రతి నోడ్ కొరకు తప్పుగా no cpusలా వస్తోంది. ఈ నవీకరణలో, ఈ సమస్య పరిష్కరించబడింది.

  • గతంలో, హార్డువేరు వర్చ్యువల్ మిషన్ (HVM)పైన VT-i2 సాంకేతికత కలిగిన ప్రోసెసర్సునందు గెస్టులను సృష్టించుట విఫలమయ్యేది. ఈ నవీకరణనందు, ఈ సమస్య పరిష్కరించబడింది.

5.2.4. x86_64 ఆకృతులు

  • గెస్టుల వర్చ్యువల్ మిషన్లు సృతిమించినప్పుడు గతిక IRQలు అందుబాటైనప్పుడు, dom0 కెర్నల్ క్రాష్ అవుతుంది. ఈ నవీకరణనందు, క్రాష్ నియమం సరిదిద్దబడింది, మరియు అందుబాటులోవున్న IRQల సంఖ్య పెంచబడింది, యిది సమస్యను పరిష్కరిస్తుంది.

  • కొత్త CPUలతో వున్న సిస్టమ్సునందు, CPU APIC ID అనునది CPU ID తో విభేదిస్తుంది. కాబట్టి, వర్చ్యులైజ్డు కెర్నలు CPU తరచుదనం స్కేలింగ్‌ను సిద్దము చేయలేదు. ఈ నవీకరణనందు, వర్చ్యులైజ్డు కెర్నల్ CPU APIC ID ను హైపర్విజర్‌నుండి యిప్పుడు వెలికితీస్తోంది, CPU తరచుదనం స్కేలింగ్‌ సరిగా సిద్దీకరించుటకు అనుమతిస్తుంది.

5.3. తెలిసిన విషయాలు

5.3.1. అన్ని ఆకృతులు

  • వర్చ్యులైజ్డు కెర్నల్ వుపయోగిస్తున్నప్పుడు డిస్కీట్ డ్రైవ్ మాద్యమం వినియోగించలేము. దీనిని పొందుటకు, USB-అనుబందిత డిస్కీట్ డ్రైవ్‌ను వుపయోగించుము.

    ఇతర వర్చ్యులైజ్డు-కాని కెర్నల్సుతో డిస్కీట్ డ్రైవ్ మాద్యమం మంచిగా పనిచేస్తుందని గమనించండి.

  • పారావర్చ్యులైజ్డు గెస్టులయొక్క లైవ్ మైగ్రేషన్సు నందు, సమయ-ఆధారిత గెస్టు ప్రోసెస్‌లు సంభందిత హోస్టుల (dom0) సమయాలు ఏకకాలం(సింక్రనైజ్డు) కాకపోతే సరిగా కార్యనిర్వహణం జరగకపోవచ్చు. మైగ్రేషన్‌కు ముందుగా అన్ని సంభందిత హోస్టులకొరకు సిస్టమ్ సమయాలు ఏకకాలం అగుటకు NTP వుపయోగించండి.

  • రెండు అతిధేయాల మద్య పారావర్చ్యులైజ్‌డ్ అతిధేయీల పునరావృత లైవ్ మైగ్రేషన్ అనునది ఒక అతిధేయ ఇబ్బందికి కారణమౌతుంది. అతిధేయ అనునది ఒక అతిధేయి సిస్టమ్‌నుండి బయటకుమైగ్రేటై మరలా లోనికిమైగ్రేటయ్యే లోపల పునఃప్రారంభమైతే, ఇబ్బంది ఎదురవదు.

  • గెస్టు బహుళ వర్చ్యువల్ CPUలతో బూటైనప్పుడు Windows 2008 లేదా Windows Vista నడుస్తున్న డిస్కును గెస్టులా ఫార్మాట్ చేయుటవలన క్రాష్ చేస్తుంది. ఇది సరిదిద్దుటకు, ఫార్మాట్ చేస్తున్నప్పుడు గెస్టును వొకే వర్చ్యువల్ CPUతో బూట్ చేయుము.

  • virt-manager ద్వారా సృష్టించిన పూర్తిగా వర్చ్యులైజ్ చేసిన గెస్టులు కొన్నిసార్లు మౌస్ ఫ్రీగా స్క్రీనుపై కదులుటనుండి నిరోధిస్తాయి. దీనిని సరిదిద్దుటకు, గెస్టుకొరకు USB టాబ్లెట్ పరికరము ఆకృతీకరించుటకు virt-managerను వుపయోగించుము.

  • 128 లేదా ఎక్కువ CPU సిస్టమ్‌పైన గరిష్ట CPUలు తప్పక 128కన్నా తక్కువకు నియత్రించబడాలి. ప్రస్తుతం మద్దతిచ్చు గరిష్టసంఖ్య 126. హైపర్విజర్‌ను 126కు పరిమితం చేయుటకు హైపర్విజర్ ఆర్గుమెంట్ maxcpus=126ను వుపయోగించండి.

  • పూర్తిగా వర్చ్యులైజ్ చేసిన గెస్టులు సమయాన్ని కొల్పోకుండా సరిదిద్దబడలేవు యెంచేతంటే డొమైన్ నిలుపబడుతూ మరియు కొనసాగించబడుతూవుంటుంది కావున. నిలువరింపు మరియు కొనసాగింపుల మద్య సమయాన్ని సరిగా సేకరించుట పారావర్చ్యులైజ్డు కెర్నల్సుయొక్క లాభములలో వొకటి. ఈ సమస్య గుర్తించబడింది పునఃస్థాపించగల టైమర్సుతో అప్‌స్ట్రీమ్ చేయబడింది, అందువలన పూర్తిగా వర్చ్యులైజ్ చేయబడిన గెస్టులు పారావర్చ్యులైజ్డు టైమర్సును కలిగివుంటాయి. ప్రస్తుతం, ఈ కోడ్ అప్‌స్ట్రీమ్ అభివృద్దిలో వుంది Red Hat Enterprise Linux తరువాతి వర్షన్లనందు అందుబాటులో వుంటుంది.

  • dom0 కన్సోలుపై పారావర్చ్యులైజ్డు గెస్ట్సుయొక్క పునరావృత మైగ్రేషన్ bad mpa సందేశాలుగా ఫలించవచ్చు. కొన్ని సందర్బాలలో, హైపర్విజర్‌కూడా యిబ్బందిని యెదుర్కొనవచ్చు.

    హైపర్విజర్ కెర్నల్ పానిక్‌ను నిరోధించుటకు, వొకసారి bad mpa సందేశాలు కనిపించగనే మైగ్రేట్‌చేసిన గెస్ట్సును పునఃప్రారంభించుము.

  • dom0పైన ఇంటర్‌ఫేస్ బాండింగ్‌ను అమర్చుతున్నప్పుడు, అప్రమేయ network-bridge స్క్రిప్టు, నెట్వర్కు ఇంటర్‌ఫేస్‌లు ప్రత్యామ్నాయంగా అందుబాటులోలేని మరియు అందుబాటులోని వాటిమద్య మారుతూ బాండ్ అగుటకు కారణకావచ్చు. దీనిని సాదారణంగా flapping అంటారు.

    దీనిని నిరోధించుటకు, ప్రామాణిక network-script లైనును /etc/xen/xend-config.sxpదీనినందు ఈక్రింది లైనుతో పునఃస్థాపించుము:

    (network-script network-bridge-bonding netdev=bond0)

    అలా చేయుటవలన netloop పరికరము అచేతనం చేయబడుతుంది, అది ఎడ్రస్ రెజొల్యూషన్ ప్రొటోకాల్ (ARP)ను చిరునామా బదిలీకరణ కార్యక్రమం వైఫల్యాన్ని పర్యవేక్షించుటను నిరోధిస్తుంది.

  • మల్టిపుల్ గెస్టు డోమైన్లను నడుపుతున్నప్పుడు, గెస్టు నెట్వర్కింగ్ తాత్కాలికంగా పనిచేయుట ఆగిపోవచ్చు, dom0 లాగ్‌లనందు నివేదించబడు ఈ క్రింది దోషమును యిస్తుంది:

    Memory squeeze in netback driver
    ఇది సరిదిద్దుటకు, dom0_mem హైపర్విజర్ కమాండ్ లైన్ ఐచ్చికంతో dom0కు అందుబాటులోవున్న మెమొరీ మొత్తమును పెంచుము.

5.3.2. x86 ఆకృతులు

  • పారావర్చ్యులైజ్‌డ్ అతిధేయాలను xm migrate [domain] [dom0 IP address] ద్వారా వలసపంపుట పనిచేయదు.

  • Red Htat Enterprise Linux 5ను పూర్తి వర్చ్యులైజ్‌డ్ SMP అతిధేయిపై సంస్థాపిస్తున్నప్పుడు, సంస్థాపన ఆగిపోవచ్చు. ఎప్పుడైతే అతిధేయ (dom0) Red Hat Enterprise Linux 5.2ను నడుపుతుందో అప్పుడ ఇది సంభవించవచ్చు.

    దీనిని నివారించుటకు, సంస్థాపన ఏక ప్రాసెసర్‌ను ఉపయోగించునట్లు అతిధేయిను అమర్చుము. మీరు దీనిని virt-insatll నందలి ఐచ్చికం --vcpus=1 ఉపయోగించుట ద్వారా చేయవచ్చు. ఒకసారి సంస్థాపన పూర్తైనతర్వాత, virt-manager నందు సమకూర్చిన vcpus ను సవరించుట ద్వారా అతిధేయిను SMP కు అమర్చవచ్చు.

5.3.3. x86_64 ఆకృతులు

  • పారావర్చ్యులైజ్‌డ్ అతిధేయాలను xm migrate [domain] [dom0 IP address] ద్వారా వలసపంపుట పనిచేయదు.

  • వర్చ్యువల్ లక్షణాన్ని సంస్థాపించటం HP కంప్యూటర్లలో మాదిరిసంఖ్య xw9300 మరియూ xw9400time went backwards హెచ్చరిక.

    xw9400 కంప్యూటర్లకోసం ఈ విషయంతో పనిచేయటానికి, BIOS అమర్పులను HPET టైమరును సాధ్యం చేయటానికి ఆకృతీకరించండి. ఈ ఐచ్ఛికం xw9300 కంప్యూటర్లలో అందుబాటులో ఉండదని గమనించండి.

  • Red Hat Enterprise Linux 3.9ను పూర్తిగా వర్చ్యువలైజ్ చేసిన అతిధేయాలలో సంస్థాపించుటవలన నిదానింపబడవచ్చు.అధనంగా, అతిధేయను సంస్థాపన తరువాత బూట్ చేయునప్పుడు hda: lost interrupt తప్పులకు కారణం కావచ్చు.

    ఈ బూటప్ తప్పును తప్పించటానికి,SMP కెర్నల్ ఆకృతీకరించండి.

  • అతిధేయి (dom0)సిస్టమ్‌ను Red Hat Enterprise Linux 5.2కు నవీకరించడం వలన Red Hat Enterprise Linux 4.5 SMP పారావర్త్యులైజ్డు అతిధేయీలు బూట్ అవ్వకపోవచ్చు.అతిధేయ సిస్టమ్ 4GB RAM కన్నా ఎక్కువైనప్పుడు ఇది జరుగవచ్చు.

    ఈ పనిచేయుటకు,ప్రతి Red Hat Enterprise Linux 4.5 అతిధేయిను సింగిల్ CPU రీతికి మరియు కెర్నల్ ను క్రొత్త విడుదల (Red Hat Enterprise Linux 4.5.z)కు నవీకరించండి.

5.3.4. ia64 ఆకృతి

  • పారావర్చ్యులైజ్‌డ్ అతిధేయాలను xm migrate [domain] [dom0 IP address] ద్వారా వలసపంపుట పనిచేయదు.

  • కోన్ని Itanium సిస్టమ్సు VGA కన్సోల్ ఉద్గాతాల కోరకు ఆకృతీకరించబడితే,dom0 వర్చ్యువల్ కెర్నల్ బూట్ అగుటకు విఫలంకావచ్చు.ఇది ఎందుకంటే వర్చ్యువల్ కెర్నల్Extensible Firmware Interface (EFI) అమరికలనుండి సరిగా కన్సోల్ పరికరంను గుర్తించలేకపోవడం.

    ఇది ఎదురైనప్పుడు, బూట్ పారామితి console=ttyను కెర్నల్ బూట్ ఐచ్చికాలకు /boot/efi/elilo.conf నందు జతచేయుము.

  • కొన్ని Itanium సిస్టమ్స్‍ (Hitachi Cold Fusion 3e వంటివి) పైన, EFI నిర్వహణా నిర్వాహికచేత VGA చేతనమైనప్పుడు dom0 నందు వరుసపోర్ట్‍ గర్తించబడలేదు. అందుకని, క్రింది వరుస పోర్ట్‍ సమాచారాన్ని dom0 కెర్నల్‌కు మీరు సరఫరాచేయవలసివుంటుంది.

    • బిట్స్‍/సెకను లో వేగము

    • డాటా బిట్స్‍ సంఖ్య

    • పారిటి

    • io_base చిరునామా

    dom0 కెర్నల్ యొక్క/boot/efi/elilo.conf నందలి append= వరుస నందు ఈ వివరాలు తప్పక తెలుపవలెను. ఉదాహరణకు:

    append="com1=19200,8n1,0x3f8 -- quiet rhgb console=tty0 console=ttyS0,19200n8"

    ఈ ఉదాహరణనందు, com1 అనునది వరుస పోర్ట్‍, 19200 అనునది వేగం (బిట్స్‍/సెంకండు లో), 8n1 డాటా బిట్స్‍/పారిటి యొక్క సంఖ్యను, మరియు 0x3f8 అనునది io_base చిరునామాను తెలుపుతాయి.

  • నాన్-యూనిపార్మ్‍ మెమొరీ యాక్సెస్ NUMAను ఉపయోగించే నిర్మాణాలనందు వర్చ్యులైజేషన్ పనిచేయదు. అందుకని, NUMA ఉపయోగించే సిస్టమ్స్‍‌పైన వర్చ్యులైజ్‌డ్ కెర్నల్‌ను సంస్థాపించుట బూట్‌వైఫల్యంకు కారణమౌతుంది.

    కొన్ని సంస్థాపక సంఖ్యలు వర్చ్యులైజ్డ్‍ కెర్నల్‌ను అప్రమేయంగా సంస్థాపిస్తుంది. మీరు అటువంటి సంస్థాపక సంఖ్యను కలిగిఉండి మరియు మీ సిస్టమ్ NUMA ఉపయోగిస్తుంటే మరియు kernel-xenతో పనిచేయకుంటే, సంస్థాపనా సమయమందు వర్చ్యులైజేషన్ ఎంపికతీసివేయుము.

  • ప్రస్తుతం, ఈ నిర్మాణంనందు పూర్తిగా వర్చ్యులైజ్‌డైన అతిధేయీల లైవ్ మైగ్రేషన్ మద్దతీయబడదు. అదనంగా, kexec మరియు kdump లు కూడా ఈ నిర్మాణంనందు వర్చ్యులైజేషన్‌కు మద్దతీయుటలేదు.

6. సాంకేతిక పరిదృశ్యాలు

సాంకేతిక పరిదృశ్యం లక్షణాలు ప్రస్తుతం Red Hat Enterprise Linux సబ్‌స్క్రిప్షన్ సేవలకింద మద్దతివ్వటం లేదు, క్రియాశీలంగా పూర్తిగాకాకపోవచ్చు, మరియూ సాధారణంగా ఉత్పత్తి వినియోగానికి ఉపయోగపడవు. ఏమైనప్పటికీ, ఈ లక్షణాలు వినియోగదారుని వెసులుబాటును కలిగివుంటాయి.

వినియోగదారుడు ఈ లక్షణాలను ఉత్పత్తి-రహిత వాతావరణానికి ఉపయోగించటానికి వాడవచ్చు. వినియోగదారుడు ఇది పూర్తిగా మద్దతివ్వటానికి ముందు ఫీడ్ బాక్ మరియూ సాంకేతిక పరిదృశ్యాల కోసం సూచనలను ఇవ్వవచ్చు.అధిక-సెవిరిటీ రక్షణ విషయాలకోసం Erratas సమకూర్చబడింది.

సాంకేతిక పరిదృశ్యాల అభివృద్ధిలో, అదనపు ఐచ్ఛికాలు ప్రజలకు పరిక్ష కోసం అందుబాటులో ఉంటాయి. ముందు వచ్చే చిన్న విడుదలలో సాంకేతిక పరిదృశ్యానికి పూర్తి మద్దతివ్వటం Red Hat యొక్క ఉద్దేశం.

EMC Clariion పై ALUA రీతి

EMC Clariion నిల్వపైన ఎక్స్‍‌ప్లిసిట్ ఏక్టివ్-పాసివ్ ఫైయిల్ఓవర్ (ALUA) రీతి dm-multipath ను ఉపయోగించుట ఇప్పుడు అందుబాటులోవుంది. ఈ రీతి T10 విశదీకరణలకు అనుగుణంగా అందించబడింది, అయితే ఈ విడుదలనందు సాకేతిక పరిదృశ్యంగా మాత్రమే ఇవ్వబడుతోంది.

T10 గురించి అధిక సమాచారం కొరకు, http://www.t10.org ను దర్శించండి.

ext4

ext ఫైలు సిస్టమ్ యొక్క సరికొత్త సంతతి(జెనరేషన్), ext4, ఈ విడుదలనందు సాంకేతిక పరిదృశ్యంగా అందుబాటులో వుంటుంది. Ext4 అనేది Red Hat మరియు లైనక్సు సమూహం అభివృద్దిపరచిన ext3 ఫైలు సిస్టమ్‌కు పురోభివృద్ది. సాంకేతిక పరిదృశ్యంకొరకు ఫైలు సిస్టమ్‌యొక్క విడుదలనామము ext4dev.

ఈ ఫైలు సిస్టమ్ ext4dev.ko కెర్నల్ మాడ్యూల్‌తో అందివ్వబడుతుంది, మరియు ext4తో వుపయోగించుటకు e2fsprogs నిర్వహణా సాధనముల నవీకరించిన వర్షన్లు కలిగివున్న, e4fsprogs ప్యాకేజీద్వారా అందివ్వబడుతుంది. ఉపయోగించుటకు, e4fsprogsను సంస్థాపించి తర్వాత e4fsprogs ప్రోగ్రామ్‌నుండి mkfs.ext4dev ఆదేశమును ext4-base ఫైలు సిస్టమ్ సృష్టించుటకు వుపయోగించుము. ఫైలుసిస్టమ్‌ను మౌంట్ కమాండ్‌లైను పైన లేదా fstab ఫైలునందు పరిశీలిస్తున్నప్పుడు, ఫైలుసిస్టమ్ నామము ext4devను వుపయోగించుము.

FreeIPMI

FreeIPMI ఇప్పుడు ఈ నవీకరణనందు సాంకేతిక పరిదృశ్యంగా జతచేయబడింది. FreeIPMI అనునది ఇంటిలిజంట్ ప్లాట్‌ఫాం మానెజ్‌మెంట్ IPMI సిస్టమ్ సాఫ్ట్‍‌వేర్ యొక్క సంపుటం. అభివృద్ది లైబ్రరీ తో ఇంటిలిజంట్ ప్లాట్‌ఫాం మెనేజ్‌మెంట్ ఇంటర్‌ఫేస్ (IPMI v1.5 మరియు v2.0) ప్రమాణాలకు నిర్ధారిస్తూ, ఇది ఇన్-బాండ్ మరియు అవుట్-ఆఫ్-బాండ్ సాఫ్ట్‍‌వేర్‌ను అదిస్తుంది.

FreeIPMI గురించి అధికసమాచారం కొరకు, http://www.gnu.org/software/freeipmi/ ను దర్శించండి.

TrouSerS మరియు tpm-tools

ట్రస్టెడ్ ప్లాట్‌ఫాం మాడ్యూల్ (TPM) హార్డ్‍‌వేర్ ను చేతనపర్చుటకు ఈ విడుదలనందుTrouSerS మరియు tpm-tools చేర్చబడినవి. TPM హార్డ్‍‌వేర్ సౌలబ్యాలు చేర్చబడినవి (ఇతరములతో కలిసి):

  • భద్రంగా RSA కీల యొక్క సృష్టీకరణ, నిల్వ మరియు ఉపయోగం (మెమొరీనందు చూపకుండా)

  • క్రిప్టోగ్రఫిక్ హాషెస్ ఉపయోగిస్తూ ఫ్లాట్‌ఫాం యొక్క సాఫ్టవేర్ స్థితి నిర్ధారణ

TrouSerS అనునది ట్రస్టెడ్ కంప్యూటింగ్ సమూహం యొక్క సాఫ్ట్‍‌వేర్ స్టాక్ (TSS) విశదీకరణ యొక్క సృష్టీకరణ. మీరు TrouSerS ను TPM హార్డ్‍‌వేర్ ఉపయోగాన్నిచ్చే అనువర్తనములకు వ్రాయుటకు ఉపయోగించవచ్చు. tpm-tools అనునది TPM హార్డ్‍‌వేర్‌ను వినియోగించుకోవటానికి మరియు నిర్వహించుటకు ఉపయోగపడే సాధనములయొక్క సమితి.

TrouSerS గురించిన అధికసమాచారం కొరకు, http://trousers.sourceforge.net/ ను దర్శించండి.

eCryptfs

eCryptfs అనునది లినక్స్‍ కొరకు స్టాక్‌డ్ క్రిప్టోగ్రఫిక్ దస్త్ర వ్యవస్థ. మౌంటైవున్న EXT3 వంటి దిగువ దస్త్ర వ్యవస్థల నందు ఇది విడివిడి సంచయములపై మౌంటౌతుంది; eCryptfsను ఉపయోగించుట ప్రారంభించుటకు ఉన్నవిభజనలను కాని లేదా దస్త్ర వ్యవస్థలనుకాని మార్చవలిసిన అవసరంలేదు.

ఈ విడుదలతో, eCryptfs అనునది వర్షన్ 56కు పునః-ప్రతిపాదించ బడింది, అది చాలా బగ్ పరిష్కారాలను మరియు విస్తరింపులను అందిస్తుంది. అదనముగా, ఈ నవీకరణ eCryptfs (ecryptfs-mount-helper-gui) ను ఆకృతీకరించుటకు గ్రాఫికల్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది.

ఈ నవీకరణ eCryptfs మౌంట్ ఐచ్చికాలయొక్క సిన్టాక్సును కూడా మార్చివేసింది. మీరు eCryptfs యొక్క ఈ వర్షన్‌ను నవీకరించుటకు యెంచుకొనినట్లైతే, మీరు ప్రభావితమైన ఏ మౌంట్ స్క్రిప్టునైనా నవీకరించాలి మరియు /etc/fstab ప్రవేశాలను నవీకరించాలి. ఈ మార్పుల గురించి సమాచారముకొరకు, man ecryptfs చూడండి.

ఈక్రింది జాగ్రత్తలు eCryptfsయొక్క ఈ విడుదలకు ఆపాదించబడతాయి.

  • అదేనామముతో వున్న డెరెక్టరీనందు ఎన్క్రిప్టెడ్ ఫైలు వ్యవస్థ వొకసారి మౌంట్ అయితే మాత్రమే eCryptfs ఫైలు వ్యవస్థ సరిగా పనిచేస్తుందని గమనించండి. ఉదాహరణకు:

    mount -t ecryptfs /mnt/secret /mnt/secret

    ఫైలు సిస్టమ్ యొక్క రక్షిత భాగము బయల్పరచకూడదు, అంటే అది యితర మౌంట్ పాయింట్లకు మౌంట్ కాకూడదు.

  • నెట్వర్కుచేసిన ఫైల్ సిస్టమ్సుపై (ఉ.దా. NFS,Samba) eCryptfs మౌంట్సు సరిగా పనిచేయవు.

  • eCryptfs కెర్నల్ డ్రైవర్ యొక్క ఈ వర్షన్‌కు నవీకరించిన యూజర్‌స్పేస్ కావాలి, అది ecryptfs-utils-56-4.el5 ద్వారా అందివ్వబడుతుంది.

eCryptfs కొరకు ఎక్కువ సమాచారం కొరకు, http://ecryptfs.sf.net చూడండి. మీరు ప్రాధమిక సమాచారము కొరకు http://ecryptfs.sourceforge.net/README మరియు http://ecryptfs.sourceforge.net/ecryptfs-faq.html కూడా చూడవచ్చు.

స్థితిలేని Linux

ఈ విడుదలతో సహా ఇవి నిర్మణాత్మక ఉపకరణలు. స్థితిలేని లైనక్సు కంప్యూటరు ఎలా పనిచేస్తోంది మరియూ ఎలా నిర్వహించబడుతోందో తెలుసుకోవడానికి దీనిని ఆపరేటింగ్ సిస్టమ్ రీడ్-ఓన్లీ పద్దతి లో ఉపయోగించటం ద్వారా(నవీకరణ విషయాలకు /etc/sysconfig/readonly-root నుచూడండి) పూర్తి చేయవచ్చు.

దాని ప్రస్తుత అభివృద్ధి స్థితిలో, స్థితిలేని లక్షణాలు ఉద్దేశ్య లక్ష్యాలలో ఉపభాగాలుగా ఉంటాయి. సామర్ధ్యం సాంకేతక పరిదృశ్యంగా గుర్తించబడుతుంది.

Red Hat స్టేట్‌లెస్ కొ‍డ్ పరీక్షించాలనుకొన్నవారిని ఎలాచేయాలో చదువుటకు ఇక్కడచూడమని సిఫార్స్‍‌చేస్తోంది http://fedoraproject.org/wiki/StatelessLinux/HOWTO మరియు [email protected] నందుచేరండి.

Stateless Linux కు చేతనమైన నిర్మాణాత్మక భాగాలను వాస్తవంగా Red Hat Enterprise Linux 5 నందు పరిచయంచేయబడింది.

AIGLX

AIGLX పూర్తిగా మద్దతిస్తున్న X సర్వరు కంటే సాంకేతికంగా పూర్తి పరిదృశ్యం కలది. దీని లక్ష్యం GL-ప్రభావాలను ప్రామాణిక డెస్క్‍టాప్ మీద సాధ్యం చేయటం. ఈ ప్రాజెక్టు ఈ కింది వాటిని కలిగి ఉంది.

  • కొద్దిగా సవరించిన X సేవిక.

  • కొత్త ప్రొటోకాల్ మద్దతును జతపరిచే నవీకరించిన Mesa సంకలనం.

ఈ మూలకాలను సంస్థాపించటం ద్వారా, మీరు GL-ప్రభావాలను మీడెస్క్‍టాప్ యందు కొద్దిమార్పులతో కలిగి ఉంటారు, మీరు దాన్ని సాధ్యం చేయటమన్నది X సర్వరును సాధ్యంచేయటం లేదా చేయకపోవటం మీద ఉంటుంది. AIGLX కూడా దూరస్థ GLX అనువర్తనాలను GLX హార్డువేరు త్వరితత్వానికి సహకరిస్తాయి.

iSCSI Target

Linux target (tgt) ఫ్రేమ్ వర్కు SCSI ప్రారంబిక గల వేరే సిస్టమ్సు లో బ్లాక్-లెవల్ SCSI నిల్వ సేవకు అనుమతిస్తుంది. ఈ సామర్ధ్యం ప్రప్రధమంగా Linux iSCSI టార్గెట్ గా ఉంచబడుతుంది,ఏ ప్రారంభికకైనా వలయంలో నిల్వను అందిచుటకు.

iSCSI టార్గెట్,కొరకుscsi-target-utils RPM సంస్థాపించి మరియు సూచనలను చూడండి:

  • /usr/share/doc/scsi-target-utils-[version]/README

  • /usr/share/doc/scsi-target-utils-[version]/README.iscsi

[version] ను సంస్థాపించిన సంకలనంకు చెందిన వర్షన్‌ను పునఃస్థాపించుము.

అధిక సమాచారానికి,man tgtadm చూడండి.

FireWire

firewire-sbp2 మాడ్యూల్ ఇంకా ఈ నవీకరణనందు సాంకేతిక పరిదృశ్యంగా చేర్చబడింది. ఈ మాడ్యూల్ అనుసంధానతను ఫైర్‌వైర్ నిల్వ సాధనాలు మరియు స్కానర్స్‍‌తో చేతన పర్చుతుంది.

ప్రస్తుతం,ఫైర్ వైర్ క్రింది వాటికి మద్దతునీయదు:

  • IPv4

  • pcilynx అతిధేయి నియంత్రికలు

  • బహుళ-LUN నిల్వ పరికరాలు

  • నిల్వ పరికరాల పై నాన్-ఎక్సుక్లూజివ్ అనుమతి

అధనంగా, ఈ క్రింది విషయాలు ఇంకా ఫైర్‌వైర్‌నందు వున్నాయి:

  • SBP2 డ్రైవర్ లో మెమొరీ లీక్ యంత్ర ప్రతిష్టంబనకు కారణం అవుతుంది.

  • ఈ విడుదలలోని కోడ్ big-endian యంత్రాలలో సరిగా పనిచేయడంలేదు.ఇది పవర్PC లో ఊహించని పరిణామానికి దారి తీయవచ్చు.

ktune

ఈ విడుదల ktuneను (ktune ప్యాకేజీనుండి) కలిగివుంటుంది, ఈ సేవ చాలా కెర్నల్ ట్యూనింగ్ పారామితులను ఫలనా సిస్టమ్ ప్రొఫైల్సుకు సరితూగు విలువలకు అమర్చుతుంది. ప్రస్తుతం, ktune డిస్కు-ఇన్టెన్సివ్ మరియు నెట్వర్కు-ఇన్టెన్సివ్ అనువర్తనములు నడిపే ఎక్కువ-మెమొరీ సిస్టమ్సు కొరకు మాత్రమే ప్రొఫైలును అందిస్తుంది.

ktune ద్వారా అందివ్వబడిన అమరికలు /etc/sysctl.confనందు అమర్చినవాటిని గాని లేదా కెర్నల్ కమాండ్‌లైను ద్వారా అమర్చినవాటిని గాని వోవర్‌రైడ్ చేయవు. కొన్ని సిస్టమ్సుపైన మరియు పనివత్తిడులనందు ktune సరిపోకపోవచ్చు. అందుచేత, మీరు దానిని వుత్పాదనకు డిప్లాయ్ చేయుటకుముందు క్షుణ్ణంగా పరీక్షించాలి.

మీరు ktune ద్వారా అమర్చబడిన ఏ ఆకృతీకరణనైనా అచేతనం చేయవచ్చు మరియు ktune సేవను service ktune stop (రూట్ గా) వుపయోగించి ఆపివేయుట ద్వారా మీ సాదారణ అమరికలకు తిరిగిరావచ్చు.

dmraid కొరకు SGPIO మద్దతు

సీరియల్ జెనరల్ పర్పస్ ఇన్‌పుట్ అవుట్‌పుట్ (SGPIO) అనునది మెయిన్ బోర్డు మరియు విభిన్న అంతర్గత మరియు బహిర్గత హార్డు డిస్కు డ్రైవ్ బే ఎన్‌క్లోజర్సు మద్య సంప్రదింపుల కొరకు వొక సంస్థాగత ప్రమాణము. AHCI డ్రైవర్ ఇంటర్‌ఫేస్ గుండా ఎన్‌క్లోజర్ పైన LED లైట్లను నియంత్రించుటకు ఈ పద్దతి వుపయోగపడుతుంది.

ఈ విడుదలలో, dmraid నందు SGPIO మద్దతు సాంకేతిక పరిదృశ్యంగా చేర్చబడింది. ఇది dmraidను డిస్కు ఎన్‌క్లోజర్సుతో సరిగా పనిచేయుటకు అనుమతిస్తుంది.

GCC 4.3

Gnu Compiler Collection version 4.3 (GCC4.3) యిప్పుడు ఈ విడుదలనందు సాంకేతిక పరిదృశ్యంగా విడుదలచేయబడింది. ఈ కంపైలర్సు సంపుటి(collection) C, C++, మరియు Fortran 95 కంపైలర్సును వాటి మద్దతు లైబ్రరీలతో కలిపి కలిగివుంటాయి.

gcc43 ప్యాకేజీలనందు, gnu89-inline ఐచ్చికము కొరకు అప్రమేయం-fgnu89-inlineకు మార్చబడింది, యిచట అప్‌స్ట్రీమ్ మరియు Red Hat Enterprise Linux 5యొక్క భవిష్య నవీకరణలు దీనికి -fno-gnu89-inline అప్రమేయం అవుతాయని గమనించండి. ఇది తప్పని సరి యెందుచేతనంటే ISO C99 సిమాన్టిక్సు బదులుగా GNU ఇన్-లైన్ సిమాన్టిక్సు తప్ప చాలావరకు పీఠికలు Red Hat Enterprise Linux 5 నందు భాగముగా మారిపోయినవి. యాట్రిబ్యూట్సు ద్వారా GNU ఇన్-లైన్ సిమాన్టిక్సును అభ్యర్దించుటకు ఈ పీఠికలు యింకా సర్దుబాటు కాలేదు.

Kernel Tracepoint Facility

ఈ నవీకరణనందు, ఒక కొత్త కెర్నల్ marker/tracepoint సదుపాయం సాంకేతిక పరిదృశ్యంగా అభివృద్ది పరచబడింది. ఈ ఇంటర్‌ఫేస్ స్టాటికి ప్రోబ్ పాయింట్లను కెర్నల్‌కు జతచేస్తుంది, SystemTap వంటి సాధనముల వుపయోగం కోసము.

Fibre Channel over Ethernet (FCoE)

Fibre Channel over Ethernet (FCoE) డ్రైవర్, libfcతో కూడి, FCoEను ప్రామాణిక ఈథర్నెట్ కార్డ్‍‌నందు నడిపే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ సామర్థ్యం Red Hat Enterprise Linux 5.3నందు సాంకేతిక పరిదృశ్యంగా మాత్రమే చేర్చబడింది.

Red Hat Enterprise Linux 5.3 అనునది FCoEకొరకు మూడు ప్రత్యేక హార్డువేరు అభివృద్దులనందు పూర్తిమద్దతును అందిస్తోంది. అవి: Cisco fnic డ్రైవర్, Emulex lpfc డ్రైవర్, మరియు Qlogic qla2xx డ్రైవర్.

RAID సమితుల(సెట్సు) యొక్క పరికర వైఫల్య పర్యవేక్షణ(డివైజ్ ఫెయిల్యూర్ మానిటరింగ్)

dmraid మరియు dmevent_tool సాధనములను వుపయోగిస్తూ, డివైజ్ ఫెయిల్యూర్ మానిటరింగ్, Red Hat Enterprise Linux 5.3నందు సాంకేతిక పరిదృశ్యంగా చేర్చబడింది.RAID సమితుల యొక్క మూలక పరికరాలపై పరికర వైఫల్యాలను నివేదించుటకు మరియు పర్యవేక్షించుటకు సమార్ద్యాన్ని అందిస్తుంది.

7. పరిష్కరించిన విషయాలు

7.1. అన్ని ఆకృతులు

  • TTY పరికరపు కార్యకలాపమునకు నివేదించిన డాటా సరిగా లేదు. ఆకారణంగా, sar -y ఆదేశం విఫలమైంది, దోషమును యిస్తోంది:

    అభ్యర్దించిన కార్యకలాపాలు ఫైలునందు అందుబాటులో లేవు

    ఈ నవీకరించిన ప్యాకేజీలో, sar సరిదిద్దబడింది అందువలన -y ఐచ్చికం TTY పరికరపు కార్యకలాపమును అవుట్‌పుట్‌గా యిస్తుంది.

  • గతంలో, max_fdsను unlimitedకు /etc/multipath.conf నందు అమర్చుట multipathd డెమోన్ ప్రారంభమగుటనుండి నిరోధిస్తుంది. సిస్టమ్ గరిష్టానికి చాలా వోపెన్ ఫైల్ డిస్క్రిప్టార్సు అమర్చవలసివస్తే, max_fdsను maxకు అమర్చాలి.

  • mod_perl యిప్పుడు వర్షన్ 2.0.4కు పునః-ప్రతిపాదించబడింది, సరికొత్త అప్‌స్ట్రీమ్ విడుదల. ఈ నవీకరణ చాలా నవీకరణలకు ఆపాదిస్తుంది, యిది సమస్య పరిష్కారాన్ని కలిగివుంది అది mod_perlను Bugzilla 3.0తో సరిగా పనిచేయుటకు అనుమతిస్తుంది.

  • cups యిప్పుడు వర్షన్ 1.3.7కు పునః-ప్రతిపాదించబడింది రీ-బేస్డ్‍). ఈ నవీకరణ చాలా బగ్ పరిష్కారాలకు మరియు విస్తరింపులను ఆపాదిస్తుంది:

    • కెర్బరోస్ దృవీకరణ యిప్పుడు మద్దతిస్తోంది

    • వినియోగదారి-నిర్వచిత ముద్రకం మరియు వుద్యోగ విధానాలు యిప్పుడు సరిగా లోడయ్యాయి.

    • అన్వేషణ అచేతనంగా వున్నప్పుడు దూరస్థ(రిమోట్) క్యూ క్యాచీలు యికపై లోడ్‌కావు.

    • classes.conf ఆకృతీకరణ ఫైలు యిప్పుడు ఫైలు పరిమితులను సరిదిద్దుతుంది.

  • lm_sensors వర్షన్ 2.10.7కు పునఃప్రతిపాదించబడినవి. ఈ నవీకరణ చాలా అప్‌స్ట్రీమ్ విస్తరింపులకు మరియు బగ్ పరిష్కారములకు ఆపాదించబడుతుంది, వొక పరిష్కారాన్ని కలిగివుంది, అది k8temp కూడా లోడైనప్పుడు libsensors General parse error దోషముతో క్రాష్ కాకుండా చూస్తుంది.

  • ఈ క్రింది బగ్స్‍‌ను పరిష్కరించుటకు elfutils ఈ విడుదలకు నవీకరించబడింది:

    • అటుంవటి ఇన్‌పుట్ ఫైళ్ళను చదువుచున్నప్పుడు eu-readelf సౌలభ్యము క్రాష్ కావచ్చు.

    • eu-strip సౌలభ్యము కొత్త బైనరీ ప్యాకేజీలను సృష్టించే rpmbuild పద్దతులనందు వుపయోగించబడింది. ఇది డీబగ్గింగ్ సమాచారమును యెగ్జిక్యూటబుల్ కోడ్‌నుండి వేరుచేస్తుంది, -debuginfo ప్యాకేజీలను చేయుటకు. ఈ సౌలభ్యమునందలి వొక బగ్ వుపయోగపడని డీబగ్గింగ్ సమాచారమును ET_REL ఫైళ్ళకు s390 ప్లాట్‌ఫాం పై యిచ్చుటకు కారణమైంది; యిది లైనక్సు కెర్నల్ మాడ్యూల్ ఫైళ్ళను (.ko.debug) ప్రభావితం చేస్తుంది, మరియు వుద్భవించిన kernel-debuginfo ప్యాకేజీలు s390 నందు సిస్టమ్‌టాప్‌తో పనిచేయకపోవటానికి కారణమౌతుంది.

  • vnc-server ఇప్పుడు వర్షన్ 4.1.2-14.el5కు పునః-ప్రతిపాదించబడింది రీ-బేస్డ్‍) ఈ నవీకరణ క్రింది పరిష్కారాలకు ఆపాదించబడుతుంది:

    • Xvnc ప్రారంభమవటానికి విఫలమైనప్పుడు vncserver దోష సందేశాన్ని ముద్రించుట నుండి నిరోధించిన బగ్ యిప్పుడు సరిదిద్దబడింది.

    • Xvnc తప్పైన root విండో లోతును యికపై వుపయోగించదు; యిప్పుడు అది -depth ఐచ్చికము ద్వారా తెలుపబడిన ఖచ్చితమైన విండో లోతును వుపయోగిస్తుంది.

    • libvnc.so మాడ్యూల్ X సేవిక క్రాష్‌కు కారణమయ్యే బగ్ యిప్పుడు పరిష్కరించబడింది.

    • అన్ని ఆకృతులపైనా Xvnc యిప్పుడు GLX మరియు RENDER పొడిగింపులను మద్దతిస్తోంది.

  • smartmontools వర్షన్ 5.38కు పునః-ప్రతిపాదించబడినవి. ఈ నవీకరణ హార్డువేరు పరికరములయొక్క స్వయంచాలకగుర్తింపును మెరుగుపరస్తుంది, CCISS RAID ఎరేస్ కొరకు మద్దతునిస్తుంది, మరియు మద్దతిచ్చు పరికరముల కొరకు పెద్ద డాటాబేస్‌ను అందిస్తుంది.

    SELinux smartmontoolsను 3ware RAID పరికరాలను పర్యవేక్షించుటనుండి నిరోధించే బగ్‌ను ఈ నవీకరణ సరిదిద్దినది. smartmontools యిప్పుడు అటువంటి పరికరములను సరిగా పర్యవేక్షించ గలదు.

  • python-urlgrabber యిప్పుడు వర్షన్ 3.1.0-5కు పునః-ప్రతిపాదించబడింది రీ-బేస్డ్‍). ఇది అప్‌స్ట్రీమ్‌నుండి చాలా బగ్ పరిష్కారాలకు అపాదించబడుతుంది:

    • పాక్షిక డౌన్‌లోడులను మద్దతీయని yum రిపోజిటరీనుండి yum యిప్పుడు సరిగా పునః-డౌనులోడులను చేయగలదు.

    • yum రిపోజిటరీ ప్రత్యేకమైన పోర్టుతో FTP-ఆధారితమైనది అయినాకూడా యిప్పుడు ఆటంకపరచబడిన డౌన్‌లోడును yum తిరిగి కొనసాగించ గలదు.

    • పురోగమన పట్టీ (ప్రోగ్రెస్ బార్) యొక్క పరిమాణము యిప్పుడు టెర్మినల్ వెడల్పును అనుసరించి గతికం(డైనమిక్). అదనముగా, యిప్పుడు పురోగమన పట్టీలు యింపైనవి, మరియు మొత్తం డౌనులోడు చేసిన డాటా శాతమును ప్రదర్శిస్తాయి.

    • python-urlgrabber యొక్క keepalive సంకేతం యిప్పుడు పరిష్కరించబడింది. గతంలో, ఈ సకేతమునందలి బగ్ డౌనులోడులనందు మెమొరీ వినియోగాన్ని తప్పుగా పెంచేసేది; అదనముగా, పెద్ద సంఖ్యలో ప్యాకేజీల డౌనులోడును జరుపుచున్నప్పుడు reposync మరియు yumdownloaderను వాటిని సరిగా జరుపుటనుండి ఈ బగ్ నిరోధిస్తుంది.

  • yum-utils యిప్పుడు అప్‌స్ట్రీమ్ వర్షన్ 1.1.16కు పునః-ప్రతిపాదించబడింది రీ-బేస్డ్‍). యిది చాలా బగ్ పరిష్కారములకు ఆపాదిస్తుంది:

    • గత సంభందిత రక్షణ నవీకరణలను yum update --security యిప్పుడు సరిగా గుర్తిస్తోంది.

    • yum-versionlock యిప్పుడు ప్యాకేజీ తొలగింపులపై సరిగా పనిచేస్తోంది.

    ఈ నవీకరణ yum-fastestmirror ప్లగ్‌యిన్‌ను కూడా కలిగివుంటుంది, ఇది yum మిర్రర్‌లిస్టులో త్వరితమైన రిపోజిటరీని యెంచుకొనునట్లు చేతనపరస్తుంది.

  • Samba అప్‌స్ట్రీమ్ వర్షన్ 3.2.0కు పునః-ప్రతిపాదించబడింది. ఇది చాలా బగ్‌లను పరిష్కరిస్తుంది, Windows 2003 వారి నామపు సేవికలా కలిగిన వినియోగదారులు డోమైన్సునందు జేరుటనుండి నిరోధించే బగ్‌ను కూడా పరిష్కరించింది. సిస్టమ్ సంకేతపదమును net rpc changetrustpw వుపయోగించి మార్చిన తర్వాత samba డొమైన్ సభ్యత్వం పాడవుటకు కారణమగు బగ్ పరిష్కరించబడింది.

    అప్‌స్ట్రీమ్ samba నవీకరణలయొక్క విస్తారమైన జాబితా ఈ విడుదలనందు చేర్చబడింది, http://www.samba.org/samba/history/samba-3.0.32.html చూడండి.

  • OpenLDAP యిప్పుడు అప్‌స్ట్రీమ్ వర్షన్ 2.3.43కు పునః-ప్రతిపాదించబడింది రీ-బేస్డ్‍). ఇది చాలా అప్‌స్ట్రీమ్ బగ్ పరిష్కారములకు ఆపాదిస్తుంది:

    • slapd డెమోన్ TLS దృవీకరణపత్రపు ఫైలును చదువలేకపోతే init స్క్రిప్టు హెచ్చరికను యిస్తుంది.

    • openldap-debuginfo ప్యాకేజీనందలి అన్ని లైబ్రరీలు యిప్పుడు తిరిగివుంచబడినాయి.

    • openldap-devel ప్యాకేజీను నిర్మూలించుటవలన యికపై OpenLDAP లైబ్రరీలు నిలువరింపబడవు.

    Red Hat యిప్పుడు OpenLDAP సేవికకొరకు అదనపు వోవర్‌లేలను పంపిణి చేస్తుంది. syncprovకాక, అన్ని వోవర్‌లేలు ప్రత్యేక openldap-servers-overlays ప్యాకేజీలనందు కనిపిస్తాయి, గతికంగా లోడుచేయదగిన మాడ్యూల్సువలె నిర్వర్తించబడతాయి. syncprov వోవర్‌లే స్థిరం(స్టాటికల్)గా సేవిక OpenLDAPకు లింకు చేయబడుతుంది. పాత OpenLDAP విడుదలలతో సారూప్యతను వుంచుటకు.

  • xterm బైనరీ అనునది అమర్చిన గ్రూప్ ID (setgid) bit ఆకృతీకరించి కలిగివుంది, కొన్ని యెన్విరాన్మెంటల్ వేరియబుల్సు(LD_LIBRARY_PATH మరియు TMPDIR వంటివి) అమర్చబడి లేవు. ఈ విడుదలనందు, xterm బైనరీ మో‍డ్ 0755 అనుమతులను ఆకృతీకరించబడి కలగివుంది, యిది ఈ సమస్యను పరిష్కరిస్తుంది.

  • ypbindతో బహుళ యంత్రములు అనుసంధానించబడివున్నప్పుడు NIS సేవికల భారమును సమతుల్యపరచుటకు సిఫార్సు చేయబడిన పద్దతి ఈ విడుదలతో మార్చబడింది. ypbind డెమోన్ల యొక్క ప్రవర్తన మార్చబడలేదు: అది యిప్పటికి /etc/ypbind ఆకృతీకరణ ఫైలునందు జాబితాచేయబడివున్న అన్ని NIS సేవికలను పింగ్ చేసి తర్వాత వొకే త్వరిత-స్పందిత సేవికకు బదనపరుస్తుంది. ముందుగా, ప్రతి మిషన్ నందలి /etc/ypbind.conf ఆకృతీకరణ ఫైలునందు అందుబాటులోవున్న NIS సేవికలను జాబితాచేయుట మంచిది. ఎంచేతంటే అధిక భారమునందు వున్న సేవికలు కూడా ఈ పింగ్‌కు త్వరితంగా స్పందిస్తాయి, వాటి భారాన్ని పెంచుటకు బదులుగా, తక్కువ సంఖ్యలో అందుబాటులోవున్న NIS సేవికలను జాబితాచేయమని నిర్వహణాదికారులకు సిఫార్సు చేయబడమైనది, యిది మిషన్సు మధ్య వేరువేరుగా వుండవచ్చు. ఈ విధంగా, ప్రతి NIS సేవిక జాబితా కాకపోవుటవలన ప్రతి మిషన్‌కు అందుబాటులో లేకపోవుటవలన స్వయంచాలకంగా NIS సేవికల భార-సమతుల్యత చేయబడుతుంది.

  • OpenMotif యిప్పుడు అప్‌స్ట్రీమ్ వర్షన్ 2.3.1కు పునః-ప్రతిపాదించబడింది రీ-బేస్డ్‍). ఇది చాలా బగ్ పరిష్కారములకు ఆపాదిస్తుంది:

    • OpenMotif అనునది Grab మరియు Ungrab ఘటనలను సంభాలించుటలోని బగ్ యిప్పుడు పరిష్కరించబడింది. గత విడుదలలనందు, ఈ బగ్ ప్రదర్శన లాక్‌కు కారణమయ్యేది.

    • nedit అనునది nedit గ్రాఫికల్ వినియోగదారి ఇంటర్‌ఫేస్‌ను వినియోగిస్తున్నప్పుడు అది క్రాష్ అగుటకు కారణమయ్యే బగ్ వుంది. కొన్ని సందర్భాలలో అంశమును ఎంపికచేస్తున్నప్పుడు సెగ్మెంటేషన్ లోపమునకు కారణమయ్యే కోడ్ నందలి ఫంక్షన్ వలన యిది జరుగుతుంది, యిది యిప్పుడు పరిష్కరించ బడింది.

  • dbus వర్షన్ 1.1.2కు పునః-ప్రతిపాదించబడింది. మల్టీ-త్రెడెడ్ ప్రోగ్రామ్సు dbus నందు డెడ్‌లాక్(జడత్వం, స్థంబన)కు కారణమయ్యే బగ్‌ను ఈ నవీకరణ పరిష్కరించింది. గత విడుదలలనందు, ఒక త్రెడ్ dbusను విని సందేశాలను కార్యనిర్వర్తనంచేసినట్లుగా, రెండవది సందేశాలను dbusకు పంపినట్లుగా.

  • strace వర్షన్ 4.5.18కు పునః-ప్రతిపాదించబడింది. ఇది చాలా బగ్‌లను పరిష్కరిస్తుంది:

    • strace అనునది -f ఐచ్చికాన్ని కొన్ని మల్టీ-త్రెడెడ్ ప్రోగ్రామ్సు (ప్రత్యేకించి 64-bit సిస్టమ్సుపైన) పైన వుపయోగించినప్పుడు క్రాష్ అగుటకు కారణమగు బగ్ పరిష్కరించబడింది.

    • 64-bit strace వర్షన్ vfork() ఫంక్షన్ కాల్‌ను 32-bit ప్రోసెస్ పైన నిర్వర్తించుటను నిరోధించే బగ్ యిప్పుడు పరిష్కరించబడింది.

  • cpuspeed అనునది వర్షన్ 1.2.1-5కు నవీకరించబడింది. ఈ నవీకరణతో, cpuspeed init స్క్రిప్టు యిప్పుడు speedstep-centrino మాడ్యూల్‌ను అన్ని యితర మాడ్యూల్ లోడ్సు విఫలమైతే లోడుచేస్తుంది. అదనముగా, Powernow-k8 మా‍డ్యూల్ లోడవ్వుటనుండి నిరోధించేవినియోగదారి-స్థానపు బగ్ యిప్పుడు పరిష్కరించబడింది.

  • frysk సాధనముల సూట్ ఈ పంపిణీనుండి పూర్తిగా తొలగించబడింది. frysk వాస్తవంగా సాంకేతక పరిదృశ్యంగా Red Hat Enterprise Linux 5.0నందు ప్రవేశపెట్టబడింది.

  • గతంలో, iostat -x ద్వారా అందివ్వబడిన I/O గణాంకాలు సంపూర్తివికావు. ఈ నవీకరణనందు, విభజన గణాంకాలు డిస్కు గణాంకాలు గణించు విధంగానే గణిస్తాము, పొందికైన మరియు విశదీకృతమైన I/O గణాంకాలను విభజన స్థాయివద్ద అందిస్తుంది.

  • Dovecot మెయిల్ సేవికకొరకు ఆకృతీకరణ ఫైలుతో సంకేతపదము బయల్పరుచు లోపము కనుగొనబడింది. సిస్టమ్ ssl_key_password ఐచ్చికము నిర్వచించి కలిగివుంటే, ఏదైనా స్థానిక వినియోగదారి SSL కీ సంకేతపదమును చూడగలిగేవారు. (CVE-2008-4870)

    Note

    ఈ లోపము దాడిచేయువానిని SSL కీయొక్క విషయసంగ్రములను పొందుటకు అనుమతించదు. సంకేతపదము కీ ఫైలు లేకుండా ఎటువంటి విలువను కలిగివుండదు దాని(కీ ఫైలు) ఆర్బిటరీ వినియోగదారులు చదువుకోను అనుమతి కలిగివుండకూడదు.

    ఈ విలువకు మంచి రక్షణకొరకు, dovecot.conf ఫైలు యిప్పుడు "!include_try" డైరెక్టివ్‌ను మద్దతిస్తుంది.ssl_key_password ఐచ్చికం తప్పక dovecot.conf నుండి root (0600)కు స్వంతంకాబడివున్న, మరియు దానిచేతమాత్రమే వ్రాయబడి చదువబడివున్న కొత్తఫైలుకు మార్చాలి. ఈ ఫైలు dovecot.confనుండి !include_try /path/to/password/file ఐచ్చికం అమర్చుట ద్వారా సంప్రదించబడాలి.

7.2. x86_64 ఆకృతులు

  • ksh అనునది వర్షన్ 2008-02-02కు పునః-ప్రతిపాదించబడింది. ఈ నవీకరణ మల్టీ-బైట్ కారెక్టర్ సంభాలనను జతచేస్తుంది, చాలా పని నియంత్రణ సమస్యలను గుర్తించింది మరియు చాలా బగ్ పరిష్కారములకు ఆపాదిస్తుంది. kshకు ఈ నవీకరణ వున్న స్క్రిప్ట్సుతో సారూప్యతను వుంచుతుంది.

7.3. s390x ఆకృతులు

  • vmconvert బగ్ దీనిని vmur పరికరం నోడ్‌ (/dev/0.0.000c) పైన సరిగా పనిచేయుటనుండి నిరోధిస్తుంది.vmur పరికరముపైని dumpsను యాక్సిస్ చేయుటకు vmconvert ఈ క్రింది దోషముతో విఫలమగుటకు యిది కారణమవుతుంది vmconvert: Open dump file failed! (Permission denied). s390utilsకు ఈ విడుదలనందలి వొక నవీకరణ ఈ సమస్యను సరిదిద్దుతుంది.

  • mon_procd డెమోన్ మరియు mon_fsstatd డెమోన్ కొరకు init స్క్రిప్టు మరియు config ఫైలు s390utils ప్యాకేజీనుండి తప్పిపోయినాయి. కాబట్టి ఈ డెమోన్సు నిర్మించి వుపయోగింప బడలేవు. తప్పిపోయిన ఫైళ్ళు ఈ నవీకరణనందు జతచేయబడినాయి అది సమస్యను పరిష్కరిస్తుంది.

7.4. PowerPC ఆకృతులు

  • ఈ ఆకృతినందు ehci_hcd మాడ్యూల్‌ను తిరిగిలోడగుటనుండి నిరోధించే బగ్ పరిష్కరించబడింది. Belkin 4-port PCI-Express USB Lily ఎడాప్టర్సు (మరియు యితర సరిపోలు పరికరాలు) ehci_hcd మాడ్యూల్ వుపయోగిస్తే యిప్పుడు Red Hat Enterprise Linux 5తో సరిగా పనిచేస్తాయని యిది చెప్తుంది.

  • libhugetlbfs లైబ్రరీ యిప్పుడు వర్షన్ 1.3కు పునః-ప్రతిపాదించబడింది. ఈ నవీకరణ లైబ్రరీకు చాలా అప్‌స్ట్రీమ్ మెరుగుదలలను ఆపాదిస్తుంది, అలా పెద్ద పేజీలను వుపయోగించే అనువర్తనములయొక్క పనితనం మెరుగుపరుస్తుంది.

    libhugetlbfsకు పూర్తి నవీకరణల జాబితా కొరకు, క్రింది లింకును చూడుము:

    http://sourceforge.net/mailarchive/message.php?msg_name=20080515170754.GA1830%40us.ibm.com

  • Red Hat Enterprise Linux 5.2 నందు, httpd 64-bit వర్షన్ ఈ ఆకృతినందు చేర్చబడింది వున్న 32-bit httpdకు అదనముగా. ఒకవేళ వినియోగదారి రెండు వర్షన్లను సంస్థాపించితే, httpd విభేధం వస్తుంది, httpd సరిగా పనిచేయుటనుండి నిరోధిస్తుంది.

    ఈ సమస్యను పరిష్కరించుటకు, httpd 64-bit వర్షన్ ఈ విడుదలనుండి తొలగించబడింది. httpdను ఈ విడుదలకు నవీకరించుట ద్వారా httpd 64-bit వర్షన్ స్వయంచాలకంగా తొలగించబడుతుంది.

8. తెలిసిన విషయాలు

8.1. అన్ని ఆకృతులు

  • root ఫైలు వ్యవస్థను ఎన్క్రిప్టు చేయుటకు కొత్త డిస్కు ఎన్క్రిప్షన్ సౌలభ్యాన్ని వుపయోగిస్తున్నప్పుడు, ఈ క్రింది దోష సందేశము సిస్టమ్ మూసివేస్తున్నప్పుడు తెరపై నివేదించబడుతుంది:

    డిస్కు ఎన్క్రిప్షన్‌ను ఆపివేస్తోంది [FAILED]

    ఈ సందేశము వదిలివేయుటవలన ప్రమాదము లేదు, మూసివేత కార్యక్రమము సమర్దవంతంగా పూర్తవుతుంది.

  • ఎన్క్రిప్టెడ్ పరికరాన్ని వుపయోగిస్తున్నప్పుడు, ఈ క్రింది దోష సందేశము బూటప్‌నందు నివేదించవచ్చు:

    insmod: error inserting '/lib/aes_generic.ko': -1 File exists
    ఈ సందేశమును నిర్భయంగా వదిలివేయవచ్చు.

  • మల్టీపాత్ పైన మల్టిపుల్ డివైజ్ (MD) RAIDను వుపయోగించు సంస్థాపన బూట్ కాలేని మిషన్‌కు కారణమౌతుంది. RAIDను అంతర్గతంగా అందించు స్టోరేజ్ ఏరియా నెట్వర్కు (SAN) పరికరాలు మల్టీపాత్‌కు ప్రభావితంకావు.

  • పెద్దసంఖ్యలో LUNలు నోడ్‌కు జతపరిచినప్పుడు, వాటికొరకు పరికరపు నోడ్సును సృష్టించుటకు udev కొరకు మల్టీపాత్ తీసుకొనే సమయం బాగాపెరుగుతుంది. మీకు ఈ సమస్యవస్తే దానిని మీరు క్రిందిలైనును /etc/udev/rules.d/40-multipath.rules నందు తొలగించుట ద్వారా సరిదిద్దవచ్చు:

    KERNEL!="dm-[0-9]*", ACTION=="add", PROGRAM=="/bin/bash -c '/sbin/lsmod | /bin/grep ^dm_multipath'", RUN+="/sbin/multipath -v0 %M:%m"
    ప్రతి సారి బ్లాక్ పరికరము నోడ్‌కు జతపరచగానే udev మల్టీపాత్‌ను నడుపుటకు ఈ లైను కారణం.ఈ లైను తొలగించిననూ, multipathd స్వయంచాలకంగా మల్టీపాత్ పరికరములను సృష్టిస్తుంది, multipathd root ఫైల్‌సిస్టమ్స్‍‌తో వున్న నోడ్స్‍ కొరకు, బూట్ ప్రోసెస్‌నందు మల్టీపాత్ పిలువబడుతూనే వుంటుంది. multipathd నడుస్తూ లేనప్పుడు మల్టీపాత్ పరికరములు స్వయంచాలకంగా సృష్టించబడవు, యిది చాలామంది మల్టీపాత్ వినియోగదారులకు సమస్య కాదు.

  • Red Hat Enterprise Linux to 5.3 ముందలి వర్షన్‌నుండి నవీకరిస్తున్నప్పుడు, మీరు ఈక్రింది దోషమును యెదుర్కొనవచ్చు:

    Updating  : mypackage                 ################### [ 472/1655]
    rpmdb: unable to lock mutex: Invalid argument

    లాకింగ్ సమస్యకు కారణం glibcనందలి భాగస్వామ్య futex లాకింగ్ 5.2 మరియు 5.3 మద్యన per-process futexesతో విస్తరించబడింది. అందుచేత, 5.2 glibcకు నడుస్తున్న ప్రోగ్రామ్సు 5.3 glibcకు నడుస్తున్న ప్రోగ్రామ్సుతో భాగస్వామ్య futex లాకింగ్‌ను సరిగా జరుపలేదు.

    ప్యాకేజీ దాని సంస్థాపనా స్క్రిప్టులో భాగంగా rpmను పిలువుట ఈ దోష సందేశమునకు కారణం. నవీకరణను జరుపు rpm యిన్‌స్టాన్సు నవీకరణ మొత్తంలో గత glibcను వుపయోగిస్తుంది, అయితే స్క్రిప్టునుండి దించబడిన rpm యిన్‌స్టాన్సు కొత్త glibcను వుపయోగిస్తుంది.

    ఈ దోషమును తప్పించుటకు, glibcను మొదట ప్రత్యేక runనందు నవీకరించుము:

    # yum update glibc
    # yum update
    మీరు సంస్థాపించిన 5.3 సిస్టమ్ కన్నా పాత glibc వర్షన్‌కు మార్చితే కూడా మీరు ఈ దోషమును చూస్తారు.

  • mvapich మరియు mvapich2 అనునవి Red Hat Enterprise Linux 5 నందు InfiniBand/iWARP అంతర్గతసంధానాలను మద్దతిచ్చుటకు నిర్వర్తించబడినవి. కాబట్టి, అవి ఈథర్నెట్ నందుకాని లేదా యితర నెట్వర్కు అంతర్గతసంధానాల పైగాని నడువవు.

  • రెండుకన్నా యెక్కువ ఎన్క్రిప్టెడ్ బ్లాక్ పరికరములు కలిగివున్న సిస్టమ్సు పైన, సార్వత్రిక సంకేతపదమును అందించుటకు anaconda ఐచ్చికాన్ని కలిగివుంది. init స్క్రిప్ట్సు, ఈ సౌలభ్యాన్ని మద్దతించవు. సిస్టమ్‌ను బూట్‌చేస్తున్నప్పుడు, అన్ని ఎన్క్రిప్టెడ్ పరికరములకు స్వతంత్ర సంకేతపదమును యివ్వవలసి వుంటుంది.

  • openmpiను yum వుపయోగించి నవీకరిస్తున్నప్పుడు, ఈ క్రింది హెచ్చరిక యివ్వబడవచ్చు:

    cannot open `/tmp/openmpi-upgrade-version.*' for reading: No such file or directory
    ఈ సందేశము హానికలిగించనిది యిబ్బందిలేదు వదిలివేయవచ్చు.

  • MSI per-vector మాస్కింగ్ సామర్ధ్యము లేకుండా మెసేజ్ సిగ్నల్డ్‍ యింటరప్ట్స్‍ (MSI)ను వుపయోగించే కొన్ని పరికరములపై IRQ SMP ఎఫినిటి ఆకృతీకరణ యెటువంటి ప్రభావం చూపదు. అటువంటి పరికరములకు వుదాహరణ bnx2 డ్రైవర్ వుపయోగించే Broadcom NetXtreme ఈథర్నెట్ పరికరాలు.

    మీరు అటువంటి పరికరము కొరకు IRQ ఎఫినిటీని ఆకృతీకరించవలసి వుంటే, ఈ క్రింది లైనును కలిగివున్న ఫైలును /etc/modprobe.d/ నందు సృష్టించుచూ MSI అచేతనము చేయుము:

    options bnx2 disable_msi=1

    ప్రత్యామ్నాయంగా, మీరు కెర్నల్ బూట్ పారామితి pci=nomsiను వుపయోగించి MSIను మీరు పూర్తిగా అచేతనంచేయవచ్చు.

  • Dell PowerEdge R905 సేవికలనందలి CD-ROM/DVD-ROM విభాగము Red Hat Enterprise Linux 5తో పనిచేయదు. దయచేసి Knowledgebase #13121ను అధిక వివరముల కొరకు చూడండి: http://kbase.redhat.com/faq/FAQ_103_13121.

    Important

    పైనతెలుపబడిన Knowledgebase సంచికనందు తెలుపబడిన విధానము యితర సమస్యలకు కారణం కావచ్చు అది GSSచేత మద్దతివ్వబడలేదు.

  • టేప్ పరికరాలకొరకు సృష్టించే నామాలలో 9 కన్నా పెద్దసంఖ్యకలిగివుంటే వాటిని నవీకరించిన /etc/udev/rules.d/50-udev.rules దస్త్రమునందలి బగ్ నిరోధిస్తోంది. ఉదాహరణకు, ఒక నామము టేప్ పరికరం కొరకు nst12 గా సృష్టించబడిలేదు.

    ఇది చేయుటకు, /etc/udev/rules.d/50-udev.rules నందు స్ట్రింగ్ nst[0-9] యొక్క ప్రతిసంభవం తర్వాత ఒక యాస్ట్రిక్ (*) ను జతచేయండి.

  • smartctl సాధనం SATA పరికరాలనుండి SMART పారామితులను చదువలేదు.

  • openmpi మరియు lam యొక్క పాత వర్షన్స్‍‌నందలి బగ్ మిమ్ములను ఈ సంకలనాలను నవీకరించుటనుండి నిరోధించవచ్చు. ఈ బగ్ ఈ క్రింది దోషమునందు ప్రకటించబడివుంది (openmpi లేదా lam నవీకరించుటకు ప్రయత్నిస్తున్నప్పుడు:

    దోషము: %preun(openmpi-[version]) స్క్రిప్ట్‍‌లెట్ విఫలమైంది, నిష్క్రమణ స్థితి 2

    అందుకని, openmpi మరియు lam యొక్క క్రొత్త వర్షన్స్‍‌ను సంస్థాపించుటకు మీరు వాటి పాత వర్షన్స్‍‌ను మానవీయంగా తీసివేయవలసివుంటుంది. అలాచేయుటకు, క్రింది rpm ఆదేశాన్ని ఉపయోగించండి:

    rpm -qa | grep '^openmpi-\|^lam-' | xargs rpm -e --noscripts --allmatches

  • dm-multipath మల్టీపాత్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, features "1 queue_if_no_path" అనునది /etc/multipath.conf నందు తెలుపబడితే I/O ఇచ్చే ఏ ప్రోసెస్ అయినా ఒకటి లేదా ఎక్కువ పాత్‌లు తిరిగివుంచబడేంతవరకు స్థంబిస్తుంది.

    దీనిని తప్పించుటకు, /etc/multipath.conf నందు no_path_retry [N] అమర్చుము (ఇచట no_path_retry [N] అనునది సిస్టమ్ పాత్‌కొరకు పునఃప్రయత్నించవలిసిన పర్యాయాల సంఖ్య). మీరు ఇది చేస్తున్నప్పుడు, /etc/multipath.conf నుండి features "1 queue_if_no_path" ఐచ్చికాన్ని తీసివేయండి.

    మీరు "1 queue_if_no_path" వుపయోగించవలసి వచ్చి మరియు యిక్కడ సూచించిన సమస్యను యెదుర్కొంటే, ఫలానా LUN (దేనికొరకైతే అన్ని పాత్‌లు అందుబాటులో లేవో) దానికొరకు రన్‌టైమ్ వద్ద విధానాన్ని సరికూర్చుటకు dmsetup వుపయోగించండి.

    విశదపర్చుటకు: dmsetup message [device] 0 "fail_if_no_path" నడుపుము, యిచట [device] అంటే మల్టీపాత్ పరికర నామము (ఉ.దా. mpath2; పాత్‌ను తెలుపదు) దేనికొరకైతే మీరు విధానాన్ని "queue_if_no_path" నుండి "fail_if_no_path"కు మార్చాలని అనుకొనుచున్నారో.

  • ఒకే కెర్నల్ మాడ్యూల్ యొక్క బహుళ సంస్థాపక వర్షన్స్‍‌ను చేతనపర్చుట మద్దతివ్వుటలేదు. దీనికి అధనంగా, కెర్నల్ మాడ్యూల్ వర్షన్స్‍‌ పార్స్‍ నందలి బగ్ కొన్నిసమయాల్లో అదే కెర్నల్ మాడ్యూల్‌కు చెందిన పాతవర్షన్‌ను చేతనంచేస్తోంది.

    మీరు సంస్థాపించిన కెర్నల్ మాడ్యూల్‌కు కొత్త వర్షన్‌ను ఎప్పుడు సంస్థాపిస్తున్నా, మీరు ముందు పాతదానిని తొలిగించుట మంచిదని Red Hat సిఫార్స్‍ చేస్తోంది.

  • NFS రూట్‌తో ఆకృతీకరించబడిన IBM Bladecenter QS21 లేదా QS22 పైన kdumpను నిర్వర్తించుట విఫలమౌతుంది. దీనిని తప్పించుటకు, NFS డంప్ లక్ష్యాన్ని /etc/kdump.conf నందు తెలుపుము.

  • సస్పెండ్‌చేసి మరియు డాక్‌స్టేషన్‌కు వుంచినప్పుడు IBM T60 లాప్‌టాప్స్‍ పూర్తిగా పవర్ఆఫ్ అవుతాయి. దీనిని తప్పించుటకు, సిస్టమ్‌ను ఆర్గుమెంట్ acpi_sleep=s3_bios తో బూట్‌చేయండి.

  • IBM Bladecenter కు QLogic iSCSI Expansion Card ఈథర్నెట్ మరియు iSCSI రెండు కార్యక్రమాలను ఇస్తుంది. కొన్ని విభాగాలు కార్డుపై రెండు కార్యక్రమాలచేత పంచుకొనబడతాయి. ఎమైనప్పటికి, ప్రస్తుత qla3xxx మరియు qla4xxx డ్రైవైర్స్‍ ఈథర్నెట్ మరియు iSCSI కార్యక్రమాలను స్వతంత్రంగా మద్దతునిస్తాయి. రెండు డ్రైవర్స్‍ ఈథర్నెట్ మరియు iSCSI కార్యక్రమాలను ఏకకాలమందు ఉపయోగించుటకు మద్దతీయవు.

    ఈ పరిమితికారణంగా, వరుస పునఃప్రారంభాలు ( ఒకటితర్వాతఒకటిగా ifdown/ifup ఆదేశాల ద్వారా) పరికరాన్ని స్థంబింపచేయవచ్చు. దీనిని తప్పించుటకు, ifdown ఇవ్వుటకుముందు ifup తర్వాత 10-సెకన్ల విరామాన్ని అనుమతించుము. ఇంకా, 10-సెకన్ల విరామాన్ని ifdown ifup మద్యనకూడా అనుమతించండి. ఈ విరామం ifup విడుదలైనప్పుడు అన్ని క్రియలు పునఃప్రాప్తికావటానికి మరియు యాంపిల్ సమయం స్థిరమగుటకు అనుమతిస్తుంది.

  • Cisco Aironet MPI-350 వైర్లెస్ కార్డులున్న లాప్టాప్లు DHCP చిరునామాలను వైర్డు ఈథర్నెట్ పోర్టు ఉపయోగించి చేసే నెట్వర్కు ఆధారిత సంస్థాపనలో స్థంబించవచ్చు.

    దీనితో పనిచేసేటప్పుడు, మీ సంస్థాపనకు స్థానిక మాధ్యమాన్ని ఉపయోగించండి. ప్రత్యామ్నాయంగా, మీరు లాప్ టాప్ BIOS priorలో సంస్థాపనకు వైర్లెస్ కార్డును సాధ్యం చేయవచ్చు (సంస్థాపన పూర్తయ్యినతరువాత మీరు తిరిగి కార్డును సాధ్యం చేయగలుగుతారు).

  • Red Hat Enterprise Linux 5.3 నందు /var/log/boot.logకు బూట్‌-టైమ్ లాగింగ్ అందుబాటులో లేదు.

  • ఈ కంప్యూటరు kexec/kdump కెర్నలులోకి విజయవంతంగా పునఃప్రారంభించబడదు X కనుక vesa కంటే వేరైనదాన్ని ఉపయోగిస్తున్నా లేదా నడుస్తున్నా. ఈ సమస్య ATI Rage XL గ్రాఫికల్ చిప్ సెట్టుతో కూడిఉంది.

    X ATI Rage XLతో కంప్యూటరు ఎక్యూప్డుతో నడుస్తుంటే, అది vesa డ్రైవరును kexec/kdump కెర్నలులోకి విజయవంతంగా రీబూటు చేయటానికి ఉపయోగిస్తుంది.

  • Red Hat Enterprise Linux 5.2 ను nVidia CK804 చిప్‌సెట్ సంస్థాపించిన మిషన్‌నందు ఉపయోగిస్తున్నప్పుడు, క్రింది కెర్నల్ సందేశం కనిపించవచ్చు:

    kernel: assign_interrupt_mode Found MSI capability
    kernel: pcie_portdrv_probe->Dev[005d:10de] has invalid IRQ. Check vendor BIOS

    ఈ సందేశాలు కొన్ని PCI-E పోర్ట్సు IRQలను అభ్యర్దించుట లేదని సూచిస్తాయి. ఏమైనప్పటికి, అవి, ఏవిధంగాను మిషన్‌యొక్క కార్యక్రమాన్ని ప్రభావితంచేయవు.

  • మూలంగా ప్రవేశించినప్పుడు తీసివేయు నిల్వ పరికరాలు(CDs మరియుDVDs) స్వయంచాలకంగా మౌంట్ అవ్వవు.అప్పుడు గ్రాఫికల్ ఫైల్ మేనేజర్ ద్వారా మానవీయంగా పరికరాన్ని మౌంట్ చేయవలె.

    ప్రత్యామ్నయంగా మీరు ఈ క్రింది ఆదేశాన్ని పరికరం మౌంట్ అవ్వటానికి వాడవచ్చు /media:

    mount /dev/[device name] /media
  • ఆకృతీకరించిన నిల్వ సిస్టమ్‌నందు LUN తొలగించినప్పుడు, ఆమార్పు అతిధేయపై ప్రతిబింబించదు. అటువంటి సందర్భాలలో, dm-multipath ఉపయోగిస్తున్నప్పుడుlvm ఆదేశాలు చెప్పలేనట్లుగా స్థంబించవచ్చు, ఇప్పుడు LUN stale అవుతోంది కనుక.

    దీనికోసం,అన్ని పరికరాల మరియు mpath లింకు ప్రవేశాలు/etc/lvm/.cache లో ప్రత్యేకంగా స్టేట్ LUN తోలగించాలి.

    ఈ ప్రవేశాలు ఏమిటో కనిపెట్టటానికి క్రింది ఆదేశాన్ని ఉపయోగించు:

    ls -l /dev/mpath | grep [stale LUN]

    ఉదాహరణకు, [stale LUN] అనునది3600d0230003414f30000203a7bc41a00 అయితే, క్రింది ఫలితాలు కనిపించవచ్చు:

    lrwxrwxrwx 1 root root 7 Aug  2 10:33 /3600d0230003414f30000203a7bc41a00 -> ../dm-4
    lrwxrwxrwx 1 root root 7 Aug  2 10:33 /3600d0230003414f30000203a7bc41a00p1 -> ../dm-5

    దీని అర్ధం 3600d0230003414f30000203a7bc41a00 ఇప్పుడు mpath links: dm-4 మరియు dm-5 రెంటికి మేప్ చేయబడుతుంది.

    ఈ క్రింది పంక్తులు /etc/lvm/.cache: నుండి తొలగించాలి:

    /dev/dm-4 
    /dev/dm-5 
    /dev/mapper/3600d0230003414f30000203a7bc41a00
    /dev/mapper/3600d0230003414f30000203a7bc41a00p1
    /dev/mpath/3600d0230003414f30000203a7bc41a00
    /dev/mpath/3600d0230003414f30000203a7bc41a00p1
  • పాత్‌లలో ఒకటి బ్లాకింగ్ పరికరంపైవుంటే multipath ఆదేశాన్ని -ll ఐచ్చికంతో నడుపుట ఆదేశం స్థంబించటానికి కారణమౌతుంది. పరికరం స్పందిచకపోతే కొంతసమయం తర్వాత డ్రైవర్ విఫలంకాదని గమనించండి.

    ఇది క్లీన్అప్ కోడ్‌ద్వారా కారణమౌతోంది, ఏదైతే పాత్ చెకర్ అభ్యర్ధన పూర్తగునంతవరకు కాని లేదా విఫలమగునంతవరకు కాని ఆగుతుందో. ప్రస్తుత multipath స్థితిని ఆదేశం స్ధంబించకుండా ప్రదర్శించుటకు, బదులుగా multipath -l ఉపయోగించండి.

  • pm-utilsను pm-utils యొక్క Red Hat Enterprise Linux 5.2 బీటా వర్షన్‌నుండి నవీకరించుట విఫలంమౌతుంది, ఈ క్రింది దోషము వస్తుంది:

    దోషం: ఆర్చివ్‌ను అన్‌ప్యాక్ చేయుటలో దస్త్రం /etc/pm/sleep.d: cpio: rename పై విఫలమైంది

    ఇది సంభవించకుండా నిరోధించుటకు, /etc/pm/sleep.d/ సంచయంను నవీకరించుటకు ముందే తొలగించండి. /etc/pm/sleep.d ఏవైనా దస్త్రాలను కలిగిఉంటే, ఆ దస్త్రాలను /etc/pm/hooks/ కు కదపండి.

  • Mellanox MT25204 కొరకు హార్డువేర్ పరిశీలన కొన్ని ఎక్కువ-భారం పరిస్థితులలో అంతర్గత దోషం ఎదురౌతుందని బయల్పరిచింది. ఎప్పుడైతే ib_mthca డ్రైవర్ ఈ హార్డువేరు పైన విపత్తు దోషంను నివేదించినదో, సాదారణంగా అది వినియోగదారుని అనువర్తనంచేత ఉద్భవించిన మిగిలివున్న పని అభ్యర్ధనల యొక్క సంఖ్యకు సారూప్యంగా సరిగా ముగింపని క్యూ లోతుకు చెందుతుంది.

    ఆ డ్రైవర్ హార్డ్‍‌వేర్‌ను తిరిగివుంచినప్పుటికి మరియు అటువంటి ఘటననుండి పునఃప్రాప్తి పొందినప్పుటికి, దోషసమయంనందు ఉన్న అన్ని అనుసంధానములు పోతాయి. ఇది సాధారణంగా వినియోగదారి అనువర్తనం నందు సెగ్మెంటేషన్ వైఫల్యంగా వస్తుంది. ఇంకా, opensm దోషము సంభవించిన సమయంనందు నడుస్తుంటే, అప్పుడు సరైన కార్యక్రమమును తిరిగికొనసాగించుటకు మీరు మానవీయంగా దానిని పునఃప్రారంభించవలసి ఉంటుంది.

  • Red Hat Enterprise Linux 5ను గెస్టుపై సంస్థాపించుచున్నప్పుడు, ఆ గెస్టు dom0 ద్వారా అందివ్వబడిన తాత్కాలిక సంస్థాపనా కెర్నల్ బహిర్గతముగా వుపయోగించుటకు ఆకృతీకరించబడి వుంటుంది. ఒకసారి సంస్థాపన పూర్తైనతర్వాత, అది దాని స్వంత బూట్‌లోడర్‌ను వుపయోగించగలదు. ఏమైనప్పటికి, యిది గెస్టుయొక్క మొదటి పునఃప్రారంభాన్ని బలవంతంగా మూసివేతకు గురిచేయుట ద్వారా సాధించబడుతుంది.

    అందుకని, గెస్టుయొక్క సంస్థాపన ముగింపునందు Reboot బటన్ కనిపించగనే, దానిని నొక్కుటవలన అది గెస్టును మూసివేస్తుంది, పునఃప్రారంభించదు. అది అనుకున్నట్లే ప్రవర్తించినది.

    దీని తర్వాత మీరు గెస్టును యెప్పుడు బూట్ చేసినా అది దాని స్వంత బూట్‌లోడర్‌ను వుపయోగిస్తుందని గమనించండి.

  • KDE లేదా qt అభివృద్దీకరణ ప్యాకేజీలు (ఉదాహరణకు, qt-devel) సంస్థాపించివుంటే compiz మూలపు RPMపైన rpmbuildను నడుపుట విఫలమౌతుంది. ఇది compiz ఆకృతీకరణ స్క్రిప్టునందలి బగ్‌వలన సంభవిస్తుంది.

    దీని కొరకు, compiz ప్యాకేజీను దాని మూలపు RPMనుండి నిర్మించుటకు ప్రయత్నించుటకు ముందుగా ఏదేని KDE లేదా qt అభివృద్ది ప్యాకేజీలను తీసివేయుము.

  • మీ సిస్టమ్ ATI Radeon R500 లేదా R600 గ్రాఫిక్స్‍ కార్డ్‍‌ను కలిగివుంటే, firstboot సంస్థాపన తర్వాత నడువదు. సిస్టమ్ నేరుగా గ్రాఫికల్ లాగిన్‌కు వెళుతుంది మరియు firstboot మొత్తాన్ని వదిలివేస్తుంది. మీరు firstboot మానవీయంగా (అంటే failsafe టెర్మినల్ నుండి), నడపాలని ప్రయత్నిస్తే X సెషన్ క్రాష్ అవుతుంది.

    ఈ సమస్య ATI Radeon R500/R600 హార్డువేరు ద్వారా వుపయోగించు డ్రైవర్ వలన వచ్చింది. ఈ గ్రాఫిక్స్‍ కార్డ్స్‍ ద్వారా వుపయోగించబడు అప్రమేయ డ్రైవర్ యింకా సాంకేతిక పరిదృశ్యంలోనే వుంది. దీనికొరకు, మీ /etc/X11/xorg.conf ఫైలును బ్యాకప్ తీసుకొనుము; మద్దతిచ్చు vesa డ్రైవర్‌ను ఆకృతీకరించుటకు ఈ క్రింది ఆదేశమును వుపయోగించుము:

    system-config-display --reconfig --set-driver=vesa

    మీరు యిప్పుడు firstbootను నడుపవచ్చు. మీ పాత అమర్పులకు తిరిగి వెళ్ళుటకు, మీ వాస్తవ /etc/X11/xorg.confను తిరిగివుంచండి.

  • మీ సిస్టమ్ TSC టైమర్‌ను వుపయోగిస్తుంటే, gettimeofday సిస్టమ్ కాల్ వెనుకకు కదలవచ్చు.ఇది యెందుచేతనంటే కొన్ని సందర్భాలలో వోవర్‌ఫ్లో సమస్య వలన TSC టైమర్ ముందుకు దూకవలసివస్తుంది, యిది సంభవించినప్పుడు, TSC టైమర్ దానంతటదే సరిదిద్ద బడుతుంది, అయితే వెనుకకు వొక కదలికను సమయమునందు నమోదుచేస్తుంది.

    ఈ సమస్య ప్రత్యేకించి సమయ-సున్నతత్వ(టైమ్-సెన్సిటివ్) సిస్టమ్సుకు క్లిష్టమైనది, ఏవైతే బదిలీకరణ సిస్టమ్సుగా మరియు డాటాబేసులుగా వుపయోగించబడతాయో. అందుచేత, మీ సిస్టమ్ ప్రెసిషన్ సమయాన్ని అవసరపడినట్లైతే, కెర్నల్ వేరొక టైమర్ (ఉదాహరణకు, HPET)ను వుపయోగించునట్లు అమర్చమని Red Hat మిమ్ములను గట్టిగా సిఫార్సు చేస్తోంది.

  • sniff ను నడుపుటకు ప్రయత్నించుట దోషమును ఇవ్వవచ్చు. ఇది ఎంచేతంటే కొన్ని అవసరమైన సంకలనాలు dogtail తో సంస్థాపించలేదు.

    ఇది సంభవించకుండా వుంచుటకు, క్రింది సంకలనాలను మానవీయంగా సంస్థాపించండి:

    • librsvg2

    • ghostscript-fonts

    • pygtk2-libglade

  • Thin Provisioning ("virtual provisioningగా కూడా తెలిసిన") మొదట EMC Symmetrix DMX3 మరియు DMX4తో విడుదల అవుతుంది. దయచేసి EMC Support Matrix మరియు Symmetrix Enginuity కొడ్ విడుదలనోడ్సును యితరవివరముల కొరకు చూడండి.

  • /etc/multipath.conf నందు, max_fdsను unlimitedకు అమర్చుట అనునది multipathd డెమోన్ సరిగా ప్రారంభమవుటనుండి నిరోధిస్తుంది. అందుకని, ఈ అమరిక బదులుగా మీరు సరిపోవునంత ఎక్కువ విలువను వుపయోగించాలి.

  • SystemTap ప్రస్తుతం GCCను user-space ఈవెంట్సను ప్రోబ్‌చేయుటకు వుపయోగిస్తుంది. ఏమైనప్పటికి, పారామితులకొరకు GCC ఖచ్చితమైన స్థానపు జాబితా సమాచారముతో డీబగ్గర్సును అందివ్వలేదు. కొన్ని సందర్భాలలో, కొన్ని పారామితుల ప్రత్యక్షతను అందించుటలో GCC విఫలమైంది. కాబట్టి, user-spaceను ప్రోబ్ చేసే SystemTap స్క్రిప్టులు సరికాని రీడింగులను యిస్తాయి.

  • IBM T41 లాప్‌టాప్ మోడల్ Suspend Modeను సరిగా ప్రవేశపెట్టలేదు; అందుకని, Suspend Mode బ్యాటరీ లైఫ్‌ను సాదారణముగా ఖర్చుచేస్తుంది. ఇందుకనే Red Hat Enterprise Linux 5 యింతవరకు radeonfb మాడ్యూల్‌ను చేర్చలేదు.

    దీనికొరకు, ఒక స్క్రిప్టును hal-system-power-suspend నామముతో /usr/share/hal/scripts/కు ఈక్రింది వరుసలతో జతచేయుము:

    chvt 1
    radeontool light off
    radeontool dac off

    IBM T41 లాప్‌టాప్ సరిగా Suspend Modeకు వెళ్ళునట్లు స్క్రిప్టు చేస్తుంది. సాదారణ ఆపరేషన్సును సరిగా సిస్టమ్ తిరిగి కొనసాగించుటకు, restore-after-standby స్క్రిప్టును అదే డైరెక్టరీకు జతచేయుము, క్రింది వరుసలను కలిగివుంటుంది:

    radeontool dac on
    radeontool light on
    chvt 7
  • edac మాడ్యూల్ లోడైతే, BIOS మెమొరీ నివేదీకరణ పనిచేయబోదు. ఇది యెందుచేతనంటే BIOS మెమొరీ దోషములను నివేదించుటకు వుపయోగించే రిజిస్టర్లను edac మాడ్యూల్ శుభ్రంచేస్తుంది.

    ప్రస్తుత Red Hat Enterprise Linux డ్రైవర్ నవీకరణ మాడ్యూల్ అన్ని అందుబాటులోవున్న మాడ్యూల్సు (edac మాడ్యూల్ కూడా)ను అప్రమేయంగా లోడుచేయమని, కెర్నల్‌ను సూచిస్తుంది. మీరు BIOS మెమొరీ నివేదీకరణను మీ సిస్టమ్‌నందు కోరుకుంటే, మీరు మానవీయంగా edac మాడ్యూళ్ళను బ్లాక్‌లిస్టు చేయవలసివుంటుంది. అలా చేయుటకు, క్రింది వరుసలను /etc/modprobe.confకు జతచేయుము:

    blacklist edac_mc
    blacklist i5000_edac
    blacklist i3000_edac
    blacklist e752x_edac
  • బ్లాక్ పరికరముయొక్క ఆన్‌లైన్ పెరుగుదల లేదా తరుగుదలను Red Hat Enterprise Linux 5.3 గుర్తించగలదు. ఏమైనప్పటికి, పరికరము పరిమాణము మారితే స్వయంచాలకంగా గుర్తించుటకు ఎటువంటి పద్దతిలేదు, దీనిని గుర్తించుటకు మరియు పరికరముల నందలి ఫైల్ సిస్టమ్సును పునఃపరిమాణంచేయుటకు మానవీయంగా చేయవలసివుంది. పునఃపరిమాణం చేసిన బ్లాక్ పరికరము గుర్తించబడినప్పుడు, సిస్టమ్ లాగ్‌లనందు ఈ క్రిందిదానివలె సందేశం కనిపిస్తుంది:

    VFS: మార్చిన మాధ్యమంనందు రద్దీ నోడ్సు లేదా పునఃపరిమాణంచేసిన డిస్కు sdi

    బ్లాక్ పరికరము పెరిగితే, అప్పుడు ఈ సందేశము భద్రముగా వదిలివేయబడుతుంది. ఏమైనప్పటికి, బ్లాక్ పరికరము ముందుగా దానినందలి ఏ డాటా సెట్‌ను తరిగించకుండా బ్లాక్ పరికరమును తరిగించితే, పరికరమునందు వున్న డాటా చెడిపోవచ్చు.

    పూర్తి LUN (లేదా బ్లాక్ పరికరము) పైన సృష్టించబడిన ఫైల్‌సిస్టమ్ యొక్క ఆన్‌లైన్ పునఃపరిమాణ చేయుట మాత్రమే సాధ్యమవుతుంది. బ్లాక్ పరికరముపైన విభజన పట్టికవుంటే, అప్పుడు విభజన పట్టికను నవీకరించుటకు ఫైల్‌సిస్టమ్‌ను అన్‌మౌంట్ చేయాలి.

  • మీ సిస్టమ్ GFS2 ఫైలు సిస్టమ్‌ను మౌంటై కలిగివుంటే, క్యాచ్‌డ్ ఐనోడ్ వొకనోడునందు యాక్సిస్ కాబడి వేరొక నోడ్‌నందు అన్‌లింకు కాబడితే నోడ్ అసలు స్థంబించవచ్చు. ఇది జరిగినప్పుడు, సాదారణ క్లస్టర్ రికవరీ మెకానిజం ద్వారా మీరు తిరిగితెచ్చునంత వరకు ఈ స్థంబించిన నోడ్ అందుబాటులో వుండదు. స్థంబించిన నోడ్‌నందు యిరుక్కున్న ఏ ప్రోసెస్ యొక్క స్టాక్ ట్రేసెస్ నందైనా ఫంక్షన్ కాల్సు gfs2_dinode_dealloc మరియు shrink_dcache_memory కనిపిస్తాయి.

    ఈ విషయం వొంటరి-నో‍డ్ GFS2 ఫైల్ వ్యవస్థలపై ప్రభావం చూపదు.

  • ఈ క్రింది సందేశము సిస్టమ్ బూట్‌నందు యెదురు కావచ్చు:

    Could not detect stabilization, waiting 10 seconds.
    Reading all physical volumes.  This may take a while...
    ఈ విరామం (హార్డువేరు ఆకృతీకరణపై ఆధారపడి, యిది 10 సెకనులవరకు వుండగలదు) కెర్నల్ డిస్కు స్కానింగును పూర్తిచేయుటకు తప్పనిసరి.

  • ipmitool నందలి User Payload Access యొక్క సరైన అభివృద్దీకరణ మిమ్ములను పరికరములను ఆకృతీకరించుటకు అనుమతిస్తుంది, అయితే ఆ పరికరముల కొరకు ప్రస్తుత అమరికలను పొందుటకు మిమ్ములను అనుమతించదు.

  • ఒకే సమయంలో కిక్‌స్టార్టు ఫైలునందు --maxsize పారామితిని అమర్చకుండా swap --grow పారామితిని వుపయోగించుట అనకొండ swap గరిష్ట విభజనపై నిర్భందము నిర్ణయించునట్లు చేస్తుంది. ఇది దానిని పెరిగి పరికరాన్ని నింపుటకు అనుమతించదు.

    2GB కన్నా తక్కువ భౌతిక మెమొరీవున్న సిస్టమ్స్‍‌కు, నిర్ణయించిన నిర్భందము భౌతిక మెమొరీకు రెండురెట్లు. 2GB కన్నా యెక్కువవున్న సిస్టమ్స్‍‌కు, నిర్ణయించిన పరిమితి పరిమాణం వున్న భౌతిక మెమొరీకు 2GB అదనం.

  • gfs2_convert ప్రోగ్రామ్ GFS2 క్రిందన వుపయోగించబడకుండా వున్న అన్ని బ్లాకులను GFS మెటాడాటా నుండి ఖాళీ చేయలేకపోవచ్చు. ఈ వుపయోగించి మెటాడాటా బ్లాకులు gfs2_fsck తరువాతి సారి ఫైలు సిస్టమ్‌నందు నడుపబడినప్పుడు గుర్తించబడి తొలగించబడతాయి. ఫైలు సిస్టమ్ వుపయోగించని బ్లాకులను ఖాళీ చేయుటకు మార్పుచెందిన తర్వాతన gfs2_fsck నడుపుట సిఫార్సు చేయబడింది. ఈ వుపయోగించని బ్లాకులు gfs2_fsck ద్వారా యిటువంటి సందేశాలతో ఫ్లాగ్ చేయబడివుంటాయి:

    Ondisk and fsck bitmaps differ at block 137 (0x89) 
    Ondisk status is 1 (Data) but FSCK thinks it should be 0 (Free)
    Metadata type is 0 (free)
    ఈ సందేశాలు GFS2 ఫైలు సిస్టమ్ చెడిపోవుటను సూచించవు, అవి ఖాళీ చేయబడిన బ్లాకులను సూచిస్తాయి, చేయబడని వాటిని సూచించవు. ఖాళీ చేయవలసిన బ్లాక్‌ల సంఖ్య ఫైలు సిస్టమ్ పరిమాణము మరియు బ్లాక్ పరిమాణముపై ఆధారపడి మారుతూ వుంటుంది. చాలా ఫైలు సిస్టమ్సు ఈ సమస్యను యెదుర్కొనవు. పెద్ద ఫైలు సిస్టమ్సు తక్కువ సంఖ్యలో బ్లాకులను కలిగివుండవచ్చు (100 కన్నా తక్కువ).

8.2. x86 ఆకృతులు

  • బేర్-మెటల్ ను(non-Virtualized)కెర్నల్ నడుపుతున్నప్పుడు,X సర్వర్ EDID సమాచారాన్ని మానిటర్ నుండి తెచ్చుకోలేదు.ఇది జరిగినప్పుడు గ్రాఫిక్ డ్రైవర్ 800x600 కన్నా ఎక్కువ రెజొల్యూషన్ ప్రదర్శింపలేదు.

    దీని కోసం,/etc/X11/xorg.conf విభాగం యొక్క ServerLayout కు ఈ క్రింది పంక్తిని కలపండి.

    Option "Int10Backend" "x86emu"
  • Dell M4300 మరియు M6300 నందు రికార్డింగు అవసరములు మానవీయంగా చేతనం చేయవలసివుంటుంది. అది చేయుటకు, ఈక్రింది అంచేలను అనుసరించుము:

    1. alsamixerను తెరువుము.

    2. View క్షేత్రము (మెనూయొక్క పైఎడమన వుంది) నందలి [Capture]కు మారుటకు Tab నొక్కుము.

    3. Space బార్‌ను వత్తుము.

    4. రికార్డింగు చేతనమైందని నిర్ధారించుటకు, ADCMux క్షేత్రము పైని టెక్స్టు L R CAPTURను ప్రదర్శించాలి.

  • సిస్టమ్ సంస్థాపననందు ఎన్క్రిప్షన్ బూట్ పరికరముపై చేతనం చేయబడితే, ఈ క్రింది సందేశము సిస్టమ్ బూట్‌నందు లాగ్ కాబడుతుంది:

    padlock: VIA PadLock not detected.
    ఈ సందేశమును నిర్భయంగా వదిలివేయవచ్చు.

8.3. x86_64 ఆకృతులు

  • NVIDIA గ్రాఫికల్ కార్డులను ఉపయోగిస్తున్న కంప్యూటర్లు చెడిపోయిన గ్రాఫిక్సుని లేదా ఫాంటుని గ్రాఫికల్ సంస్థాపనను ప్రదర్శిస్తున్నప్పుడు లేదా గ్రాఫికల్ ప్రవేశమప్పుడు ప్రదర్శించవచ్చు. దీనితో పనిచేయటానికి, వర్చ్యువల్ కన్సోలుకి వెళ్లండి లేదా వర్చ్యువల్ X ఆతిధేయికి తిరిగి వెళ్లండి.

  • IBM T61 లాప్‌టాప్ నందు, మీరు glxgears విండో ( glxgears నడుస్తున్నప్పుడు)ను నొక్కవద్దని Red Hat గట్టిగా సిఫార్సు చేస్తోంది. అలాచేయుట సిస్టమ్ లాక్ అగుటకు కారణంకావచ్చు.

    ఇది జరగకుండా వుంచుటకు, tiling సౌలభ్యాన్ని అచేతనము చేయుము. అలా చేయుటకు, ఈ క్రింది వరుసను /etc/X11/xorg.confయొక్క పరికరము విభాగమునందు చేర్చుము:

    Option "Tiling" "0"
  • Dell M4300 మరియు M6300 నందు రికార్డింగు అవసరములు మానవీయంగా చేతనం చేయవలసివుంటుంది. అది చేయుటకు, ఈక్రింది అంచేలను అనుసరించుము:

    1. alsamixerను తెరువుము.

    2. View క్షేత్రము (మెనూయొక్క పైఎడమన వుంది) నందలి [Capture]కు మారుటకు Tab నొక్కుము.

    3. Space బార్‌ను వత్తుము.

    4. రికార్డింగు చేతనమైందని నిర్ధారించుటకు, ADCMux క్షేత్రము పైని టెక్స్టు L R CAPTURను ప్రదర్శించాలి.

  • మీ సిస్టమ్ Intel 945GM గ్రాఫిక్స్‍ కార్డ్‍‌ను వుపయోగిస్తుంటే, i810 డ్రైవర్‌ను వుపయోగించవద్దు. బదులుగా మీరు అప్రమేయ intel డ్రైవర్‌ను వుపయోగించాలి.

  • ద్వంద-GPU లాప్‌టాప్స్‍‌నందు, ఒక గ్రాఫిక్స్‍ chips Intel-ఆధారితమైనది అయితే, Intel గ్రాఫిక్స్‍ మోడ్ ఎటువంటి బహిర్గత డిజిటల్ అనుసంధానములు( HDMI, DVI, మరియు DisplayPort)ను నడుపలేదు. ఇది Intel GPU యొక్క హార్డువేరు పరిమితి. మీకు బహిర్గత డిజిటల్ అనుసంధానములు అవసరమైతే, సిస్టమ్‌ను డిస్క్రీట్ గ్రాఫిక్స్‍ చిప్‌ను వుపయోగించుటనట్లు ఆకృతీకరించుము (BIOS నందు).

8.4. PowerPC ఆకృతులు

  • డీబగ్గుకు Alt-SysRq-Wని ఉపయోగిస్తున్నప్పుడు, కింది హెచ్చరికల సమాచారం కనిపిస్తుంది:

    Badness in smp_call_function at arch/powerpc/kernel/smp.c:223

    తరువాత, కంప్యూటరు హాంగవుతుందనని అది హెచ్చరిస్తుంది. కంప్యూటరు హాంగవ్వటానికి అది కారణం కాకపోతే దాన్ని గుర్తించక్కర్లే.

  • Dell M4300 మరియు M6300 నందు రికార్డింగు అవసరములు మానవీయంగా చేతనం చేయవలసివుంటుంది. అది చేయుటకు, ఈక్రింది అంచేలను అనుసరించుము:

    1. alsamixerను తెరువుము.

    2. View క్షేత్రము (మెనూయొక్క పైఎడమన వుంది) నందలి [Capture]కు మారుటకు Tab నొక్కుము.

    3. Space బార్‌ను వత్తుము.

    4. రికార్డింగు చేతనమైందని నిర్ధారించుటకు, ADCMux క్షేత్రము పైని టెక్స్టు L R CAPTURను ప్రదర్శించాలి.

  • PPC కెర్నల్ ప్రతిబింబము యొక్క పరిమాణం ఓపెన్‌ఫర్మ్‍‌వేర్ మద్దతిచ్చుటకు చాలా పెద్దది. తదనుగుణంగా, నెట్వర్కు బూటింగ్ విఫలమౌతుంది, ఈ క్రింది దోషాన్ని యిస్తుంది:

    Please wait, loading kernel...
    /pci@8000000f8000000/ide@4,1/disk@0:2,vmlinux-anaconda: No such file or directory
    boot: 
    దీనిని సరిదిద్దుట కొరకు:
    1. IBM స్ప్లాష్ తెర ప్రదర్శితమవగానే '8'కీ వత్తి, ఓపెన్ ఫర్మ్‍‌వేర్ ప్రామ్టుకు బూట్ అవ్వు.

    2. ఈ క్రింది ఆదేశమును నడుపుము:

      setenv real-base 2000000

    3. ఈ ఆదేశముతో సిస్టమ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (SMS)కు బూట్ అవ్వుము:

      0
      > dev /packages/gui obe

8.5. s390x ఆకృతులు

  • 2GB కన్నా ఎక్కువ అతిధేయి నిల్వసామర్ధ్యం నిర్వచించబడివున్న z/VM పై Red Hat Enterprise Linux 5.2 నడుస్తున్నప్పుడు, QDIO రీతినందు Queued-I/O సహాయకి (QIOASSIST) ఐచ్చికం చేతనం చేయబడినదానితో అనుబందించబడిని ఏ FCP మరియు OSA పరికరంకు డాటా వ్రాయగలదు నుండి చదవగలదు. మీ సిస్టమ్ అటువంటి పరికరాలతో అనుబందించివుంటే, Red Hat క్రిందిలింకు నుండి సంభందిత z/VM ప్రోగ్రామ్ టెంపరరి ఫిక్స్‍ (PTF) ను సంస్థాపించమని సిఫార్స్‍ చేస్తోంది:

    http://www-1.ibm.com/support/docview.wss?uid=isg1VM64306

  • z/VM డంప్‌ను దస్త్రములోనికి నేరుగా చదువుటకు మరియు మార్చుటకు అసాధ్యం. బదులుగా, vmur ఉపయోగించి మీరు ముందుగా డంప్‌ను z/VM చదువరిని నుండి లినక్స్‍‌ లోనికి నకలుతీయాలి మరియు డంప్‌ను లైనక్స్‍-చదవగల దస్త్రములోనికి vmconvert ఉపయోగించి మార్చవలెను.

  • IBM System z అనునది సాంప్రదాయ యునిక్స్‍-శైలి భౌతిక కన్సోల్‌ను అందివ్వదు. అందుకని, Red Hat Enterprise Linux 5.2 IBM System z కొరకు firstboot క్రియాశీలతను ప్రారంభ ప్రోగ్రామ్‌ లోడ్‌నందు మద్దతునీయదు.

    IBM System z పైన Red Hat Enterprise Linux 5.2 కొరకు సరిగా అమర్పును సిద్దపరచుటకు, సంస్థాపనతర్వాత క్రింది ఆదేశాలను నడుపుము:

    • /usr/bin/setup -- provided by the setuptool package.

    • /usr/bin/rhn_register -- rhn-setupప్యాకేజీతో సమకూర్చబడింది

8.6. ia64 ఆకృతి

  • kexec purgatory కోడ్‌నుండి కొన్ని Itanium సిస్టమ్స్‍ కన్సోల్ అవుట్‌పుట్‌ను సరిగా ప్రదర్శించలేవు. క్రాష్‌తర్వాత మెమొరియొక్క మొదటి 640k ను వెనక్కుతీసుకోవటానికి కావలిసిన సూచనలను ఈ కోడ్ కలగివుంటుంది.

    purgatory కన్సోల్ అవుట్‌పుట్ సమస్య అంచనాకు ఉపయోగపడుతున్నప్పుడు, kdump సరిగా పనిచేయవలిసిన అవసరంలేదు. అందుకని, Itanium సిస్టమ్ kdump కార్యమునందు తిరిగివుంచబడితే, /etc/sysconfig/kdump నందలి KEXEC_ARGS చరరాశికి --noio జతచేయుట ద్వారా purgatory నందు కన్సోల్ అవుట్‌పుట్‌ను అచేతనంచేయుము.

  • విభిన్నమైన CPU వేగములు గుర్తిస్తే perftest నడుపుట విఫలము కావచ్చు. అందుకని, మీరు perftest నడుపుటకు ముందుగా CPU వేగము స్కేలింగును అచేతనము చేయాలి.

  • kdump కెర్నల్ బూట్ అయినప్పుడు, ఈ క్రింది దోషము బూట్ లాగ్‌నందు కనిపిస్తుంది:

    mknod: /tmp/initrd.[numbers]/dev/efirtc: అటువంటి ఫైలు (లేదా) ‍డైరెక్టరీ లేదు.

    సరికాని పాత్‌లో efirtcను సృష్టించుటకు చెడ్డ అభ్యర్ధననుండి ఈ దోషము సంభవిస్తుంది. ఏమైనప్పటికి, kdump సేవ ప్రారంభమైనప్పుడు ప్రశ్ననందలి పరికరపు పాత్ initramfsనందు స్టాటికల్‌గా సృష్టించబడుతుంది. అందుకని, పరికరపు నోడ్ రన్-టైమ్ సృష్టీకరణ నష్టములేనిది, మరియు kdump యొక్క పనితనాన్ని ప్రభావితం చేయదు.

  • కొన్ని సిస్టమ్సు kdump కెర్నల్‌ను బూట్ చేయలేక పోవచ్చును. అటువంటి సందర్భములలో, కెర్నల్ పారామితి machvec=digను వుపయోగించుము.

  • Dell M4300 మరియు M6300 నందు రికార్డింగు అవసరములు మానవీయంగా చేతనం చేయవలసివుంటుంది. అది చేయుటకు, ఈక్రింది అంచేలను అనుసరించుము:

    1. alsamixerను తెరువుము.

    2. View క్షేత్రము (మెనూయొక్క పైఎడమన వుంది) నందలి [Capture]కు మారుటకు Tab నొక్కుము.

    3. Space బార్‌ను వత్తుము.

    4. రికార్డింగు చేతనమైందని నిర్ధారించుటకు, ADCMux క్షేత్రము పైని టెక్స్టు L R CAPTURను ప్రదర్శించాలి.

  • Intel Itanium-based సిస్టమ్సు SELinux ఎన్ఫోర్సింగ్ మోడ్‌నందు నడుస్తున్నప్పుడు, allow_unconfined_execmem_dyntrans లేదాallow_execmem బూలియన్సు తప్పక ఆన్ చేయాలి IA-32 Execution Layer (ia32el సేవ) సరిగా పనిచేయుటకు. allow_unconfined_execmem_dyntrans బూలియన్ అఫ్ అయివుంటే, allow_execmem బూలియన్ ఆన్ అయివుంటే, Red Hat Enterprise Linux 5నందు అప్రమేయంగా, ia32el సేవ 32-bit ఎమ్యులేషన్‌ను మద్దతిస్తుంది; రెండు బూలియన్స్‍ ఆఫ్ అయివుంటే, ఎమ్యులేషన్ విఫలమౌతుంది.

A. పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర

Revision History
Revision 1.016th October 2008Ryan Lerch